ఆడవారి మాటలు: C++ *pointerలు


ఆడవారి మాటలు: C++ *pointerలు

ఈ c++ pointers తో భలే చిక్కొచ్చి పడిందండీ! వీటిని అర్థం చేసుకోవటమూ కష్టమే,  వీటిని బోధించడమూ కష్టమే. కానీ ఒక్కసారి concept అర్ధం అయితే భలే మజాగా ఉంటుంది.

ఒక్కోసారి program అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ output మనం అనుకున్నట్లు రాదు. ఎక్కడో అసలు అర్ధం వేరుగా ఉంటుంది. Memory location వేరే దేనినో point  చేస్తూ ఉంటుంది మన మనసులాగా. variable( మన మాట) value ఒకటి ఉంటుంది, address(మన మాట అర్థం) మరోటి ఉంటుంది. వీటి రెంటి మధ్య link pointer సరిగ్గా లేకపోతే program crash (మాటల యుద్ధం) అయిపోతుంది.

ఈ pointers కనిపెట్టిన వారెవరో కానీ, ఆయన వాళ్లావిడను భలే అర్థం చేసుకుని ఉంటారు. ఆయన బోల్డు మంది girl friendను successful గా manage చేసి ఉంటారు. లేకపోతే ఇంత complicated concepts ని ఎలా కనిపెట్టగలుగుతారు. లేకపోతే ఈ pointers ని కనిపెట్టింది ఒక lady అయ్యిఉంటారు. yes..yes..this is a good conclusion. So lets all agree that only ladies can invent complicated things like pointers. 

       int x;
       int *ptr=&x;
                  cin>>x;
                 cout<<*ptr<< ” meaning is = “<< ptr;

  sample input and output:
44
44 meaning is 0012FF60

మనకి కూడా ఇలాంటి పోగ్రాం built in గా మన బుర్రలో install అయ్యిఉంటే ఎంత బాగుండు కదా…

పలుకు మాట;
పలుకు *అర్థం =&మాట;
cin>>మాట;
cout<<*అర్థం << ” meaning is = “<< అర్థం;

sample input and output:
run1:
i/p = నాకు అస్సలు తీరిక లేదండి
o/p =  నాకు అస్సలు ఆసక్తి లేదండి
run2:
i/p = ఈ నెల డబ్బులు చాలా tight అండి, సర్ధలేను.
o/p = మీరు డబ్బులు తిరిగి ఇస్తారన్న నమ్మకం నాకు లేదు
run3:
i/p = మీ చీర బాగుంది 
o/p = నా చీర గమనించారా?
run4:
i/p : మీకు లాగానే నా స్నేహితురాలి భర్తకు, నా స్నేహితురాలంటే ఎంత ప్రేమో. మీరు మన పెళ్లి రోజున పట్టుచీర కొనిచ్చినట్లు, నా ఫ్రెండ్ వాళ్ళాయన వాళ్ళ పెళ్లి రోజున వజ్రాల హారం కొనిపెట్టారు.
o/p: బోడి పట్టు చీరేనా కొనేది, కొంటే వజ్రాల హారం కోనాలికాని, అదీ ప్రేమంటే.

ఇది కొంచెం advance complicated library:

pointer to an array of pointers:                                                       

                                      భర్త  —–> 1)ఆఫీసు లో చాలా పని ఉంది. 
                                                         2) ఈ రోజు ఇంత traffic వుందేమిటబ్బా?
                                                         3) బంగారం ధర బాగా పెరిగిపోయింది.

      పాయింటర్ ——|  భార్య —>  1)ఈ రోజు నాకు వంట చెయ్యాలా?                                                       
                                                       2) వింటున్నారు కదా 
                                                       3) మీరు, పిల్లలు అస్సలు మాట వినట్లేదు 
                                                       4) చాలా షాపింగ్ చెయ్యాలి 

                                      పిల్లలు —> 1)నా ఫ్రెండ్ కొత్త ఇఫోనే కొనుక్కున్నారు. 
                                                         2) మాకు రేపు సెలవు.

any doubts???Raise your hand please….

This entry was posted in ఆడవారి మాటలు. Bookmark the permalink.

21 Responses to ఆడవారి మాటలు: C++ *pointerలు

 1. సత్య says:

  your concept of pointers application to the regular life is great!

  pointers అయితే అర్థమయ్యాయి కానీ…
  ఆడవారి మాటలే ..!!?!?!?!?!?!?!

  • Pointers ఎలాగోలా అర్థం చేసుకోవచ్చు సత్య గారు…ఆడవారి మాటలు, మాటల వెనకాల అర్థాలు, ఆ అర్థాల వెనుక భావాలూ …అబ్బో చాలా depth ఉందండోయ్..

 2. s says:

  good one. 🙂

 3. సత్య says:

  praveena gaau namaste

  మీకిదే కవితా పోటీకి ఆహ్వానం

  http://neelahamsa.blogspot.com/2011/02/open-challenge.html

 4. Deepthi says:

  Good one, Praveena. Motthaniki panthulamma anipinchukunnavu!! I have a doubt….nee blog mee sreevaaru chadhuvuthunnaraa???

 5. RSReddy says:

  pointers ని కనిపెట్టింది మగాయనయ్యుంటే ఆయనకు బోల్డు మంది girl friendను successful గా manage చేసి ఉంటారు.
  అదే లేదీ అయ్యిఉంటే only ladies can invent complicated things like pointers అoటారా?
  ఏంటండీ మీ ఆడపక్షపాతం. ఆవిడకూడా ఓ అయిదారు బాయ్ ఫ్రెండ్స్‌ను మేనేజ్ చేసి ఉండకూడదంటారా?

  • RS Raddy garu:అంతేనంటారా?! ” ఓ అయిదారు బాయ్ ఫ్రెండ్స్‌”….అమ్మో ఇంకేమన్నా ఉందా, ఆవిడ బతికి బయటపడుతుందా? పాయింటర్స్ కనిపెట్టేదాక ఎక్కడండి, ఒకళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్స్ ను సరిచేసే సరికే బుర్ర బ్లాంక్ అయిపోతుంది 🙂 . ఏమైనా కానీ, అబ్బాయిలు ఎంతమందినైనా గర్ల్ ఫ్రెండ్స్ ను చచ్చి చెడి అయినా మేనేజ్ చెయ్యగలరు. అంటే కనీసం చావు తప్పి కన్ను లోట్టపోవటం లాగా..పాపం అమ్మాయిలకు అంత కళాపోషణ లేదేమోనని నా అభిప్రాయం…ఏమంటారు??? ఒకటి మాత్రం నిజం, మేము ఎంత easy విషయానన్నాcomplicate చేసేయ్యగలము…

   • గోపి says:

    ” ఒకటి మాత్రం నిజం, మేము ఎంత easy విషయానన్నాcomplicate చేసేయ్యగలము…”
    ఇది మాత్రం బాగా చెప్పారండీ!

    C++ ని జీవితానికి ఇంత బాగా అన్వయించుకోవచ్చని అస్సలు అనుకోనే లేదండీ!

 6. సోము గారు: ఏదో సరదాకి రాసిన పోస్ట్ మాత్రమే ఇది. ఎవరిని తప్పు పడదామన్న ఉద్దేశ్యం ఊహా మాత్రంగానైనా లేదు ఇందులో. ఏది ఏమైనా సరదాకి కూడా ఎదుటి వారి మనోభావాలు కించపరచకూడదు. తెలిసో తెలియకో నా పోస్ట్ లో మీకు విపరితార్ధాలు కనిపిస్తే మరోలా అనుకోకండి. అలాగే పైన రాసిన కామెంట్స్ కూడా సరదాగా రాసినవే.మీరు ఎందుకో చాలా సీరియస్ గా తిసుకున్నట్లున్నారు. మీరు కొంచెం ఘాటుగా స్పందిచ్చారేమో అనిపించింది నాకు, పైగా కామెంట్ రాసిన వారు కూడా బాధ పడతారేమో అని మీ కామెంట్ పోస్ట్ చెయ్యట్లేదు.

 7. sudha says:

  ప్రవీణా,
  పాయింటర్స్ భాషని ఆడవాళ్ళమాటలకి వర్తింపచేసిన తీరు బాగుంది. కామెంట్స్ లో తెలిసింది మీరు పంతులమ్మని.అందుకే అంత వివరంగా చెప్పారు. చివర అడ్వాన్స్ కాంప్లికేటెడ్ లైబ్రరీలో వాక్యాలకు సంబంధం బుర్రకెక్కలేదనుకోండి ఆవిషయంలో చెయ్యేం ఖర్మ…చేతులెత్తేసా.
  ఎంత సింపుల్ విషయాన్నైనా కాంప్లికేట్ చెయ్యగలం. ఎస్. అదే మన ఆడవాళ్ళ ప్రత్యేకత.

  • సుధ గారు: అహహా..చేతులేత్తేసారా…నెక్స్ట్ క్లాసు లో explain చేస్తానులెండి. So be my student, ధైర్యం కుడబెట్టుకుని వచ్చెయ్యండి…పారిపోకండోయ్. నిజమే మనం చేసినట్టు విషయాలను కాంప్లికేట్ చెయ్యటం ఎవరికి తెలుసు??

 8. sudha says:

  అలాగే పంతులమ్మగారు, నెక్ట్స్ క్లాసుకి తప్పకుండా వస్తా. ముందే చెప్పడం మర్చిపోవద్దు సుమా.

 9. Vahab says:

  Praveena garu,

  Meeru rasina veedanam chala bagundhi. Unfortuntely pointers ni atanu ( male ) kani pettaru. Jeevitam lo chala mandhi girl friends ni manage chesi untaru annaru, kaani oka girl friend ni manage cheyadam kante pointers kanipettadam easy plus peru vastundhi ani kani petti undadu..

  chala baga undhi meeru rasina vidanam.. all the best.

 10. Balu says:

  1. chalaa baga rasaru
  2. elantidhi asalu vuntudha… vunte naku kuda chip kavali
  3. evaru elanti vallo cheppe office open chesta, appudu vachina money ni emi chedam abba….

 11. Vidya Rani says:

  Thanks praveena C++ ippudu konchem ardam ayinattu vundi

 12. Deepa says:

  Really good:)

 13. pnrao says:

  No program or no one can calculate their thoughts (Girl Fries, Mother,Sister and Wife)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s