మన భారతం! అటువైపు అలా..ఇటు వైపు ఇలా…


మన భారతం! అటువైపు అలా..ఇటు వైపు ఇలా…

తిండి:

 • అటువైపెటో పూరి గుడిసెల్లో ఆకలి తీరని పేద కడుపుల ప్రేగు అరుపులు,
 • ఇటువైపెటో నక్షత్రాల హోటల్లో ఖరీదైన పింగాణి పాత్రల్లో వదిలేసినా ఆహారాన్ని చెత్త కుప్పల్లో పడేస్తూ వెండి చెంచాలు చేస్తున్న శబ్దాలు.

బట్ట:

 • అటువైపెటో చిరిగిన బట్టలు కుట్టుకుంటూ, మళ్ళి మళ్లీ కుట్టుకుంటూ, అరకొర దుస్తులతో శరీరాన్ని దాచుకునే ప్రయత్నం,
 • ఇటువైపెటో fashion కోసం jeans pants కత్తిరించుకుంటూ, చిన్నచితక గుడ్డలతో శరీరాన్ని బహిర్గత పరిచే ప్రయత్నం.

గూడు:

 • అటువైపెటో చెత్త కుప్పల చెంతన, రైలు కట్టల పక్కన , ఊరి పొలిమేరలలో ఎండా వానలకు తాలలేని పూరి గుడిసెల నివాసాలు,
 • ఇటువైపెటో ఫోష్ ఏరియాలల్లో చలువరాతి రాళ్ళు పొదిగి, సకల సౌఖర్యాలు కూర్చి, ఎండా వానలకు సబంధం లేని రాజభవనాల నివాసాలు.

చదువు:

 • అటువైపెటో సర్కారీ బళ్ళలో అర్ధాకలి కడుపులతో నేలపై కూలబడి, చీమిడి ముక్కులు ఎగచీదుతూ, పంతులు గారు నల్ల బోర్డుపై రాసే అక్షరాల వైపు బేలగా చూస్తున్న చూపులు,
 • ఇటువైపెటో concept school లో, ఆధునిక సౌఖర్యాలతో, కుషను కుర్చీలలో ఆశీనులై, టీచర్ గారు present చేస్తున్న animated power point slides వైపు నిశితంగా చూస్తున్న చూపులు.

miscellaneous:

 • అటువైపెటో ఫ్యాక్టరీ జీతగాళ్ళు తాగే నీరు, పీల్చే గాలి వ్యర్ధాల కలుషితం,
 • ఇటువైపెటో ఫ్యాక్టరీ యజమానులు తాగే నీరు, పీల్చే గాలి purifier లో పరిశుద్ధం.

 • అటువైపెటో బండ్రోతు కొడుకు బండ్రోతు, బండ్రోతు మనవడు బండ్రోతు,
 • ఇటువైపెటో వంశపారంపర్య సర్వాధికారం, యజమాని మునిమనవడు యజమాని.

 • అటువైపెటో పౌరుల ధిక్కార స్వరం,
 • ఇటువైపెటో ధిక్కారాన్ని అనగొట్టే అధికారం.

మన భారతం! అటువైపు అలా..ఇటు వైపు ఇలా…

నడుమ బాగుపడే దళారుల వేట పంట….

Note: ఈ photos అన్నీ google లో search చేసి copy చేసినవి. ఎవరికన్నా అభ్యంతరాలు ఉంటే తొలిగించబడును..

This entry was posted in ప్రజాస్వామ్యం, Uncategorized. Bookmark the permalink.

7 Responses to మన భారతం! అటువైపు అలా..ఇటు వైపు ఇలా…

 1. itsourteamwork says:

  nice post, I used to discuss about these things with my family, friends.

  India is really SHINING

 2. ramesh says:

  Nice!.

  All are known issues. Post possible solutions if you could think of any. 🙂

 3. చాలా బాగా says:

  బాగుంది

 4. కొత్తపాళీ గారు, itsourteamwork గారు,చాలా బాగా గారు: Thanks for responding..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s