కారులో షికారుకెళ్ళే..


కారులో షికారుకెళ్ళే..

తప్పని పరిస్థితుల్లో నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ దేశంలో డ్రైవింగ్ లైసెన్సు తెచ్చుకోవటం అంటే PHD చెయ్యటంతో సమానం అని నానుడి. Signal test (రాత పరీక్షా), Yard/Parking test, prefinal and final test. signal, yard test pass అవ్వటం పెద్ద కష్టం కాదు. prefinal కొంచెం కష్టం, final చాలా చాలా కష్టం. Final test లో 80% కనీసం 3 లేక 4 సార్లు తప్పుతారు. ఈ తప్పడాలు నాలాగా మొదటిసారి నేర్చుకునే వారు అనుకునేరు. చాలా సంవత్సరాలు ఇండియాలో డ్రైవ్ చేసిన వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే. 8 నుంచి 10 సార్లు తప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇంకో పెద్ద జోక్ ఏమిటంటే ఫైనల్ టెస్ట్ కి  వచ్చిన కొద్ది మందిని తిరిగి prefinal కి కూడా పంపిన కేసులు ఉన్నాయి. లైసెన్సు కోసం  ఖర్చు పెట్టే డబ్బులతో ఓ చిన్న used car కోనేసుకోవచ్చు.  

మొత్తానికి prefinal రెండు సార్లు తప్పి, ఫైనల్ ఒకసారి తప్పి లైసెన్సు తెచ్చుకున్నా! తెలిసిన వాళ్ళు “అబ్బో నీకు భలే తొందరగా వచ్చేసిందే”, అంటుంటే తెగ ఫీల్ అయిపోయా. నాకేమి తెలుసు ముందుంది క్రోకోడయిల్స్ ఫెస్టివల్ అని.  లైసెన్సు వచ్చిన రోజు సాయంత్రం నేను, మా వారు, పిల్లలు పిజ్జాహట్ కు వెళ్లి చిన్న పార్టీ కూడా చేసేసుకున్నాం. 

కారు కొందామని ప్రయత్నాలు మొదలు పెట్టాము. అది కొంచెం టైం తీసుకోవటంతో, నేనో వీకెండ్ మార్నింగ్ రోడ్లన్నీ కాలీగా వుంటాయి కదా అని మా పెద్ద కార్ ని డ్రైవ్ చేస్తా అని మా వారిని అడిగా.  నీ కసలే సవా లక్ష conditions, steering కు బిగుసుకుపోతావ్, మ్యూజిక్ పెట్టనివ్వావు, పిల్లల్ని మాట్లాడోద్దంటావ్  అంటూ lecture మొదలుపెట్టేటప్పటికి, నేను కొంచెం ఉగ్రరూపం దాల్చా. మొత్తానికి పిల్లల సమేతంగా బయలుదేరాము. ధైర్యం తెచ్చుకుని డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నా!!@@@$$???……..వెనుక సీట్లో కూర్చున్న నా నలుగున్నరేళ్ళ కొడుకు ఏడుపు లంకించుకున్నాడు!!???^^&&&$$$. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే అంటాడు …ఎందుకులెండి చెప్పుకుంటే సిగ్గు చేటు…అయినా చెపుతున్నా…only daddy should drive అంట, అమ్మ ఆ సీట్లోనే కూర్చో కూడదంట. ఎంత చెప్పినా వినడే. ఏదో అతి కష్టం మీద నలుగు రౌండ్లు వేసి ఆపేసా. అప్పుడు ఆపాడు ఏడుపు.

 ఓ చిన్న కారు కొనుక్కున్నా. వీకెండ్లో ఇంటి నుంచి ఆఫీసుకి, ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళే అన్ని రూట్లు చూసుకుని, round abouts ఎక్కువగా లేని ఒక రూట్ డిసైడ్ చేసుకుని enough ప్రాక్టీసు చేసేసా.

 ఓ పుణ్యదినాన నా కారులో ఆఫీసుకు బయలుదేరా. దేవుడికి దణ్ణం పెట్టుకునే కార్ స్టార్ట్ చేశా. first point, main road లో join అవ్వాలి. కాస్త నిమ్మళంగా, అన్ని వైపులా చూసుకోవాలి కదా?? నా వెనుక ఆగిన కారు మహాశయుడు హార్న్ వేసాడు. కంగారు పడిపోయి Accelerator నొక్కేసరికి మెయిన్ రోడ్లో వచ్చి పడ్డా. Next point, Uturn మళ్లీ horn….నాకెంత ఒళ్ళు మండిపోయిందంటే, ఓ అరనిమిషంలో ఆఫీసు కి దూసుకేల్లిపోతాడా??

 safe గా ఆఫీసు దగ్గరకు చేరా. మెయిన్ ఎంట్రన్సు దగ్గర సెక్యూరిటీ ఆపాడు. కుడి చేతి వైపు నుంచుని ఉన్నాడు. నేను అద్దం కిందకు దించి నా ID card చూపించాలి కదా. ఏమని చెప్పమంటారు నా బాధ. locking button press చేస్తున్నా…lock, unlock, lock…ఆ విండో మాత్రం డౌన్ అవ్వట్లా…పాపం ఆ సెక్యూరిటీ గార్డ్ నవ్వుకుంటూ other side వచ్చాడు. కొత్త కారా అంటూ నవ్వాడు. తలెక్కడ పెట్టుకొవాలో అర్థం కాలేదు. కొత్త డ్రైవింగ్ అని ఇకిలించా.

 
కాంపస్ లోకి ఎంటర్ అయ్యి పార్కింగ్ దగ్గరకు వచ్చా. అక్కడ మరో సెక్యూరిటీ గార్డ్ ఆపాడు. ఇది స్టాఫ్ reserved parking, నీకు స్టాఫ్ sticker లేదు, వెళ్లి visitors parking slot లో park చెయ్యి అన్నాడు. అక్కడెక్కడో పార్క్ చేసంట ఓ KM నడిచి రావాలంట!!! ఏదో బతిమాలుకుని నా ID కనిపించేటట్లు పెడతానని చెప్పుకుని పార్క్ చేశా. ఓ నాలుగైదు సార్లు adjust చేసి Successful గా పార్క్ చేసేసా.
 

Ignition off చేసి, కీ బయటకు  తీసి , కార్ దిగి లాక్ చేశా. దగ్గరలో building construction జరుగుతుంది, construction sound వినిపిస్తుంది. నాకో డౌట్…..మీరే ఊహించుకోండి….

నేను set చేసుకున్న rules

1. speed 80 to 100

2. be on the middle lane

3. don’t respond to horns.

హాయిగా passenger seat లో కుర్చుని, దిక్కులు చూస్తూ ఎంజాయ్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ, శ్రీవారికి సలహాలు, హెచ్చరికలు చెయ్యటం ఎంత బాగుంటుందో కదా..

మా నాన్న గారు చదువు విషయంలో తప్పితే, మిగతా అన్ని విషయాలలో బాగా గారాబం చేసారు. చక్కగా కాలేజీ కు, tutions కు స్కూటర్ పైన దింపేవారు. నాకు దొరికిన ఫ్రెండ్స్ కూడా నన్ను ఎప్పుడూ పికింగ్లు, డ్రాపింగ్లు   చేసేవారు. I miss all those days…

  

 

This entry was posted in నా అనుభవాలు. Bookmark the permalink.

8 Responses to కారులో షికారుకెళ్ళే..

 1. geetha says:

  mee car prahasanam bagundi. nenu india lo license badhithuralni. anduke mee badha naaku ardham aindi.

 2. Deepthi says:

  maaku nee sangathi thelisay kadhaa ninnu driving cheyyanivvakundaa memu pickingulu, droppingulu chesindhi college days lo…..ha ha ha.

  Anyway, congratulations on your new car. Enjoy!!!

 3. ramesh says:

  “ఎందుకురా ఏడుస్తున్నావు అంటే అంటాడు …ఎందుకులెండి చెప్పుకుంటే సిగ్గు చేటు…అయినా చెపుతున్నా…only daddy should drive అంట, అమ్మ ఆ సీట్లోనే కూర్చో కూడదంట. ఎంత చెప్పినా వినడే. ఏదో అతి కష్టం మీద నలుగు రౌండ్లు వేసి ఆపేసా. అప్పుడు ఆపాడు ఏడుపు.”

  అది మీ వారి training ఏమొ తెలుసుకున్నారా? Just Kidding!.

 4. రమేష్ గారు: అదే పనిలో ఉన్నా…భూతద్దం పట్టుకుని రంధ్రాన్యేషన పనిలోనే ఉన్నా…కనిపెడతా…కనిపెడతా…
  మనలో మాట..ఈ మొగ పిల్లలకు, పెద్దలకు ఒకళ్ళు నేర్పాలంటండి?? (kidding..)

 5. Anonymous says:

  ma amye parsithe edi us velli 4yrs ayutandi ikada unaanthkalame me dad lagane nenu kuda
  epudu nerchukuntondo chudali
  oka 2 months vadvu ante gents kana ladies bhga drive chestaru
  ok bye take care

 6. Ante anubhavamulo nenu chaala mundunnanannamate.
  Maa friends car lo mundu koorchuni salahalu, jaagrathalu, rules vagaira vagaira isthuntaanu
  Nadapadamu driver pani, koorchuni alochinchi prakruthi darshanamu cheyadamu owner pani ani nammuthu kotha kaarukoni naduputhunnanduku abhinandisthu
  mee
  Chari Mugala

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s