పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : అమ్మ రాసిన ఉత్తరం


పోస్ట్ చెయ్యని ఉత్తరాలు :  అమ్మ  రాసిన ఉత్తరం

ప్రియాతి ప్రియమైన నా బంగారు తండ్రికి ,

ప్రేమతో దీవించి రాయునది మీ అమ్మ.  ఎలా ఉన్నావురా కన్నా? వేళకు తిండి తింటున్నావా? కంటినిండా నిద్ర పోతున్నావా? నా కోడలు ఎలా ఉంది? మనమలు, మనవరాళ్ళు బాగా చదువుకుంటున్నారా?

రేపోమాపో ప్రశాంత నిద్రలోకి జారుకునే వయస్సు వచ్చేసింది నాకు. ఏ జాములో జారుకుంటానో  నాకే తెలీదు. చివరిసారిగా నీకో ఉత్తరం  రాయమని ,నిన్ను వీడలేని నా మనసు, నా మధికి రహస్యంగా చెప్పింది. మీ నాన్నకు కూడా తెలీకుండా రాస్తున్నా నీకీ ఉత్తరం.

ఈ ముసలి వయస్సులో వెనక్కి తిరిగి చూసుకుంటే, జీవించిన జీవితమంతా నువ్వే కనిపిస్తున్నావు. కన్నీరు నిండిన కళ్ళలో మసకగా, కనుచూపుమేరా నువ్వే ఉన్నావు.

పెళ్ళంటే ఏమిటో తెలిసీ, తెలియని వయసులోనే నా మనువైపోయింది. జీవితం, సంసారం, బాధ్యతలు  అనే పెద్ద పెద్ద పదాల అర్థం తెలియక ముందే నువ్వు నా జీవితంలోకి ప్రవేశించేశావు. స్నేహితులు, షికారులు, సినిమాలు, చదువులు అంటూ నువ్వు కొంటెగా తిరిగే నీ వయస్సులోనే నేను నీకు తల్లినయ్యాను. పరిపక్వత ఇంకా పరుచుకోని వయసులోనే నీ చిన్ని ప్రాణం నా చేతుల్లో పరుచుకుంది.

ఎక్కడ నుంచీ వచ్చిందో నాకా శక్తి, ఏ దేవుడు ప్రసాదించాడో నాకా యుక్తి, ఉపాయం. నీ పాల బుగ్గల్లోని పసితనం నాకు పెద్దరికాన్ని తెచ్చిపెట్టింది. నీ కళ్ళల్లో స్వచ్ఛత నాకు అమ్మతనాన్ని ప్రసాదించేసింది. నీకెలా లాల పోసానో, నీకెలా జోల పాడానో, నీకెలా భువ్వ తినిపించానో……ఏమో నాకే తెలీదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే “నేను నీకు అమ్మను, నువ్వు నాకు బిడ్డవు”.

“అమ్మ, నాకూ బొత్తాలు పెట్టుకోవటం వచ్చు. నేనే షు లేసులు కట్టుకుంటాను. నేనే చేసుకుంటాను..నాకు వచ్చు”, అంటూ నువ్వు చిన్నతనాన పెద్దరికాన్ని చూపిస్తుంటే, నేను మురిసిపోయాను. నా కొడుకు ఎంత పెద్దవాడైపోయాడా అని  ఆశ్చర్యపోయాను.

నువ్వు నిజంగా పెద్దవాడివైన తర్వాత, “అమ్మ నువ్వురుకో, నీకేమి తెలీదు”, అంటూ నువ్వు నన్ను విసుక్కున్నప్పుడు మాత్రం చిన్నబుచ్చుకున్నాను.

నీకు గుర్తుందా కన్నా? నీ చిన్నతనంలో అందరూ నిన్ను “అమ్మ కూచి” అంటూ ఏడిపించేవారు. నా కొంగుకు వేలాడుతూనే ఉండేవాడివి. నా కాళ్ళకు అడ్డం పడుతూ తిరిగేవాడివి. నన్ను పనులు చేసుకోనీకుండా అల్లరి చేసేవాడివి.

ఇప్పుడు ఎంతో ఎదిగిన నిన్ను కంటినిండా చూసుకోవాలని, నోరారా పిలవాలని, నీకు వండి పెట్టాలని, కొసరి కొసరి తినిపించాలని చాన్నాళ్ళ నుంచీ ఎదురు చూస్తున్నాను. అయ్యో, నీకు తిరికేలేదే.

నువ్వు చదువుకుంటున్నప్పుడు సెలవలకు ఇంటికి వస్తే, నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాలని తాపత్రయ పడేదాన్ని. నువ్వుండే ఆ వారం రోజుల్లోనే చాదస్తంగా ఎన్నో పిండి వంటలు వండేదాన్ని. మీ నాన్న వారిస్తున్నా వినకుండా నిన్ను తినమని బలవంత పెట్టేదాన్ని. “అమ్మ నేను లావైపోతున్న, డైటింగ్ చేస్తున్నా, ఇవన్నీ తినమని బలవంత పెట్టకు”, అని నువ్వు కసురుకున్నప్పుడు నా కళ్ళలో తిరిగిన నీళ్ళు నీ కంట పడకుండా జాగ్రత్త పడేదాన్ని.

ఉద్యోగరీత్యా నువ్వు విదేశాలకు వెళ్ళినప్పుడు నేను తల్లడిల్లిపోయాను. దేశం కానీ దేశంలో నువ్వెలా ఉంటావో, ఏమి తింటావో..కలవర పడిపోయాను. నువ్వు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నావు. నీ ధైర్యాన్ని చూసి నేను నా ఆందోళనలను నీదాకా రానివ్వలేదు. నీ ఎదుగుదల ముందు నా ప్రేమ చాలా చిన్నగా కనిపించింది. కానీ, మనసులో ఏ మూలో నువ్వు నాకు దూరమయి పోతున్నావని మాత్రం అనిపించింది.

పెళ్లికొడుకులా నువ్వు పెళ్లిమండపంలో కూర్చున్న క్షణాన మొట్టమొదటి సారి గ్రహించాను, నువ్వు నిజంగా పెద్దవాడివయ్యావని. కానీ ఏమి ఉపయోగం మరు క్షణమే మర్చిపోయాను. నువ్వు ఎప్పటికి పసివాడివే నా మనసుకు.

నువ్వు నీ బిడ్డను ఎత్తుకుని ఇంటికి వచ్చిన వేళ నాకెంతో ఆశ్చర్యం. నా చిన్ని తండ్రి అప్పుడే ఒక బిడ్డకు తండ్రి అయ్యాడా?? ఎంతో అబ్బురం..ఆనందం.. ఆశ్చర్యం..

మీ నాన్న మనవడి పుట్టిన రోజున కొంత మొత్తం బహుమతిగా నీ చేతికిస్తే, “ఈ చిన్న మొత్తం నాకెంత నాన్న, మీరే ఉంచండి”, అని నువ్వు తిరిగి మీ నాన్న చేతిలో పెట్టిన క్షణాన, నా కనిపించింది “ఈ చిన్న సంఖ్య మాకెంతో పెద్ద సంఖ్య. మా జీవితమంతా కష్టపడి పొదుపు చేసిన పెద్ద మొత్తం”. ఎంతలో ఎంత మారిపోయాయి రోజులు!

నాకే కష్ట మొచ్చినా గబుక్కున చెప్పుకోలేనంత దూరంలో ఉన్నావు. రక్తపోటు పెరిగినా, మోకాళ్ళ నొప్పులు బాధించినా నీతో చెప్పుకోవాలనిపిస్తుంది. చెప్పుకుంటే తగ్గే నొప్పులు కావు. అయినా ఎందుకో అలా అనిపిస్తుంది. కానీ, నీకేమి చెప్పలేను, నువ్వెక్కడ కంగారు పడతావో అని.

ఈ ముసలి వయసులో పనేమీ లేక, చెయ్యలేక ఎప్పుడూ నీ తలంపులే.  నువ్వు ఇక్కడికి వచ్చి ఉండే నెల రోజుల కోసం, నేను సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాను. అదేమిటో నువ్వుండే ఆ నెలరోజులు చిటుక్కున అయిపోతాయి. దేవుడి మొక్కులని, గుళ్లని, చుట్టాలని, స్నేహితులని..నిన్ను కళ్లారా చూసినట్టే ఉండదు, నోరార మాట్లాడినట్టే ఉండదు.

అప్పుడెప్పుడో నీదగ్గరకు వచ్చి ఉన్న కొద్ది రోజుల్లోనే నీ జీవితం ఎంత వేగంగా ఉందో అర్థంమయింది. క్షణం కుడా విశ్రమించలేని నీ బతుకు పోరాటంలో, అరక్షణమన్నా వృదా చెయ్యలేని నీ జీవిత గమనంలో, నాకోసం నువ్వు అరసేకనన్నా ఆగాలన్నా ఆగలేని ఆశక్తుడవని గ్రహించుకున్నాను. నువ్వెంత అలసిపోతున్నావో…నా మనసు తల్లడిల్లిపోతుంది. నీకు నా దగ్గర సేదతీరే తీరికే లేదే??!!

నా ఒడిలో నుంచి ఎప్పుడూ జారుకున్నావో , ఎలా పాకావో, ఎప్పుడు నడకలు నేర్చావో..ఏమో…ఇప్పుడు అంతు లేని నీ పరుగులు చూస్తుంటే, అలసిన నీ మనసును మళ్లీ నా బుజానికి ఎత్తుకోవాలనిపిస్తుంది. నీకు లాల పోసి, జోల పాడి నిద్ర పుచ్చాలనిపిస్తుంది.

నేను దేవుడ్ని కలిసిన మరుక్షణమే నీ గురించి అడిగేస్తా. ఆ భగవంతుడ్ని నిలదీసేస్తా, మనిషికి ఎందుకంత మేధస్సు ఇచ్చావు?. మేధస్సుతో పరుగులు పెట్టించి యంత్రికతకు దగ్గరగా ఎందుకు తీసుకెళ్ళావు?.

దేవుడితో పోట్లాడి, వాదించి, ఒప్పించి వరమడిగేస్తా, మరు జన్మలోను నీకు అమ్మగానే పుట్టాలని, జన్మంతా నువ్వు నా దగ్గరే ఉండాలని.

ఈ ఉత్తరం నువ్వు చదివితే, నీ మనసెంత బాధ పడుతుందో నాకు తెలుసు. నా అమ్మ మనసు, నీ మనసు గాయపరచటానికి ఎన్నడూ ఒప్పుకోదు. అందుకే, ఈ ఉత్తరం పైన నీ చిరునామా రాయకుండా పోస్ట్ చేస్తున్నా.

ఇట్లు,
మీ అమ్మ.

( I don’t mean to hurt anyone here. I wanted to express the generation gap, communication gap….)

This entry was posted in పోస్ట్ చెయ్యని ఉత్తరాలు. Bookmark the permalink.

39 Responses to పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : అమ్మ రాసిన ఉత్తరం

 1. it is in moments like these that we don’t find words to express…… touching

 2. sanjays says:

  జన్మంతా నువ్వు నా దగ్గరే ఉండాలని.

  Andaru pillalu ilage amma daggara undipote jeevana poratamlo amma vellipoyaka emi chestaru??

  andukey amma eppudu adi korukodu.

 3. నిజమేనండి. మా తరం వాళ్ళు అంగీకరించలేని నిజాలు. చక్కగా చెప్పారు.

  నేను చెప్పాలనుకుంది నాగార్జున గారు చెప్పేశారు.

 4. అమ్మా

  ఎందుకింత ఆలాస్యం చేసావమ్మా ఉత్తరం రాయటానికి? అయినా ఇలా అగ్నాత్తంగా ఉత్తరం రాసుకోవాల్సిన అవసరం ఏముంది? రోజూ అయిదు నిమిషాలే అయినా మాట్లాడుతున్నాగా.

  అయినా ఈ యాంత్రికత మీరు కోరుకున్నదే కదమ్మా.

  నేను ఇక్కడకు వస్తున్నా మొదటి రోజు….గుర్తుందా మీ ఆ గర్వం, అప్పటి మీ కళ్ళలోది? కంటి పాప తనను తాను చీసుకునే వీలుంటే ఎంత బావుండు. అటూ ఇటుగా ఉన్న నా సందిగ్ధతను చీల్చి నన్నిటు గిరాటేసింది మీ ఆ సంతోషం కూడా అన్నది మీకెలా అర్థమవుతుందమ్మా? నేను పన్నెండేళ్ళ వనవాసానికి వెళుతున్నా నాన్నా అంటే నాన్న అలా నవ్వి ఉండకపోతే ఎంత బావుండేదో కదమ్మా? అన్ని ఏళ్లు కూడా అక్కర్లేదురా మాకు నీ/మీ అవసరం అనిపించినపుడు లేదా నీకు అంతకు ముందే సంతృప్తి కాని విసుగు కాని వస్తే అలాగే వచ్చేయ్రా అని ప్రోత్సహించుంటే ఎంత బావుండేదో కదమ్మా.

  నిజమే అమ్మా నీకెప్పుడూ నేను చిన్నపిల్లాడినే. అదే మీ ఇప్పటి పరిస్థితికి ఒక కారణం అన్నది ఎప్పుడమ్మా నువ్వు గ్రహించేది? నా దగ్గర నా అమ్మ కంటతడి పెట్టలేకపోవటం నిజంగా ఎంత దూరదృష్ట కరమో ఎప్పుడైనా ఆలోచించావా అమ్మా? అసలెందుకమ్మా మీ తల్దండ్రులు పిల్లలకు ఇలా కష్టాలు తెలీకుండా పెంచాం/ఉన్నాం అన్న దానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు? నా దగ్గర నా తల్లి తండ్రులు నిన్ను మిస్ అవుతున్నాం వచ్చేయ్రా అని అనగలిగినంత చొరవ ఎప్పుడు పారేసుకున్నారమ్మా మీరు?

  ఇక్కడి విలువలూ, జీవితాలూ, జీతాలకూ అలవడిపోయిన నేను అలవాటున ఇంత చిన్న మొత్తం నాకెంతలె నాన్నా అని అర్థం వచ్చేట్టు మాటాడితే చెంప పగలకొట్టి నేర్పటం వదిలేయ్ కనీసం ఇది మమ్మల్ని బాదిస్తోందిరా అని చెప్పటానికి కూడా ఎందుకమ్మా వెనకాడారు? ఎందుకు, ఎవరు మన మధ్య ఆ పరదా వేసింది?

  చిటికిన వేలు పట్టుకొచ్చిననాటి నుంచి నాతొనే ఉంది, మీ ఇద్దరి మనసూ, అలవాట్లూ, మంచి చెడులూ ఏవీ తెలియక మీకు అపరిచితురాలిలా మిగిలిపోయిన ఆ కోడలు పిల్లా అమ్మా? ఇవేమీ తెలియని ఆ పిల్ల మిమ్మల్నేక్కడ గాయపరుస్తోందో అని తను మీ నుంచి తప్పుకోవటం, ఆ అమ్మాయి ముక్తసరిగా ఉన్ని మీరు ప్రయత్నాలు మానేసుకోవటం, ఉద్యోగం, సంసారం , మీ భాద్యత, నా సంతోషం ఈ బండి చక్రాల కింద మీ ఇద్దరి మధ్య బంధుత్వం అలా నల్లెరైపోవటానికి ఎవరిని బోనులో పెడదాం?

  గుర్తుందా అమ్మా ఒకోసారి అరగంటకు పైగా మాట్లాడితే ఒరె బిల్ ఎక్కువైపోతుందేమో పెట్టేస్తున్నా అంటూ నువ్వు కట్ చేసిన ఆ తొలి రోజులు? ఎందుకమ్మా డబ్బులకు అంత విలువ? నేను తొందరగా పెట్టేస్తుంటే దబాయించి మరీ మాట్లాదిన్చుకోవాలి కాని కొడుకు పెట్టగలిగినపుడు ఎందుకమ్మా అంత పొదుపు? నేనేమో ఇక్కడ ఒకపూట బయట తింటే వేలల్లో చేసేస్తాము మీతో ఒక గంట మాట్లాడితే మీరు వందల్లో జరిగే ఖర్చుకు ఇంకా వెరిస్తే ఎన్నేల్లమ్మా మీకు ఓపికగా నేను చెప్పగలిగేది?

  ఇలా రాధేయుని మరణానికి సవాలక్ష కారణాలు కదా?

  ఎందుకమ్మా ఇప్పటికీ మన మధ్య ఇంత అంతరాలు? పెద్ద వాళ్ళమయ్యామనా? మొదటినుంచీ కొంచం మనసును కూడా బహిర్గతం చేసి ఉంటె నాకూ అలవాడేది కదమ్మా మనసును చదవటం. చిన్నప్పటి నుంచీ బుద్ది మాట వినటం నేర్పారు…..ఏనాడయినా మనసు మాట విని భావోద్వేగంలో అలా డోలలాడటం మీరు చేసారా నాకు నేర్పారా?

  ఇప్పటికయినా ఇది పోస్ట్ చెయ్యని ఉత్తరం, చిరునామా లేని ఉత్తరం, కొడుకులూ కూతుళ్ళకు నిషేదమయిన ఉత్తరం ఎందుకయింది? ఎప్పుడ పారేసుకున్నాం మన పరస్పరం మన చిరునామాలను? అమ్మా అంటూ నిన్ను చుట్టేసిన ఆ బుడతడిని నాన్నా ఒంటరితనం భరించలేకపోతున్నాం అని చుట్టేయటానికి అహం చావాలమ్మా. అహం వదులుకోవటమంటే నీ జీవితంలో మాకూ భాగం ఉంది అని మీరు కనీసం మీ ప్రయత్నంగా మాకు తెలియపరచటం. అలా కాక నేను నా పిల్లల కోసం నా సుఖాన్ని త్యాగం చేసుకుంటున్నా అని ఇలా కంచికి చేరని ఉత్తరాలు ఆ ఏడుకొండల వాడి హుండీలో వేస్తుంటే ఎప్పుడమ్మా మరిక శుభోదయం?

  • Wow..wow..wow..I have no words to express..
   ఎంత బాగా చెప్పారండి…ప్రతీ పదం, ప్రతీ అక్షరం కటినమైన నిజం…అక్షర సత్యం..

   “అన్ని ఏళ్లు కూడా అక్కర్లేదురా మాకు నీ/మీ అవసరం అనిపించినపుడు లేదా నీకు అంతకు ముందే సంతృప్తి కాని విసుగు కాని వస్తే అలాగే వచ్చేయ్రా అని ప్రోత్సహించుంటే ఎంత బావుండేదో కదమ్మా.”

   “అసలెందుకమ్మా మీ తల్దండ్రులు పిల్లలకు ఇలా కష్టాలు తెలీకుండా పెంచాం/ఉన్నాం అన్న దానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు? నా దగ్గర నా తల్లి తండ్రులు నిన్ను మిస్ అవుతున్నాం వచ్చేయ్రా అని అనగలిగినంత చొరవ ఎప్పుడు పారేసుకున్నారమ్మా మీరు? ”

   “చెంప పగలకొట్టి” , “బిల్ ఎక్కువైపోతుందేమో” నిజంగా నిజంగా నిజం….

   మీ ప్రత్యుత్తరం చుదువుతుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయండి…నాకు చిన్న పిల్లలు..నా పెంపకంలో మీరు ఎత్తి చూపిన పాయింట్స్ ఇంప్లిమెంట్ చెయ్యాలి…అమ్మోభయమేస్తుందండి…మీ రిప్లై నీ పోస్ట్ చేస్తాను . I feel every one should read this…
   మాటల్లో express చెయ్యలేని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను…
   Many many thanks భావకుడన్ garu…

 5. Maddy says:

  wow…really heart touching…..its true …..

 6. Siva Cheruvu says:

  మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు

 7. Pingback: పోస్ట్ చెయ్యని నా ఉత్తరాలకు వచ్చిన ప్రత్యుత్తరాలు | నా అనుభవాలు….ఆలోచనలు…

 8. Snkr says:

  ముసలితనం అనే అసహాయ స్థితిలో దూరంగా ఓ అమ్మ/నాన్న పడే మౌనవేదన…వాస్తవంగా జరుగుతున్న కథలు చూస్తున్నట్టుంది.

  భావకుడన్, మీరు రాసిన సమాధానం బాగుంది, ఐతే… అంత వాస్తవంగా లేదు. ఆ పిల్లలకి ఇప్పటికీ అమ్మకోర్కె తీర్చే అవకాశం వుంది, తన కుంటుంబ బాధ్యతల్లో బందీ అయి వుండవచ్చు కూడా.

  • Snkr గారు, భావకుడన్ చెప్పిన దాంట్లోనూ మంచి పాయింట్స్ ఉన్నాయండి. అమ్మ నాన్నల adjustments, Scarifications..మన హక్కులా భావించట్లేదు. మళ్లీ మనం పేరెంట్స్ అయ్యిన తర్వాత కూడా అదే పని చెయ్యట్లేదు. Are we letting our kids to know parents hardships.

 9. ప్రవీణగారు
  థాంక్స్
  snkrగారు,
  నిజమే వాస్తవికత లేదు. అదే నా ఏడుపంతా.

  ఇలా బాధపడుతున్న అమ్మా నాన్నలను అడగండి తమ కొడుకులు అక్కదికి వెళ్ళటానికి కారణాల్లో తల్లి తండ్రుల ఆశ…….మంచి చదువూ, ఉద్యొగం, ఆస్తి, అంతస్తుల ఆశ….అంటే ఇప్పటి సమాజం దృష్టిలో “పురోగమనం”ఆశ………..ఆ ఆశ తల్లితండ్రులలో ఉండదా? నిజంగా ఎంతమంది తల్లితండ్రులు తమ పిల్లలను “మీరు సంపాదించుకున్నది చాలు ఇక ఆపేసి మా సంగతి చూసుకోండి” అని అసలు అడగగలుగుతున్నారు?

  లేదా అలాటి కొడుకులే “మీ కోసం వచ్చేస్తున్నాము.” అంటే నిజంగా సంతోషించేది ఎంతమంది, “ఆ పురోగమనం” తమ వలన కొడుకులూ కూతుళ్ళకు పోతుందేమో అన్న గిల్టీ ఫీలింగ్ నుంచి తప్పించుకుని, ఆ ఆశావ్యామోహాల నుంచి తాము బయటపడి, పిల్లలు బయట్పడుతున్నందుకు సంతోషించి, వారికి స్వాగతం చెప్పేవాళ్ళు ఎంతమంది ఈ లోకంలో? “వాడు షరీఫ్గాడులేరా” అంటూ షరీఫ్ తనాన్ని బూతు చెసిన ఈ కాలమానపరిస్థితుల్లో “మీ కొసం వచ్చేస్తున్నాము” అని పిల్లం చెపితే వాళ్ళ ఆ అడుగుకు తాము భాధ్యులం అనుకోకుండా హర్షించే వాళ్ళెంతమంది తల్లితండ్రులు? అసలా మాత చెప్పినప్పుడల్లా “ఫాంటసీ జీవితం ఆపేయ్, అంత సంపాదించీన్ వాడివి ఇక్కడకు వచ్చి ఏం చెస్తావు?” అనని తల్లి తండ్రులు ఎంతమంది?

  తల్లితండ్రులను నిర్లక్ష్యం చేసో, మంచిజీవితం అలవాటులో ఎక్కడో పారెసుకునో, ఫ్రీ జీవితం అలవాటు అయిన చోట ఎప్పటికాలం వాళ్ళో అయిన తల్లితండ్రులతో గడపటం కష్తం అనుకోవటం వల్లనో, వచ్చినదానికి “సంతృప్తి” అనేది పొందక ఇంకా కావాలన్న తపనల్లో ఉండటమో, దేశం వెళితే మళ్ళే రెడ్డొచ్చె మొదలెట్టులా మళ్ళీ వృత్తి మొదటినుంచి మొదలెట్టాలి అనో, పుట్టిన దేశపు అలవాట్లనూ పధ్ధతులనూ ఏవగించుకోవటం, డ్రాయింగ్ రూముల్లో కూర్చుని విమర్శించటం తప్ప కొంచమైనా మార్చాలన్న ఓపికా కొరికా తీరికా ఎవీ లేకపొవటం లాతి కారణాలు ఎన్నిటి చాటునో దాక్కుని తమ తల్లితండ్రులను నిర్లక్ష్యం చెస్సే దురదృష్టవంతులు చాలా శాతమే……కాదనను.

  కాని మామూలుగా అసలు చర్చకే రాని కోణం ఇంకోటుంది అని చెప్పటానికే ఆ ఉత్తరం. అంతే.

  తమ వారి దగ్గర తమకు హక్కు ఉందీ అని చెప్పుకొలేకపోవటం దౌర్భాగ్యం
  తమ వారిని మీ భాధ్యతలను మీరు తీర్చండీ అని అడగలేకపోవటం దౌర్భాగ్యం

  కొడుకుల దురదృష్టంతో పాటూ తల్దండ్రులు తమకు తాము కల్పించుకునే దౌర్భాగ్యం ఇది కూడా కొంచం కారణంగా ఉందని కూడా అనుకోవాలి.

 10. Snkr says:

  వయసుతో పాటు సమస్యల ప్రాముఖ్యతలు(priorities మారుతుంటాయి. తల్లిదండ్రులకే కాదు, పిల్లలకు కూడా. 65+ వయసులో ఏ తల్లితండ్రులు తమపిల్లలు దగ్గర వుండాలని కోరుకోరు? 95% కోరుకుంటారు. పోతే, ఆమాట పిల్లలను ఎదురుగా అడగటానికెందుకు జంకుతారంటే, 1) చాలామందికి, పిల్లల భవిష్యత్తుకు తాము అడ్డుకావడం ఇష్టం లేక 2) కొందరికి, తమ గతనిర్వాకాలు(అలాంటి పరిస్థితుల్లో) గుర్తురావడం వల్లనో అయ్యుంటాయి. ఇది చాలా సున్నితమైన సమస్య, పిల్లలు విదేశాల్లోనే కాదు, దేశంలో వున్నా ఇలాంటి సమస్యలుండటం గమనించవచ్చు. పాతకాలంలో 5-10 మంది పిల్లలుండే వాళ్ళు, ఒకరిద్దరు దూరంగా వున్నా ఇప్పటి పరిమిత కుటుంబాల్లో లాగా పెద్ద సమస్యగా వుండేది కాదు.
  ఓ ఆర్టికల్ చదివాను,.. ఐదుగురు పెద్దల మధ్య అతిగారాబంగా పెరుగుతున్న పిల్లాడ్ని చూపిస్తూ, వీడికి ముందుది క్రొకొడైల్ ఫెస్టివల్ అని రాశారు. మరి వాళ్ళు ముసలోళ్ళైతే చూచుకోవడానికి ఫేమిలీలో వాడొక్కడే మిగిలాడట! 5గురు ఆడల్ట్స్ ఒక కుర్రాణ్ణి పెంచడం సులభం, ఒకడు అనారోగ్యాలతో వుండే 5ముసలాళ్ళని భరించడం ఎంత కష్టమో కదా! 🙂

  మంచి టాపిక్, మీ వ్యాఖ్యతో నాణెం అటువైపు పైకొచ్చింది, నన్నూ కాస్త నెమ్మదిగా ఆలోచింపజేసింది, అసాధారణంగా:).

 11. భావకుడన్ గారు, నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. Snkr గారు చెప్పిన దాంట్లోనూ పాయింట్స్ ఉన్నాయి.

  మనకు ఎప్పుడు అసంతృప్తే, మన జీవితాల గురించి, మనం బతికే విధానం గురించి. The grass is always green on the other side. మన అసంతృప్తులు, మనకు నెరవేరని కోరికలు, మనం చెయ్యలేని పనులు..మన పిల్లల మీద బలవంతంగా రుద్దుతాము. మనము రుద్దిన్చుకున్నాము. ఆ రుద్దటంలో నుంచి వచ్చిన guilty concise పెద్దవారి చేత “హక్కు, భాధ్యత అని చెప్పుకోలేని, అడగలేని దౌర్భాగ్యం” కి కారణమేమో??!!!

  పిల్లలు ఏదో చేసెయ్యాలి, ఇంకేదో సాధించేయ్యాలి అని అనుకోవటం. ఇదంతా వృత్తమే, మన పిల్లలు కూడా అదే పాయింట్ దగ్గర కొచ్చి ఆగుతారు అనే ముందు చూపు లేకపోవటం..సవాలక్ష కారణాలు.

  ఈ అసంతృప్తి అనేది మనం పెరిగిన వాతావరణం నుంచి, మనం పెంచుతున్న వాతావరణం వరకు వ్యాపిస్తూనే ఉంది.

  జీవితపు చివరి ఘడియ దాకా మనం నేర్చుకుంటూనే ఉంటాము. “నా కన్నీ వచ్చు, తెలుసు” అనేది ఎవ్వరికి, ఎప్పుడూ సాధ్యం కాదు. మన తల్లిదండ్రుల ఆకరి క్షణం వరకు మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉంటాము, మన పిల్లలు కూడా మనం వృద్దుల మైన తర్వాత కూడా మన దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉంటారు.

  e.g: కొన్ని కారణాల వల్ల మా అమ్మ గారు నా కొడుకుని మొదటి రెండు సంవత్సరాలు పెంచారు. నా పిల్లల పిల్లలను సాకటం నా భాద్యత అని నా బుర్రలో అతుక్కుపోయింది.

  గుడ్డిగా అన్ని నేర్చేసుకుంటాము అని కాదు కానీ, చాలా వరకు గ్రహించుకుంటాము.

  Snkr గారు: ఎందుకో మన ఆలోచనల్లో “చాలామందికి, పిల్లల భవిష్యత్తుకు తాము అడ్డుకావడం” ఇరుక్కు పోయింది. ముందు ముందు మన తరానికి ఇదో త్రిశంకు స్వర్గంలా తయారవుతుంది. Old age homes accept చెయ్యలేక, పిల్లల దగ్గర ఉండలేక….Time only can answer these things….I guess..

 12. Chaitanya says:

  Englishu, E-Milas vachaka telugu santham marchipothunna tharunamlo yedarilo oassis la vundhi nee blog…
  Just enter ayyanu FB loki, anni posts chaduvesanu,
  Prathidaniki , yedhi chala bagundhani cheppali ,
  dhenigurinchi matladali anipisthundi…..may be koncham time paduthundi ,
  nuvuu rasina prathidantlo at some point or many points naakhu neenu annavayinchukotam nunchi kolukotaniki kontha samayam paduthundi.May be ne blogs chaduvuthunna chala mandhi khuda nalane feel avuthunnaru la vundhi.

  Bhavakhudugaru cheppinattu thalli dandrulu pillaliki khani pillalu thallidandrula ki khani manasuloni mata cheppukoleni gap yendhuku vuntondhi?

  Every coin has a head and a Tail.

  Conclusion ki raleni, cheppaleni sandrabhalu yeevi.Yeekhado chadivanu……

  Once in an interview The Great India’s Super Star Amitab yella chepparu……..

  Thanu movies lo try chesthunna kothalo vunna frastration lo

  vo roju valla nanna tho ” Yendhuku nanna nannu nannu khannavu anii annaranta………”

  Tharuvatha roju valla nannagaru Amitab gari table meedha vo note pettaranta

  andhulo yella vundhanta

  ” Nee pillalli nuvuu valla parmission theesukhuni kanu anii………………………???”

  Just chinna mataa chala lothaina answer.Khadu.

  Yes Pillalu Status symble ayipoyaru yerojullo,

  India vachesthanu, yekhada gadidha chakiri kante India lo Rajula bathakochu ante ,

  Vadhura akkhada vunte manaki vullo prestage… Manchi life,Mnachi Katnam(Crime ani thelisina theesukhuntunnamu , yesthunnamu,no intentions to hurt any one )ane parents vunnaru……………..

  Adhedo cinema lo venki cheppinattu , car kontanu gani maa nnannai yekhinchu thippalenuga, jwaramosthe mandhu veyalemu ga anukhune pillalu vunnaru……….

  Yelanti alochanalu ,badhalu mostly NRI’s koncham yekhuva dhuram ga vunnamane benga,annitini ,ammavallani miss avuthunnamane guilt pedhaipoyamu anukhune pilla mansalunna memallni peelchi peppichesthundi.

  The other way round India lo vundikhuda , may be few hours away from home and parents ayivundi khuda Swadesam lo vunna chala mandhi na lanti vallu khuda Amma vallani chala miss avuthunnamu.Amma vallani chudataniki , valla dhaghariki vellataniki khuda reason khavali,yedo functionko ,ledha ma pani vundo velthunnamu khani just Ammani ,Nanaani ni chudali ani yevaram ( may be most of us ) vellatam ledhu.

  So Guys dont feel bad as u r staying away , Atleast now start to open up and share ur feelings and let the other way happen also.

  Amma makhendhuku nerpaledhu anekante, vallu manaki nerpani chala vishayalu manam nerchukhuntunnamu khada, allantivi vuntayani khuda vallaki thelidhu , So we’ll do it together and see that manam manapillalaki , vallu therigi manaki yelanti vutharalu rasukune avasaram rakhunda chusukhundam.

  Mana bhavalu panchukhuntu , Salahalu cheppukhuntu, nenunnanu ane barosa yechukhuntu , mundhuku sagipodham.

  Chaitanya.

 13. Madhu Prakash says:

  Nijanga .. chala chala.. bagundi .. kallallo neellu girruna tirigayee.. Utharam .. samadhanam rendu chala bagunayee…

 14. Ravi babu says:

  Telugulo blogs intha chakkagaa unnayani naaku teliyadhu inni rojulu. thank god eerojainaa choodagaligaanu. Thanks praveena and bhavukudu
  Ravi Babu

 15. ఎంత బాగా రాస్తున్నారు ప్రవీణ…అద్భుతం.!
  అమ్మ మనసు బాధలో కూడా పిల్లల సుఖమే కోరుకుంటుంది…చాలా బాగా రాసారు. ఇంతకుముందు భర్త్ కి రాసిన ఉత్తరం, ఇప్పుడు ఇది…నిజంగా hates offf

 16. sunita says:

  చాలా బాగా రాసారండి.భావుకుడన్ గారు చెప్పినట్లు 12 ఏళ్ళకు వెనక్కి అమ్మానాన్న కోసం వచ్చినవాళ్ళు ఉన్నారండీ. నా స్వంత చెల్లెలే అలా తిరిగి వచ్చిందని చాలా సంతృప్తితో చెప్తున్నానండి.

  • అవును సునీత గారు..ఇప్పుడిప్పుడే చాలా మంది తిరిగి వస్తున్నారు. భావకుడన్ గారి రిప్లై చాలా బాగుంది..He answered every question

 17. mounica says:

  my god asalu naku goose bumps vastnai.
  so so heart touching,asalu idi chadvina tarvata evarikaina kantlo nillu vastai.
  but ipudu generation lo knchm change vachindi.andariki parents value telustundi.
  net lo ilanti oka world undani teliste nenu eppudo vachedani ikadaku
  pilalaku ippudu parents value telusu,parents ku eppudu telusu.
  chala baga express chesarandi feelings.
  frankly so senti,so so heart touching.

 18. థాంక్స్ మౌనిక గారు. నెట్ లో మంచి బ్లాగ్స్ చాలా ఉన్నాయి. సమయం కుదుర్చుకుని చుడండి.

 19. వాస్తవాలు వాస్తవాలుగానే వుండనివ్వండి. అమ్మ రాసిన ఉత్తరమూ పచ్చి నిజమే. అమ్మతనం వచ్చాక గానీ బహుశా అమ్మ ఉత్తరంలోని అమ్మ మనసు అర్ధం కాదనుకుంటా. పిల్లలు పిల్లలే, అమ్మలు అమ్మలే. ఏ తరమైనా ఇలాగే వుంటుంది కదా. పోస్టు చేయని లేఖలే అమ్మల గుండెల్లో మిగిలిపోతాయి. మంచి ఉత్తరమూ, మంచి ప్రతిస్పందనలు చదివే అవకాశం దొరికినందుకు ధన్యవాదాలు

 20. muralikrishna says:

  ప్రవీణ గారు.. అమ్మ మనసును ఆర్ధతతో చదివించారండీ..

 21. SwethaChandra says:

  wow…really heart touching andi…hats of u

 22. Subhash says:

  amma gurinchi, ee rojulalo tama biddalu doora mavutunna vela aa tallu pade bada gurinchi inta goppaga chepparante mee manasuku, meeku janmanichhina tallidandrulaku vandanam, sirasabi vandam. Kallanu sytam tadi chesina baavaalu ee manasuloni muthyaalu……

 23. Naresh says:

  Facebooks lo sneham ,
  Chating lo prema ,
  Skype lo srungaram,
  Phone call lo prema vethukune kallam edi …

  Neku emi telusu amma , naku anni telusu nanna…

  Avvunu manaku anni telusu … Gal fnd ni girst time matladina time , place , dress color etc anni telusu … Amma puttina roju entha mandiki telusu …

  Gal fnd tinaka pote bujji thinnava , bangar thinnava , ani bathimiladatam… Dhuram ga untey pizza hut order evvatam anni telusu … Amma ni thinnava ani adagatam thappa…

  Amma mannasunu chadavataniki pustakallu kavala, nanna ku mana meda unna pramanu
  Chepataniki cinema lu chudaala ? Eeetharam , maa tharam nunchi avvunu ane ans vastundi ….. Becozzzz memu yantrika jeevitham gaduputhunna yantralam kabbati…

 24. పోస్ట్ చేయకపోయినా అమ్మ రాసిన ఊత్తరం చాలా దూరమే ప్రయాణం చేసింది. అభినందనలు ప్రవీణ గారూ 🙂

 25. Anonymous says:

  ప్రవీణ గారూ మీ పోస్ట్ చెయ్యని ఉత్తరాలు ఇప్పుడే చదివాను. చాలా అంటే చాలా చాలా బాగా రాసారు. నేను “lakshmi cheppe kadhalu”అనే you tube ఛానల్ లో కధలు చదువుతుంటాను. ఈ ఉత్తరాలని చదివే అవకాశం నాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. నా వాట్సాప్ నెంబర్ 9666246228. ధన్యవాదాలు అండి 🙏

 26. Lakshmi Padmavathi says:

  మీ ఉత్తరాలు చాలా బాగున్నాయి. ఈ ఉత్తరాలని మీకు క్రెడిట్ ఇస్తూ నా యూట్యూబ్ ఛానల్ లో చదవాలని అనుకుంటున్నాను. దయచేసి అనుమతించగలరు. తప్పక సమాధానం ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

  🙏ధన్యవాదాలు.

  • నమస్తే లక్ష్మి గారు
   మీకు నచ్చిన నా రచనలు మీ యూట్యూబ్ ఛానెల్ లో చదవండి. It’s a honour for me. Thank you.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s