ఒంటరితనం
ఒంటరితనం ఎంత ఒంటరితనమంటే,
కనుచూపు మేరా జనసంధ్రం,
మనసులో మాత్రం అంతులేని శూన్యం,
ఆలోచన, ఆశ కూడా మనలేని శూన్యం,
ఊపిరాడని, ప్రాణం పోలేని శూన్యం,
కొన ఊపిరితో కోట్ల కోట్ల సంవత్సరాలు,
చావు కోసం ఎదురు చూస్తున్న శూన్యం.
వేల వేల మాటలు గొంతు దాటక,
సమాధి అయిపోయిన స్మశానం.
కన్నీరు ఘనీభవించి,
కన్నుల్లో గుచ్చి గుచ్చి,
రక్తం ధారగా కారుతున్న కాటిన్యం.
స్పర్శ కోల్పోయి,
స్పందన నశించిపోయి,
ఎండిన హృదయం,
తోలు తిత్తిలా వేలాడుతున్న వైపరిత్యం.
చెవులు దిబ్బడేసి,
పలకరిపు సైతం వినలేని చెవిటితనం,
కన్నీరు కమ్మేసి,
చీకటి మాత్రమే కానవచ్చే గుడ్డితనం,
అడుగులో అడుగైనా వెయ్యలేని అంగవైకల్యం.
గుండెను పిడికిలిలో పిండేసి,
ఆశను అరచేతిలో నలిపేసి,
బాధను భద్రంగా బయటకు తీసి,
బహుమతిగా ఇచ్చే ఒంటరితనం.
ఉరితాడు ఒంటరితనం,
ఊపిరి ఆగిపోయే ఆఖరి క్షణం,
చావు మాత్రమే తోడుగా వచ్చే చివరి మజిలీ,
ఒంటరితనానికి ఒంటరితనం.
chala baga chepparu….nince….. mee polikalu superb….
kavita pyna drawing baagundi.
Satyanarayana garu: అయ్యయ్యో అది drawing కాదండి..నెట్ లో దొరికిన ఫోటో..
VERY GOOD..
Thank you Subhadra garu
“ఆకు ” పై కవితా పోటీకి, ఇంతవరకు వచ్చిన కవితలు
http://neelahamsa.blogspot.com/2011/03/blog-post_05.html
నేను దీనిని ఖండిస్తున్నా…
ఇది ఒంటరి వాళ్ళపై తుంటరి ప్రయత్నం
”
గుండెను పిడికిలిలో పిండేసి,
ఆశను అరచేతిలో నలిపేసి,
బాధను భద్రంగా బయటకు తీసి,
బహుమతిగా ఇచ్చే ఒంటరితనం”
ఇంత మంచిగా రాస్తే ఎలా?
ఒంటరి తనంలో ఉండీ ఒంటరి నని తెలియని వాళ్ళకి కూడా
ఒంటరినని తెలియజేసి గేళి చేయడం … ప్చ్… ఇది ఎంతవరకు సబబు.
ఏది ఏమైనా అభినందనలు…ధన్యవాదాలు.
-satya
సత్య గారు మీరు భలే తిడుతూ మెచ్చుకుంటారండి ..Thanks for responding
ayyo!
nenkkaDa tittanadi!….
asalu ontaritanamutho bada padatam telusu kani dani nirvachnam inta maduram ga ela chepparandi asalu? mimmalani ela mechhukovali cheppandi? anduke i can’t.
రోజా గారు: నన్ను బోల్డంత మేచ్చేసుకున్నందుకు ధన్యవాదాలు.