ఎటు పోతున్నాం..మనం ఎటుపోతున్నాం?


ఎటు పోతున్నాం..మనం ఎటుపోతున్నాం?

ప్రకృతి ప్రళయ తాండవం ఓ వైపు,
ప్రజా ఉద్యమాల ఉన్మాదాలు మరో వైపు,
రెచ్చగొట్టే ప్రసంగాలు ఓ వైపు,
ఆవేశంతో రెచ్చిపోతున్న యువత మరో వైపు,
ఆవేశంలో ఆలోచన నశించి పోగా,
పరిస్థితులను కాష్ చేసుకుంటున్న నాయకులు అన్నివైపులా…
ఇవి,
అభివృద్ది వైపు పరుగులా?
వినాశనం వైపు ఉరుకులా?
ఎటు పోతున్నాం..మనం ఎటుపోతున్నాం?

భూమి తల్లి,
తన బిడ్డలను తనే మింగేస్తుంటే,
ఉద్యమాల ఉసురులో,
బిడ్డలు ప్రాణాలు ఒదులుతుంటే,
ఉన్మాదులు ఉద్యమాలలో చొరబడిపోయి,
రాక్షస చర్యలతో అరాచకం సృష్టింస్తుంటే,
ఆ అరాచకాలను సమర్ధించుకుంటూ,
ఎటు పోతున్నాం..మనం ఎటుపోతున్నాం?

ప్రకృతికి ఎదురు నిలిచి నిలవగలమా?
వికృత చేష్టలతో,
రాష్ట్రాలు, రాజ్యాలు విడగొట్టగలమా, నిలబెట్టగలమా?

జలప్రళయంలో కొట్టుకుని పోయినవి కొట్టుకుపోగా,
రండి, మిగిలినవి కూల్చేసుకుందాం,
మన సంస్కారాన్ని, సంస్కృతిని,
మన వివేకాన్ని, విచక్షనను,
మన ఆలోచనను, అభివృద్దిని,
కుళ్ళబోడుచుకుని, కూల్చేసుకుని,
రక్తాన్ని తుడిచేసుకుని,
శవాల్ని ఏరేసుకుని,
భవిష్యత్తునంతా నీచ రాజకీయ నాయకులకు ధారపోసి,
మరో రాజ్యాన్ని, రాష్ట్రాన్ని నిర్మించుకుందాం,
వినాశనమైపోయిన తర్వాత తీరిగ్గా విచారిద్దాం…

This entry was posted in సమాజంలో సామాన్యులు. Bookmark the permalink.

6 Responses to ఎటు పోతున్నాం..మనం ఎటుపోతున్నాం?

  1. Madhu Prakash Remella says:

    praveena garu..

    Chala Chala bagaa rasarandi… ilanti writings naku telisi ila oka blog ki parimitam avakudadu.. ivi anni newspaperslo headlines la ravali .. andaru chadavali .. idi choosina janallo edanna maarpu ravali… Hats off ….

  2. Thnaks Madhu Prakash garu..ఏవో ఆవేశంతో రాసే రాతలు అంతే..

  3. sarayu says:

    ee vinasananiki prathi okkaru bhadyule…okarini anukoni labham ledu..

  4. మీరు రాసే ప్రతీ పోస్టు చాలా బాగుంటున్నాయి….

    మీరు రాసేది నెను ఫేస్ బుక్ పోస్టు చెస్తున్నాను !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s