పోస్ట్ చెయ్యని నా ఉత్తరాలకు వచ్చిన ప్రత్యుత్తరాలు:
నా ఉత్తరాలకు వచ్చిన ప్రత్యుత్తరాలు యధాతధంగా పోస్ట్ చేస్తున్నా.
జాబులు రాసిన మీకు నా హృదయపూర్వక కృతఙ్ఞతలు. లోతుగా ఆలోచించదగ్గ సమాధానాలు రాసారు.
మనవ సంబంధాలలో ఉన్న సున్నితత్వం, బేలతనము, గట్టితనం మీ ప్రత్యుత్తరాలలో కనిపించింది. నాణానికి మరో వైపు ఉన్న వాదనను వినిపించారు.
అమ్మ రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరం:
అమ్మా
ఎందుకింత ఆలాస్యం చేసావమ్మా ఉత్తరం రాయటానికి? అయినా ఇలా అగ్నాత్తంగా ఉత్తరం రాసుకోవాల్సిన అవసరం ఏముంది? రోజూ అయిదు నిమిషాలే అయినా మాట్లాడుతున్నాగా.
అయినా ఈ యాంత్రికత మీరు కోరుకున్నదే కదమ్మా.
నేను ఇక్కడకు వస్తున్నా మొదటి రోజు….గుర్తుందా మీ ఆ గర్వం, అప్పటి మీ కళ్ళలోది? కంటి పాప తనను తాను చీసుకునే వీలుంటే ఎంత బావుండు. అటూ ఇటుగా ఉన్న నా సందిగ్ధతను చీల్చి నన్నిటు గిరాటేసింది మీ ఆ సంతోషం కూడా అన్నది మీకెలా అర్థమవుతుందమ్మా? నేను పన్నెండేళ్ళ వనవాసానికి వెళుతున్నా నాన్నా అంటే నాన్న అలా నవ్వి ఉండకపోతే ఎంత బావుండేదో కదమ్మా? అన్ని ఏళ్లు కూడా అక్కర్లేదురా మాకు నీ/మీ అవసరం అనిపించినపుడు లేదా నీకు అంతకు ముందే సంతృప్తి కాని విసుగు కాని వస్తే అలాగే వచ్చేయ్రా అని ప్రోత్సహించుంటే ఎంత బావుండేదో కదమ్మా.
నిజమే అమ్మా నీకెప్పుడూ నేను చిన్నపిల్లాడినే. అదే మీ ఇప్పటి పరిస్థితికి ఒక కారణం అన్నది ఎప్పుడమ్మా నువ్వు గ్రహించేది? నా దగ్గర నా అమ్మ కంటతడి పెట్టలేకపోవటం నిజంగా ఎంత దూరదృష్ట కరమో ఎప్పుడైనా ఆలోచించావా అమ్మా? అసలెందుకమ్మా మీ తల్దండ్రులు పిల్లలకు ఇలా కష్టాలు తెలీకుండా పెంచాం/ఉన్నాం అన్న దానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు? నా దగ్గర నా తల్లి తండ్రులు నిన్ను మిస్ అవుతున్నాం వచ్చేయ్రా అని అనగలిగినంత చొరవ ఎప్పుడు పారేసుకున్నారమ్మా మీరు?
ఇక్కడి విలువలూ, జీవితాలూ, జీతాలకూ అలవడిపోయిన నేను అలవాటున ఇంత చిన్న మొత్తం నాకెంతలె నాన్నా అని అర్థం వచ్చేట్టు మాటాడితే చెంప పగలకొట్టి నేర్పటం వదిలేయ్ కనీసం ఇది మమ్మల్ని బాదిస్తోందిరా అని చెప్పటానికి కూడా ఎందుకమ్మా వెనకాడారు? ఎందుకు, ఎవరు మన మధ్య ఆ పరదా వేసింది?
చిటికిన వేలు పట్టుకొచ్చిననాటి నుంచి నాతొనే ఉంది, మీ ఇద్దరి మనసూ, అలవాట్లూ, మంచి చెడులూ ఏవీ తెలియక మీకు అపరిచితురాలిలా మిగిలిపోయిన ఆ కోడలు పిల్లా అమ్మా? ఇవేమీ తెలియని ఆ పిల్ల మిమ్మల్నేక్కడ గాయపరుస్తోందో అని తను మీ నుంచి తప్పుకోవటం, ఆ అమ్మాయి ముక్తసరిగా ఉన్ని మీరు ప్రయత్నాలు మానేసుకోవటం, ఉద్యోగం, సంసారం , మీ భాద్యత, నా సంతోషం ఈ బండి చక్రాల కింద మీ ఇద్దరి మధ్య బంధుత్వం అలా నల్లెరైపోవటానికి ఎవరిని బోనులో పెడదాం?
గుర్తుందా అమ్మా ఒకోసారి అరగంటకు పైగా మాట్లాడితే ఒరె బిల్ ఎక్కువైపోతుందేమో పెట్టేస్తున్నా అంటూ నువ్వు కట్ చేసిన ఆ తొలి రోజులు? ఎందుకమ్మా డబ్బులకు అంత విలువ? నేను తొందరగా పెట్టేస్తుంటే దబాయించి మరీ మాట్లాదిన్చుకోవాలి కాని కొడుకు పెట్టగలిగినపుడు ఎందుకమ్మా అంత పొదుపు? నేనేమో ఇక్కడ ఒకపూట బయట తింటే వేలల్లో చేసేస్తాము మీతో ఒక గంట మాట్లాడితే మీరు వందల్లో జరిగే ఖర్చుకు ఇంకా వెరిస్తే ఎన్నేల్లమ్మా మీకు ఓపికగా నేను చెప్పగలిగేది?
ఇలా రాధేయుని మరణానికి సవాలక్ష కారణాలు కదా?
ఎందుకమ్మా ఇప్పటికీ మన మధ్య ఇంత అంతరాలు? పెద్ద వాళ్ళమయ్యామనా? మొదటినుంచీ కొంచం మనసును కూడా బహిర్గతం చేసి ఉంటె నాకూ అలవాడేది కదమ్మా మనసును చదవటం. చిన్నప్పటి నుంచీ బుద్ది మాట వినటం నేర్పారు…..ఏనాడయినా మనసు మాట విని భావోద్వేగంలో అలా డోలలాడటం మీరు చేసారా నాకు నేర్పారా?
ఇప్పటికయినా ఇది పోస్ట్ చెయ్యని ఉత్తరం, చిరునామా లేని ఉత్తరం, కొడుకులూ కూతుళ్ళకు నిషేదమయిన ఉత్తరం ఎందుకయింది? ఎప్పుడ పారేసుకున్నాం మన పరస్పరం మన చిరునామాలను? అమ్మా అంటూ నిన్ను చుట్టేసిన ఆ బుడతడిని నాన్నా ఒంటరితనం భరించలేకపోతున్నాం అని చుట్టేయటానికి అహం చావాలమ్మా. అహం వదులుకోవటమంటే నీ జీవితంలో మాకూ భాగం ఉంది అని మీరు కనీసం మీ ప్రయత్నంగా మాకు తెలియపరచటం. అలా కాక నేను నా పిల్లల కోసం నా సుఖాన్ని త్యాగం చేసుకుంటున్నా అని ఇలా కంచికి చేరని ఉత్తరాలు ఆ ఏడుకొండల వాడి హుండీలో వేస్తుంటే ఎప్పుడమ్మా మరిక శుభోదయం? —-భావకుడన్
——————————————————————————————-
పతిదేవులకు పత్నీదేవత రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరం: (He is my cousin. So he made it little complicated and funny at the end)
akka..nuvvu kaliyugam gurinchey endhuku raasaavu? my take on that, as we are from this kaliyugam, better look at us instead of looking into the folk-lore (kathalu and puranaalu).. hope I am right!
I think, each yugam has got a separate way of relationships… Treta yugam, dominated by my brother (Lord Rama) and his blah blah blah.. this yugam has got a sole purpose of telling the humanity, how a Ruler (husband) should be.. many books are even written on how a husband should be.. but none on wife?? any guess why?
Coming to Dwaparayugam, the relationships started to wander a bit.. all the relationships in this yugam are dominated by the greed of power.. Duryodhana wants to enjoy the power of command on Pandava’s and vice-versa.. Krishna wanted to stamp his authority or show this world, what he can do.. Satyabhama wanting to enjoy the power of being the lovable wife of Krishna, over all of his other wives.. in between all this, we can even see the awkward relationship of Drowpadi.. the reason as depicted, it is her wish..
any where in these.. the relationships are interlaid with greed and hatred and desire…
in the above 2 yugas, i don’t think there is much to talk on relationships… so when you said.. “wanted to write this letter from many yugas…” I am not with you…:-).. I would prefer to leave that line out.
Coming to our very own Kaliyugam, here we are seeing many things.. just as you said.. I am totally with you that there used to be many (and they are even now) insane husbands who are insensitive to their wifes’ feelings.
With the latest generation, I totally accept what you said.. but are the so called Patnidevis 100% perfect? I don’t think so. And I accept that not all the husbands are 100% perfect..
The longevity or the good feelings or the love, in any relation; or any relation for that matter;comes down to the point of “how much imperfect % can you tolerate?”. When we are not 100% perfect we have no damn right to ask the other party to be 100% perfect or near to perfection. When we are in a relation, we should estimate our selves first before pointing out others.. the patnidevis of this era, do many of the things which you said, may not be the same but a similar way.
If you notice, all these kind of feelings come only with soul-mates, because they are the ones with whom we spend most of our life.. when we are spending some 70% of our lifetime, with someone, I think it demands a level of bearing.. bearing the good things + bearing the bad things.. the only point to me is that the partners in the relation should talk less on the bad things, more on the good things with a view of minimizing the bad things or finding a way around it.
nooney leni deepam velagadhu, alaagey idhi koodaa… velugu kosam aithey cotton strip (vothi) kaaluthunna baaguntundhi.. nooney kosam aithey vothi kaalithey baagodhu… so we all should learn what we want.. nooney ayipoyi, vothi kaalitheyney velugu.. ikkada nooney baadha pada koodadhu vothi edava koodadu…
all the sodhi bharatam ends here…..
the essense is there are equally idiotic men as women.. nice sodhi kadaaa……….
me getting sleepy now.. gurrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
(My note: Thank god..నిద్ర దేవుడు మనల్ని బతికించాడు..లేక పొతే ఇంకా ఏమేమి…)
బాగుంది. మీ ఉత్తరాలతో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. శ్రేణి (సిరీస్) లో ఇంకా ఉన్నాయా?
కృతఙ్ఞతలు కొత్తపాళి గారు…హాహా..ఒరవడి సృష్టించే అంత సీన్ నాకు లేదండి..
సిరీస్…I really don’t know..Lets see..
“నూనె లేని దీపం వెలగదు, అలాగే ఇది కూడా.. వెలుగు కొసం ఐతే వత్తి కాలుతున్నా బాగుంటుంది..నూనె కోసం ఐతే వొత్తి కాలితే బాగోదు.. సో మనం నేర్చుకోవాల్సిందేంటంటే నూనె అయిపోయి వొత్తి కాలితేనే వెలుగు.. ఇక్కడ నూనె బాధ పడ కూడదు వొత్తి ఏడవ కూడదు. ”
హ హ హ చివర్లో ఈ లైన్లతో దుమ్ము లేచింది ప్రవీణ గారూ, నా బుర్ర మీదది 🙂 మీ కజిన్ కి నా కృతజ్ఞతలు చెప్పండి 🙂
Kumar N
PS: సరదాకన్నాను, సీరియస్గా తీస్కోకండి.
అయ్యో అందులో సీరియస్ ఏముందండి..చక్కగా చెప్పారు..I will convey your msg..
Thanks for responding Kumar garu..
పోస్ట్ చెయ్యని నా ఉత్తరాలకు వచ్చిన ప్రత్యుత్తరాలు:……అమ్మ రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరం
ఈ ఉత్తరం లో ఏదో కంటిన్యుటీ లోపించినట్లు గా అనిపిస్తుంది. భావం బవున్నా.. వాఖ్యాల పొందిక సరిగ్గా లేదనిపిస్తుంది…ఇంకా బాగా వ్రాసి ఉండాల్సింది.ఇది మిమ్ముల్ని విమర్శించటాన్కి చెప్పటం లేదు మీ నుంచి మేము ఏ స్థాయి లో ఆశిస్తున్నామో తెలయచేయాలనే ప్రయత్నమే సుమీ…నేనైతే ఈ మాత్రం కూడా రాయలేననుకోండీ ……
thotakuri garu: విమర్శలు కూడా పదును పెడతాయి. ఈ ప్రత్యుత్తరాలు కామెంట్స్ గా వచ్చినవి. నాకు వాటి భావం చాలా నచ్చింది. అందుకని మరో పోస్ట్ లాగా పోస్ట్ చేశాను. ధన్యవాదాలు
నేను చదివాను కానీ భాధ పడలేదు, ఎందుకంటే నేనింకా భర్తను కాను.
Suresh Kumar Digumarthi : Enjoy your freedom.. 🙂