సూరీడుతో పరుగు పందెం..గెలుపు నాదే :)


సూరీడుతో పరుగు పందెం..గెలుపు నాదే 🙂

 ఉదయం: 
              గోరు వెచ్చటి సూరీడు నునులేత కిరణాలతో మేలుకొలుపు,      
              మరోరోజు కోసం ఉత్సాహంగా ఉల్లాసంగా వేలుకోలుపు,
              పొగమంచును చీల్చుకుంటూ ధరణిని చేరే వెలుగు రేఖలు,
              కష్టాలను ఎదురుకుంటూ విజయాలను వరించే ప్రయత్నాలు.

 

మధ్యాహ్నం:
                     వేడెక్కిన సూరీడు నిప్పులు చెరుగుతున్న మిట్ట మధ్యాహ్నం,
                     గమ్యం చేరటానికి శ్రమతో కారుతున్న స్వేదం,
                     ఆవిరవుతున్న నీటిమట్టాలు,
                     అలసిపోతున్న దేహాలు.

సాయంత్రం:
              చల్లబడ్డ సూరీడు చిరుగాలులను స్వాగతిస్తూ,
              వీడ్కోలు పలికే సాయం సమయం,       
              విజయం దరిచేరి, వినయం చెంతన, సేదతీరే స్వేదం,
              మరో రోజు కోసం మరి సిద్ధం.

End of the day:
                 సూర్యుడితో పరుగు పందెం,
                 చందమామ సాక్ష్యం,
                 గెలుపు వరించిన వైనం,
                 తారలు జల్లిన ప్రసంశల వర్షం,
                 ఆకాశం చరిచిన చప్పట్లు.

 

You may like : అనుదినం అన్నీ విజయాలే విజయాలు   

 
This entry was posted in కవితలు, జీవితం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s