సత్య(నీలహంస) గారి “ఆకు”
పసిడి చెట్టు కట్టిన ఆకుపచ్చ చీర కుచ్చిళ్ల రెపపెపలు,
కొంగుపట్టి సాగిన గారాల అలకలు,
ఆకుపచ్చని ఆకుల అందాలు.
గాలితో గుసగుసలాడిన వైనం,
తుషారంతో సాగిన సరసం,
వానలో తడిసిన స్నేహం,
ఎండతో చేసిన యుద్ధం,
పచ్చని ఆకులోని భారం,
ఎండిన ఆకులోని అల్పం,
ప్రాతఃకాలాన కమలం,
చాటున ఒదిగిన ఆకుల తోరణం.
నెలవంక నేలను తాకేవేళ,
ఆకుల వయ్యారాలు,
గాలి ప్రియుడిని మురిపిద్దామని,
పత్రాల పదనిసల సరసాలు నేర్చి,
ఆకుల అలజడులు ఏమార్చి,
వాయువుని ముద్దాడి,
సిగ్గుదొంతరలలో కూరుకుపోయి,
వృక్షాల శాఖోపశాఖలు ఆక్రమించిన ఆకులు.
పచ్చని ఆకులకు,
భగ్గున వేసిన మంటను,
ఎండిన ఆకులోని తేమ,
చిగురించిన కొమ్మలలోని,
చిగురాకుల చెమ్మ,
ఆర్పదా ఆకుల అగ్నిసెగలను.
Note:ఎలా ఉందండి ఇది? ఇంకోటి ట్రై చెయ్యనా?? దీనిని కవిత అనొచ్చా?
meeru baaga raastunnaaru. ayithe ee post chaala tvaraga raasi untaaru anipinchindi naaku. second half lo kaastha time theesukunte baaguntundani pinchindi. I should say its a very good attempt! and all the best!
అవును శివ గారు..కాస్త త్వరత్వరగా రాసేసాను..మీకు అలా ఎలా తెలిసిపోయిందండి?
Thank you Sive garu..