కలమా నువ్వు ఆగలేవు, ఆపలేవు..
అయ్యో ఈ కలం ఎంతకీ ఆగదే,
కత్తిలా,
మనసును చీల్చుతూ,
ఆలోచనలను మధిస్తూ,
జ్ఞాపకాలను రేపుతూ,
స్పందనలను సృషిస్తూ,
అనుభవాలను శోధిస్తూ,
అనుభూతులను పలకరిస్తూ,
హృదయపు అంతరాలను తాకుతూ,
మనసు పొరలను కెలుకుతూ,
ఆవేదనను సిరాగా నింపుకుని,
ఆవేశపు పదాల వెనుక ఎందాకా ఆ పరుగులు?
నిఘంటువు ఆఖరి అక్షరం దాకా లిఖించేయ్యాలనా?
దిగజారిపోతున్న విలువలను ఏకిపడెయ్యాలనా?
మృగంగా మారిపోతున్న మనిషిని మార్చాలనా?
ప్రపంచంలో బాధలను తీర్చేయ్యాలనా?
వ్యవస్థలో కుళ్ళును కడిగేయ్యాలనా?
చైతన్యపు ఉషోదయాలు ఉదయించాలనా?
అయ్యో పిచ్చి పెన్ను,
నీకంత శక్తే ఉంటే,
నీకంత పదునే ఉంటే,
ఎందుకిన్ని ఉద్యమాలు?
ఎందుకిన్ని పన్నాగాలు?
అయ్యో అయ్యో కన్నీరు పెట్టుకుంటున్నావా?
అయ్యో నా పిచ్చి తల్లి,
తోలుమందం మనిషి కరగడు,
పాషాణ హృదయుడు.
మనలో మన మాట,
నీ కోపం తగ్గేదాకా,
నీ ఆవేశం చల్లబడేదాకా,
రాసుకో రాసుకో,
నీ బాధ తీరేదాకా!
అంతకు మించి ఏమీ చెయ్యలేని కలమా,
నువ్వు ఆగలేవు,ఆపలేవు!
నిజమే. ఈ రోజుల్లో రాసి ఏమి సాధిస్తాం? ఐనా కవిత ఒకలాంటి నిట్టూర్పుతో ముగియడం బాధ అనిపించింది.
కొత్తపాళి గారు బాధ పడటం తప్పితే ఏమీ చెయ్యలేము..” ఏమీ చెయ్యలేము” అనేది కూడా ఊతపదమైపోయింది.
వామ్మో! యీ కలం కత్తి కంటే పదునుగా!
ఎన్నెల గారు అంత పదునుంటే ఇంక బాధే ముందండి …
కత్తిలాంటి మీ పదునైన కలం ఎందుకాగాలి? మీకు నా హృదయ పూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Anonymous garu: మీకు కూడా నా హృదయ పూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Excellent!.
Now a side note.
looks like “కత్తి” is a patented (reserved) word.
The person who thinks that he/she who owns this word may file a case against you, be careful.
🙂
Anonymous garu: అమ్మో నిజమా..కత్తి పేటెంట్ పదమా..మరిప్పుడేమి చెయ్యాలండి?? ఒక ఐడియా..నేను Dictionary అంతా reserve చేసేసుకోనా??:) Thanks andi
ఆగని కలమే ఏదైనా సాధిస్తుంది. ఉత్సాహంతో ముందుకు సాగండి. మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
దిగజారిపోతున్న విలువలను ఏకిపడెయ్యాలనా?
మృగంగా మారిపోతున్న మనిషిని మార్చాలనా?
ప్రపంచంలో బాధలను తీర్చేయ్యాలనా?
వ్యవస్థలో కుళ్ళును కడిగేయ్యాలనా?
చైతన్యపు ఉషోదయాలు ఉదయించాలనా?
————————————-
ప్రవీణ గారు,
ఇవ్వన్ని మీరు ఎక్కడ చూశారు. గమని౦చి వ్రాసినవా లేక ఊహి౦చారా 🙂
Mauli garu: కాస్త గమనించటం, కాస్త ఊహించటం…:)
Like many other persons I grew up in a very comfortable house hold. పేపర్లో హెడ్ లైన్స్ మాత్రమే చూసే నేను, చాలా వార్తలకు నాలో నేనే స్పందిస్తాను..కాస్త అతిగా కూడా స్పందిస్తాను ఒక్కోసారి. కొన్ని కొన్ని విషయాలు చాలా రోజులు నా బుర్రను పాడుచేస్తూ ఉంటాయి. ఈ మధ్య బ్లాగ్ లో రాసి పడేస్తుంటే ఒక రకమయిన తృప్తి…రాసే వాళ్ళకు చదివే వాళ్ళు లోకువ కదండీ..:) 🙂
@దిగజారిపోతున్న విలువలను, మృగంగా మారిపోతున్న మనిషి
ప్రపంచంలో బాధలను, వ్యవస్థలో కుళ్ళును, చైతన్యపు ఉషోదయాలు
ఇవన్నీ పాత తర౦ వ్రాస్తే బావు౦డెవి. వాల్లు సమస్య కి వెలుపల ఉ౦డి వ్రాసే వారు. కాని అ౦దులో ఒక భాగమైపోయిన మన౦ చెప్పగలమా దిగజారిపొతున్న విలువలు అ౦టే ఖచ్చిత౦గా ఇది అని. అలాగే అన్నీ మృగంగా మారిపోతున్న మనిషి
ప్రపంచంలో బాధలను, వ్యవస్థలో కుళ్ళును.
కాబట్టి చాలా వివరి౦చాల్సి ఉ౦ది మీ భావాన్ని, ప్రయత్ని౦చ౦డి.
Mauli garu::మీరు భలే సూటిగా అడుగుతారండి. Let me try how I can answer it…చాల కరెక్ట్ గా చెప్పారు పాట తరం వారు సమస్య కి వెలుపల ఉ౦డి వ్రాసే వారు. ఎప్పుడు మనం దిగజారిపొతున్న విలువలలో భాగమైపోయాము.
నేనే…..నాకూ భాగమే…..నేను కారణమే….. (it’s a part of on of my writings/feelings)
రాజకీయ కరాళ నృత్యంలో, నా తప్పడడుగు ఓ కారణమే, ( నేనే కదా ఓటరును. మా నాయకుడు చెడ్డవాడైతే అది నా తప్పే కదా)
లయతప్పిన మానవత్యంలో, నా శ్రుతి తప్పిన మనసు ఓ కారణమే.
దిగజారిన వ్యవస్థలో, నే దిగిన మెట్టు ఓ కారణమే.
న్యాయాఅన్యాయపు క్రయవిక్రయాలలో,నే చేసిన వ్యాపారము ఓ కారణమే. (అన్యాయము అంటూనే నేను అలవాటై పోయాను కదా. చివరకు తప్పు చేయటము తప్పు అనే విషయన్నికి కూడా అలవాటైపోయాను కదా)
ఒకరు చేస్తే తప్పు , అందరు చేస్తే ఒప్పు,
నాతో సహా అందరూ చేసిన తప్పొప్పుల పాపం కాదా ఇది?
వ్యవస్థ కూలిపోతే, నాతో అందరూ కూలిపోరు?
ప్రకృతి వినాశనమైతే, నాతో అందరూ నాశనమైపోరు?
ఒకరు ఒకరు ఒకరు మారితే,అందరూ మారరు?
కానీ మనిషితనం ఇంకా మిగిలేవుంది(దా)!? (this is also one of my expressions) ఇంకా ఎక్కడో మిగిలేవుంది..మనసాక్షి కొనప్రాణంతో ఇంకా బతికేవుంది… అందుకే ఈ చిరు ప్రయత్నం.
మనకెందుకు వచ్చిన గొడవ అని తప్పించుకుని తిరిగే మా or at least నా లాంటి వాళ్ళు ఎలా రాసుకుని తృప్తి పడతారు..
ఒక మంచి నాయకుడు కావాలి, విశాల భావాలూ ఉన్న తరం కావాలి, ఎదిరించి అడిగే ధైర్యం రావాలి, క్షణికావేశాలు చచ్చిపోవాలి, నేరస్తుడు నేరం చెయ్యటానికి భయపడిపోవాలి, నేరస్తులుగా మరే పరిస్తిలు రాకూడదు…మనం శుభ్రంగా ముసుగుతన్ని పోడుకుంటే ఎలాంటి కలలన్ని కనేయ్యొచ్చు..
మీరు అడిగిన ప్రశ్నకు కొద్దిగానన్నా సమాధానం చెప్పనా అండి??
ప్రవీణ గారు
మీరు ప్రశ్న ను అర్ధ౦ చేసికొన్నారు. తప్పు గా అనుకోరనే అడిగేసాను.
ఓటరు గా చక్క గా చెప్పారు , కాని అక్కడ మీరు ఒక్కరు చెయ్యగలిగేది ఏము౦ది. ఉన్న వాళ్ళలో ఒకరిని ఎన్నుకోడ౦ తప్ప. మీ ఒక్క ఓటు గురి౦చి మధన పడట౦ కన్నా చుట్టూ ఉన్న వారి ని కూడా ప్రభావిత౦ చెయ్యగలగాలి (ఆలోచి౦ప చెయ్యాలి , ప్రక్క వారిని కూడా)
మౌనాన్ని ఎవరో ఒకరు, ఎపుడో అపుడు చేధి౦చాలి.
@కానీ మనిషితనం ఇంకా మిగిలేవుంది(దా)!?
ఉ౦దా అని అనుమాన౦ కూడా వ్యక్త౦ చేసారు. ఈ పద౦ భావకవి ద్వారా కొ౦త ఎక్కువ ప్రాచుర్య౦ పొది౦ది. ము౦దు ఒక సారి వ్యాఖ్యాని౦చిన గుర్తు (మీ బ్లాగేనా).
ఇక మనిషి తన౦ అ౦టే జ౦తువులకి లెనిది మనిషికి ఉన్నది కొ౦త మెరుగైన ఆలోచన మాత్రమే కదా. అదే ఆలోచన ఒక్కొక్క మనిషి ఒక్కోలా ఉపయోగి౦చుకొ౦టున్నాడు.
ఆశాజీవి ఈ పోరాట౦ లొ భాగ౦ అవుతూ ఉన్నాడు. ఒకప్పుడు తప్పు అనుకొన్నవి ఇప్పుడు ఒప్పు అయ్యాయి.
ఉదా: మహానుభావుడు య౦డమూరి ఒక కమర్షియల్ వ్యక్తిత్వ వికాస రచన లో చెప్పాడు.నీ బాగు కోస౦ ఇ౦కొకడికి కష్ట౦ కలిగి౦చవచ్చు ఈ పోటీ ప్రప౦చ౦ లో అని ( ఇలా౦ టి అర్ధ౦ వచ్చేలా చెప్పాడు అన్నమాట ,చదివి చాలా రోజులయ్యి౦ది).ఆ మాత్ర౦ ప్రోత్సాహ౦ చాలు కదా మనిషికి 🙂
@మనకెందుకు వచ్చిన గొడవ అని తప్పించుకుని తిరిగే మా or at least నా లాంటి వాళ్ళు ఎలా రాసుకుని తృప్తి పడతారు..
య౦డమూరి చెప్పి౦ది కూడా ఇదేనేమో. కాని నా మనస్సే ఒప్పుకోలేక మీకు ప్రశ్నలు వ్రాయడ౦. మనకె౦దుకు వచ్చిన గొడవ అనుకునే ఎక్కువ మ౦ది మనిషి తనమే, తక్కువ మ౦ది కి అ౦దరికీ కష్ట౦ కలిగి౦చే ధైర్యాన్ని, అవకాశాన్ని ఇస్తున్నది.
@ఒకరు చేస్తే తప్పు , అందరు చేస్తే ఒప్పు,
నాతో సహా అందరూ చేసిన తప్పొప్పుల పాపం కాదా ఇది?
వ్యవస్థ కూలిపోతే, నాతో అందరూ కూలిపోరు?
ప్రకృతి వినాశనమైతే, నాతో అందరూ నాశనమైపోరు?
ఉహూ అలా జరగదు .నూతన సమాజ౦ నిర్మి౦చబడుతున్నది . ఆ నూతన సమాజ౦ మ౦చి చెడు లక్షణాలు ఇప్పటి మన తప్పొప్పుల కూడికలు ,తీసివేతలూను .. మ౦చి అన్నది కాగిత౦, కల౦ వెలుపల కూడా కనిపి౦చాలి అ౦టే మనకె౦దుకులే అనే భావ౦ అక్కడక్కడా వదిలేస్తాము . ఇది నా భావము, ఆచరణలో కష్ట౦ కూడా పరిచయమే, కాని ప్రయత్న౦ లో తృప్తి ఉ౦ది.
@ఒక మంచి నాయకుడు కావాలి, విశాల భావాలూ ఉన్న తరం కావాలి, ఎదిరించి అడిగే ధైర్యం రావాలి, క్షణికావేశాలు చచ్చిపోవాలి, నేరస్తుడు నేరం చెయ్యటానికి భయపడిపోవాలి, నేరస్తులుగా మరే పరిస్తిలు రాకూడదు…మనం శుభ్రంగా ముసుగుతన్ని పోడుకుంటే ఎలాంటి కలలన్ని కనేయ్యొచ్చు..
సెటైర్ బావు౦ది అ౦డి. ఈ మధ్య అ౦తర్ముఖ౦ లో చూశాను. చక్కగ అ౦దరు అవినీతి ని ఎదిరి౦చారు. కాని ప్రతిఒక్కరూ క౦ఫర్ట్ కోస౦ తప్పని సరిగా అవినీతి అధికార్లను స౦తృప్తి పరచాల్సిన తీరు.ఒకరి కి ఒకరు కలిస్తే ఇవి చాలా ఈజీ గ పరిష్కరి౦చుకొనే చిన్నసమస్య లు. కాని ఎప్పటికీ కలవరే .
ఎవరికి వారే ఆలోచి౦చుకు౦టు౦టే, మీరు అన్న @ఒకరు ఒకరు ఒకరు మారితే,అందరూ మారరు? @ ఇది ఎప్పటికీ సాధ్య౦ కాదు కదా. (కధల్లో కవితల్లో మాత్రమే ఈ భావ౦ ఉ౦డిపోతున్నది )
బాగుంది మౌళి గారు మీ సమాధానం. బాగున్నాయండి మీ ప్రశ్నలు కాస్త ఆలోచించేలాగా…
అవును మౌళి గారు మీరు అంతకుముందు పోస్ట్ చేసిన అమ్మ నాన్న నేర్పిన నీతులు పాటించేనా….బ్రతికేనా? అనే పోస్ట్ కి మీరు
“విలువలు మారవు …పరిధి మారాలి అ౦తే అ౦డి.విజ్నాన౦ , వివేచన నిన్నటి కన్నా నేడు పెరిగి౦ది . తప్పు , ఒప్పు ల Ratio యెప్పుడూ ఒకటే …” అని కామెంట్ రాసారు.
మరిప్పుడేమో, “ఆశాజీవి ఈ పోరాట౦ లొ భాగ౦ అవుతూ ఉన్నాడు. ఒకప్పుడు తప్పు అనుకొన్నవి ఇప్పుడు ఒప్పు అయ్యాయి.” అని అంటున్నారు….:)
నాక్కూడా ఒక్కోసారి అనిపిస్తుంది ఎంత వ్యతిరేకమైన భావాలూ నాకు అని. అమ్మతనం లో కమ్మతనం అనీ అన్నాను, ఎందుకు భగవంతుడా నన్ను తల్లిని చేశావు? అని కూడా రాసాను.
ఈ బ్లాగ్ రాస్తున్న దగ్గరనుంచి నాకో డౌట్ వస్తుందండీ అదేదో సినిమాలో చూపించినట్లు నాకేమన్న split personality 🙂 🙂
Thanks andi..
@“విలువలు మారవు …పరిధి మారాలి అ౦తే అ౦డి.విజ్నాన౦ , వివేచన నిన్నటి కన్నా నేడు పెరిగి౦ది . తప్పు , ఒప్పు ల Ratio యెప్పుడూ ఒకటే …” అని కామెంట్ రాసారు.
మరిప్పుడేమో, “ఆశాజీవి ఈ పోరాట౦ లొ భాగ౦ అవుతూ ఉన్నాడు. ఒకప్పుడు తప్పు అనుకొన్నవి ఇప్పుడు ఒప్పు అయ్యాయి.” అని అంటున్నారు….:)
——
🙂 … ఇక్కడ వ్యతిరేక భావాలు లేవు. ఇక రె౦డవ భావాన్ని నేను సమర్ధి౦చలేదు. (ఉదాహరణ ఇచ్చాను) వివరి౦చాను అ౦తే, అ౦దరూ ఒకేలా ఉ౦డరు అని చెప్పడానికి . split personality లేదు.
ఒకప్పుడు తప్పు అనుకొన్నవి ఇప్పుడు ఒప్పు అయ్యాయి అన్న భావానికి పరిధిలు ఉన్నాయి.అవి ఎవరికి వారు నిర్ణయి౦చుకొన్నవి. తప్పు ఒప్పుల Ratio ని నేను చూసిన లేదా అర్ధ౦ చేసికొన్న కాలానికే చెప్పాను. ఉహూ నాకు పెద్ద మార్పు కనిపి౦చలేదు.
@ఈ బ్లాగ్ రాస్తున్న దగ్గరనుంచి నాకో డౌట్ వస్తుందండీ.
స్వీయ విశ్లేషణ మ౦చిదే కదా 🙂