పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : పతిదేవులకు పత్నీదేవత రాసిన ఉత్తరం: ( భార్యలకు మాత్రమే. భర్తలకు నిషేధం.)


పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : పతిదేవులకు పత్నీదేవత రాసిన ఉత్తరం: ( భార్యలకు మాత్రమే. భర్తలకు నిషేధం.)

This post is only for ladies. If some husbands read this, they may feel hurt or guilty. So, gentleman, I kindly request you not to read this and hate me…please…(నన్ను తిట్టకండోయ్)

 ప్రియాతి ప్రియమైన పతిదేవులకు పత్నీదేవత ప్రేమతో రాస్తున్న ఉత్తరం,

                 ఉభయ కుశలోభరి! ఎన్నో యుగాలుగా మీకో ఉత్తరం రాద్దామనుకుంటున్నా, ఈ యుగంలో సాహసిస్తున్నా. వినే శక్తి లేని మీకు చదివే శక్తి కనీసం ఈ కలియుగంలోనన్నా ఉందేమోనని ఆశ పడుతున్నా.

గమనిక: నువ్వు అన్నచోటల్లా  మీరు అని చదువుకోవాలని ప్రార్ధన:

నువ్వో  యోధుడిలా యుద్ధానికి తరలి వెళ్లావు. నేను నాలుగు గోడల మధ్య, నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఉహించుకుంటూ, భయపడుతూ, దైర్యన్నిచ్చుకుంటూ, ప్రార్ధిస్తూ భారంగా కాలాన్ని వెల్లదీస్తున్నాను. ఎవరి కష్టం ఎక్కువ? నీదా? నాదా? అని మాత్రం అడగకు. ఏ వేదాల్లోనూ, ఉపనిశత్తుల్లోనూ సమాధానం ఉంటుందని అనుకోను.

నువ్వు వీరుడిలా తిరిగివస్తాను. నీకు విజయ తిలకందిద్ది, మంగళ హారతి ఇచ్చి స్వాగతం పలుకుతాను. నీ కళ్ళలో కనిపించే విజయంలో, నేను నా విజయాన్ని వెతుక్కుంటాను. అంతటితో నా ఎదురుచుపుల సమరం అంతం అవ్వాలని ఆశ పడతాను.  నువ్వు మాత్రం వీధి గుమ్మంలో ఆగిపోయి, అరుగుపై ఆసీనుడివై, చీకటి పడే దాకా నీ విజయగాధలు ఇరుగుపొరుగు అందరికీ విడమర్చి చెపుతూనే ఉంటావు. ఏ గుమ్మం లోపలో, కిటికీ వెనకాలో నిలబడి నువ్వు చెప్పేవన్నీ వింటూ ఉంటాను. ఆఖరి అతిధిని సాగనంపి ఏ చీకటి వేళలోనో ఇంట్లోకి వస్తావు.

నీకోసం పంచభక్ష్య పర్వాన్నాలు వండి వడ్డిస్తాను. “నువ్వు తిన్నావా” అని ముక్తసరిగా నువ్వడిగే మాటలో భాద్యత మాత్రమే ఉందో, ప్రేమతో కలిసిన భాద్యత ఉందో ఇన్ని యుగాలుగా నీతో కాపురం చేస్తున్నా నేను గ్రహించుకోలేకపోయాను.

నీకు అన్నం వడ్డిస్తూ ఆశగా ఎదురుచూస్తాను, నీ పరాక్రమాలు నాకు చేపుతావేమోనని. కుటుంబం గురించి నాలుగు ప్రశ్నలు అడుగుతావంతే!

నా ఎదురుచూపు నాతోనే ఉండిపోతుంది ఎప్పుడునూ.

కాలక్రమంలో నా బాధ్యతలు నాతోనే ఉన్నాయి. నీ బాధ్యతలు కూడా స్వీకరించాను. అందులో నాకేమి బాధ లేదు, నీ పని, నా పని కూడా అనుకోవటం లో నాకెంతో తృప్తి ఉంది.నాకు project works ఉన్నాయి,  డెడ్ లైన్స్ ఉన్నాయి, ఆఫీస్ pressures ఉన్నాయి. నీతో పాటు నేను ఏ late evening యో ఇంటికి వస్తున్నాను.

నా ఇంటి పని, వంట పని నాదే. నీకు  మాత్రం టీవీ, క్రికెట్, news, కంప్యూటర్. నువ్వేదో ఇంట్లో పనంతా చేసెయ్యాలని నేననుకోను. నాతొ పాటు వంటగదిలోకి వచ్చి ఆ రోజు నీ ఆఫీసులో జరిగిన సంగతులు  నాకు చెప్పాలని, నేను చెప్పే కబుర్లు నువ్వు వినాలని ఎదురుచూస్తాను అంతే.

ఆ ఎదురుచూపు నేటి దాకా ఎదురుచూస్తూనే ఉంది…

 అంతా నేనే అనుకుంటాను, ఏది నాది కాదని అనుదినం గుర్తుచేస్తూనే ఉంటావు. అయినా నేను అంగీకరించలేను.

నీలో సగభాగమనుకుని,
నా పూర్తి భాగం నీకిచ్చేసి,
నన్ను నేను మరచిపోయి,
నీలో నన్ను కోల్పోయి,
నాకంటూ ఏది మిగలక,
మిగిలినవేవి నావికాక,
ఒంటరిగానే మిగిలాను నేటిదాకా.

అంతులేని నస అంటావు, అంతంలేని సాధింపులంటావు, నేనొప్పుకుంటాను. కానీ ఆ పిచ్చితనం వెనుక వున్నా పిచ్చి ప్రేమ కనిపించదా?

సిరి సంపదలు కురిపిస్తున్నా, పేరు ప్రఖ్యాతలు వ్యాపిస్తున్నా, నీకు ఇంకేమి కావాలంటూ ఎన్ని తరాలు నడిపేస్తావు? ఎన్ని యుగాలు గడిపేస్తావు?

ప్రపంచాన్ని జయించావు, విశ్యాన్ని అర్ధం చేసుకుందామని అహర్నిశలు ప్రయత్నిస్తున్నావు. నీకు జన్మ నిచ్చిన తల్లిని, నీ జీవితాన్ని పంచుకున్న భార్యని అర్ధం చేసుకోగలిగావా?

నువ్వు సంపాదించిన ఆస్తి కాదు, నువ్వు కట్టించిన భవనం కాదు, నువ్వు చేపించిన నగలు కాదు..నీతో గడిపిన మధుర స్మృతులు, నువ్వు నాకిచ్చిన గౌరవం, నీకు నాపైన ఉన్న ప్రేమ, అంతులేని ప్రేమ..అర్ధం చేసుకునే శక్తి ఉందా నీకు??

భూమి పుట్టక నుంచీ, నువ్విలాగే ఉన్నావా? లేక నడమంత్రపు సిరిలాగా నెత్తి కేక్కించుకున్నావా ఈ పురుశంహకారాన్ని?
రాజ్యాల ఆక్రమణలో, ధనం సంపాదనలో ఆపాదించుకున్నావా ఈ నిర్లక్ష్యాన్ని?

ఈ ఉత్తరం ఎప్పటికీ నీకు చేరదు, ఎందుకంటే నాకు నీ హృదయం చిరునామా తెలీదు. సప్త సముద్రాలు దాటి వచ్చాను, ఇప్పుడు ఏ  మాంత్రికుడి మంత్ర దండంలో దాక్కుని ఉందో  నీ హృదయం కనిపెట్టే ప్రయత్నంలోనే ఉన్నాను నేను.   
                                                                    ఇట్లు,
                                                                    యుగాలుగా కాపురం చేస్తున్న మీ భార్య

 


This entry was posted in పోస్ట్ చెయ్యని ఉత్తరాలు. Bookmark the permalink.

30 Responses to పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : పతిదేవులకు పత్నీదేవత రాసిన ఉత్తరం: ( భార్యలకు మాత్రమే. భర్తలకు నిషేధం.)

  1. jyothi says:

    బాగుంది.కాని ఇది భార్యలకు మాత్రమే అని కాదు,భర్తలకు మాత్రమే అని ఉండాలి కాప్షన్.

  2. నన్ను వాయించేయ్యరూ…జ్యోతి గారు

  3. చాలా బాగా రాశారండీ! Brilliant! జ్యోతి గారు చెప్పిన మాట నిజమేనేమో! 😉

  4. Mauli says:

    praveena,

    మొదట సె౦టిమె౦ట్, చివరిలొ హ్యూమర్ భలె కలిపి వ్రాస్తార౦డీ మీరు …

  5. Anonymous says:

    మరి కొందరి భర్తల బాధలు ఎవరికి చెప్పుకోవాలి

  6. ramesh says:

    జ్యోతి గారు అన్నట్లు ఈ పొష్ట్ భర్తలు చదివితే వారిలొ కొంత మార్పు (మీరు ఆసించిన) వస్తుందేమొ!.

    General (subject matter) గా వ్రాసే పొష్ట్ లకు బయపడకూడదేమొ!.

  7. Kumar N says:

    Ha Ha Ha 🙂
    బాగా రాసారు. మధ్యలో కొన్ని పార్టులు పోస్ట్ థీం కి కొంచెం దూరంగా వెళ్ళినట్లనిపించి సరిగ్గా అతకలా. కాని కొన్ని వ్యాక్యాలు బాగా పేలాయి.
    సరే భర్తల తరపున నా సమాధానం.
    “అంతులేని నస అంటావు, అంతంలేని సాధింపులంటావు, నేనొప్పుకుంటాను. కానీ ఆ పిచ్చితనం వెనుక వున్నా పిచ్చి ప్రేమ కనిపించదా?”

    మాకొద్దు బాబో అంత ప్రేమ. మోతాదులో చూపిస్తే చాలు 🙂

    భూమి పుట్టక నుంచీ, నువ్విలాగే ఉన్నావా? లేక నడమంత్రపు సిరిలాగా నెత్తి కేక్కించుకున్నావా ఈ పురుశంహకారాన్ని?
    ఇన్ని తిట్లు చూసాను గానీ, ఇంత ఘోరమయిన తిట్టు ఇప్పుడే చూస్తున్నా 🙂 మీ మీద gender insulting అని ఓ law suite file చేయబోతున్నా.

    • Kumar garu..anta pani matram cheyyakandi…law suit…
      edo ila batakaneeyanivvandi…thnkas for responding

      • కుమార్ గారు : “మాకొద్దు బాబో అంత ప్రేమ. మోతాదులో చూపిస్తే చాలు”, I agree with you. Wife or husband should give enough space for his/her partner to move. మరీ బందించేస్తే విరక్తి వస్తుంది.

  8. jaydev says:

    madam,it was the letter written to nepolion by his lover.I think u just translated it in gd language..

    • జయదేవ్ గారు…

      బాబోయ్..మరీ దారుణం..

      చిన్నప్పుడెప్పుడో చరిత్ర పాటాల్లో చదివిన గుర్తు నెపోలియన్ గురించి..

      మీ దగ్గర ఉత్తరం మీ దగ్గర ఉంటే కాస్త పోస్ట్ చెయ్యండి sir…

  9. Mauli says:

    //నీలో సగభాగమనుకుని,
    నా పూర్తి భాగం నీకిచ్చేసి,
    నన్ను నేను మరచిపోయి,
    నీలో నన్ను కోల్పోయి,
    నాకంటూ ఏది మిగలక,
    మిగిలినవేవి నావికాక,
    ఒంటరిగానే మిగిలాను నేటిదాకా.

    అంతులేని నస అంటావు, అంతంలేని సాధింపులంటావు, నేనొప్పుకుంటాను. కానీ ఆ పిచ్చితనం వెనుక వున్నా పిచ్చి ప్రేమ కనిపించదా? ///

    ఆ పిచ్చి ప్రేమ ఇద్దరిలోను ఉ౦టు౦దేమో న౦డి …వ్యక్త౦ చెయ్యడ౦ లోనే ఇద్దరి లోని లోపమూ ను 🙂

    మార్గ౦ తెలియాలి అ౦టే ఉత్తర౦ పోష్ట్ చెయ్యాల్సి౦దే, …చిరునామా తెలియదు అని తప్పి౦చుకోవడ౦ యె౦దుకు 🙂 ..అడ్రస్సు తెలిసి౦దెదో వ్రాస్తే పోష్ట్ మాన్ చూసుకొ౦టాడు గా 🙂 ..ప్రయత్న లోప౦ ఉ౦డకూడదు కదా అని నా భావ౦ …

    @ఇప్పుడు ఏ మాంత్రికుడి మంత్ర దండంలో దాక్కుని ఉందో నీ హృదయం కనిపెట్టే ప్రయత్నంలోనే ఉన్నాను నేను.

    ‘ఆ మాంత్రికుడి మ౦త్రద౦డ౦’ అతని హృదయాన్ని వెతికే ఆ అమ్మాయి మనసే నేమో ..సప్తసముద్రాలు దాటినా అది ఆమే తో నే ఉ౦టు౦ది …కాని తనలో చూసుకోదే ఆమే …ఎలా 🙂

    • చాల చాలాకరెక్ట్ గా చెప్పరు మౌళి గారు. ఒకళ్ళకు (wife or hubby) express చెయ్యటం రాదు, మరోకళ్ళకు(wife or hubby) reach అవ్వటం రాదు. అక్కడే లోపం అంతా.
      “కాని తనలో చూసుకోదే ఆమే “..beautifully said…
      అందుకే అంటారు men are from mars, women are from venus..
      Thans for responding మౌళి గారు

  10. సత్య says:

    ఆ ధర్మపత్నీదేవికి సానుభూతి తెలుపుతూ…

    –యుగానికొక్కడు

    http://neelahamsa.blogspot.com/2011/02/blog-post_18.html

  11. హాహా భలే రాసారండి సత్య గారు

  12. “సిరి సంపదలు కురిపిస్తున్నా, పేరు ప్రఖ్యాతలు వ్యాపిస్తున్నా, నీకు ఇంకేమి కావాలంటూ ఎన్ని తరాలు నడిపేస్తావు? ఎన్ని యుగాలు గడిపేస్తావు?”

    “నువ్వు సంపాదించిన ఆస్తి కాదు, నువ్వు కట్టించిన భవనం కాదు, నువ్వు చేపించిన నగలు కాదు..నీతో గడిపిన మధుర స్మృతులు, నువ్వు నాకిచ్చిన గౌరవం, నీకు నాపైన ఉన్న ప్రేమ, అంతులేని ప్రేమ..అర్ధం చేసుకునే శక్తి ఉందా నీకు??”

    సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్…మాటల్లేవ్…అద్భుతంగా రాసారు. చాలా అందంగా చెప్పారు. మీకు జోహార్లు….

  13. swathi says:

    అంతా నేనే అనుకుంటాను, ఏది నాది కాదని అనుదినం గుర్తుచేస్తూనే ఉంటావు. అయినా నేను అంగీకరించలేను.
    baaga rasarandi
    swathi

  14. Pingback: పోస్ట్ చెయ్యని నా ఉత్తరాలకు వచ్చిన ప్రత్యుత్తరాలు | నా అనుభవాలు….ఆలోచనలు…

  15. Prabandh Pudota says:

    Nenu ee blog ippativaraku chudaledhe anukunnanu..
    ledhandi..neni blog inthakumundhe chusaanu..ee post already chadhivanoch….

  16. పద్మా శ్రీరామ్ (స్ఫూర్తి) says:

    అద్భుతం ప్రవీణా! కొన్ని చోట్ల గుండె పిండినట్లయింది.భార్య మనసు చదవకపోవడం అన్నది ప్రతి మగాడి లోనూ ఉన్న లోపమే . ఏ అవతారపురుషుడూ దానికి ఎక్సెప్షన్ కాదు. కానీ మళ్ళీ మళ్ళీ మనం ఆడవాళ్ళలానే పుట్టాలనుకుంటాం. అది మనకు మనం మాత్రమే ఇచ్చుకోగలిగిన గౌరవం.కాపురంలో కలతలే ఉండక్కరలేదు. ఇలాంటివన్నీ చేసిన గాయాలు మనక్కూడా ఒక్కోసారి గుర్తుండనంతగా మనం మనను కోల్పోతూంటాం కాపురాలలొ….ఇంకా ఎంతో చెప్పాలనుంది.నే వ్రాసిన కవిత పెళ్లిపుస్తకం గుర్తొచ్చిందొక్కసారి……

  17. Anonymous says:

    baga rasaru good

  18. phani says:

    ఈ ఉత్తరం ఎప్పటికీ నీకు చేరదు, ఎందుకంటే నాకు నీ హృదయం చిరునామా తెలీదు. సప్త సముద్రాలు దాటి వచ్చాను, ఇప్పుడు ఏ మాంత్రికుడి మంత్ర దండంలో దాక్కుని ఉందో నీ హృదయం కనిపెట్టే ప్రయత్నంలోనే ఉన్నాను నేను.
    మీరో విషయం మరచిపోయారు దానివల్లే post చెయ్యవలసిన address దొరకలేదు అనుకుంటా. అదేనండి భార్యని భర్త తన సగంగా చేసుకొని తన ఎడమ భాగంలొ వుండవలసిని హృదయాన్ని/మనస్సుని ఎక్కడొ పారేసుకున్నాడు అది మరచిపోయి భర్త మనశ్శాంతి కోసం పరితపిస్తాడు, తన భర్త తనకొసం హృదయాన్ని పరిత్యజించేడనే విషయం మరచి భార్య అతని హృదయం లొ స్తానం కావాలని తాపత్రయపడుతుంది. కోల్పోయిన వాటి వేటలొ ఇద్దరు ఉమ్మడిగా జీవన సారాన్ని కొల్పొతున్నరు.

  19. చాలా బావుందండీ ప్రవీణగారు. ఇది మీరు ప్రచురించ్నప్పుడే చదివి ఆనందించాను గానీ ఏదో విషయం గుర్తొచ్చి ఇప్పుడు వ్యాఖ్య రాస్తున్నాను. చాన్నాళ్ళ కిందట పూర్ణిమగారు (పుస్తకం.నెట్ నిర్వాహకులలో ఒకరు) దీనికి రివర్సుగేరులో, అంటే భర్త భార్యకి చిత్తగించిన విన్నపములు చాలా రొమాంటిగ్గా రాశారు. తెలుగువాడైన భర్త ఎవడూ తన ధర్మపత్నికి అలా రాయడు అని నేనంటే, జనాలందరూ నన్ను కొట్టడానికొచ్చారు!

  20. Karimulla Ghantasala says:

    అద్భుతం ఈ రచన! ప్రవీన గారూ, మహా క్లిష్టమైన, ఎంతో సున్నితమైన, ఆసాంతం మార్మికమిన స్త్రీ-పురుష సంబంధలకు చెందిన, ప్రత్యెకించి దాంపత్య బంధాలకు సంబంధించిన విషయాలను ఎంతో ఖచ్చితమూ, సునిషితమూ, తీక్షణమూ, అనుభూతి సాంద్రమూ ఐన శైలిలో పరమాద్భుతంగా చిత్రించారు. తాత్వికంగా చూస్తే ఈ ప్రష్నలు వేయడం స్త్రీకి ఎంత అవసరమో, పురుషుడికి అంతకు పది రెట్లు ఎక్కువ అవసరం.

  21. గోపి says:

    మీరు పతిదేవుళ్ళకు నిషేధం అన్నారు. పెళ్లి కాని వాళ్ళ గురించి ఏమీ చెప్పలేదు.ఆ లొసుగు ని బాగా ఉపయోగించుకున్నా.

    బాగా రాసారండీ. కొన్ని సార్లు ఇలా పత్నీదేవతలు ఉత్తరాన్ని పోస్టు చేస్తేనే మంచిదేమో!;)

Leave a reply to Anonymous Cancel reply