మనం గ్రహించుకో(లే)ని అదృష్టం మన మాతృదేశం


 మనం గ్రహించుకో(లే)ని  అదృష్టం మన మాతృదేశం

మనందరికీ by defaultగా మన దేశం ఉంది. మన దేశం మనకు take it for granted. మాతృదేశం అంటూ ఒకటి ఉండటం కూడా అదృష్టమే అని, అది కూడా లేని వాళ్ళు ఉంటారని, వాళ్ళు అత్యంత దురదృష్టవంతులని, వాళ్ళను చుసిన తర్వాతే నాకు అర్ధమైయింది.

నాకు ఇరాన్ దేశానికి చెందిన ఒకతను  తెలుసు. పేరుకే ఆయన ఇరానియన్. అతని తాతలు ఆ దేశం వదిలేసి వలస వచ్చేసారు. అతని తండ్రి చిన్నతనంలోనే సౌది, జోర్డాన్ దేశాలకు వలస వెళ్ళిపోయారు. అతని తండ్రికే ఆ దేశం ఎలా వుంటుందో గుర్తులేదు. ఇతను అక్కడ పుట్టలేదు, పెరగలేదు సరికదా, కనీసం ఆ దేశం ఎన్నడూ వేల్లనన్నా వెళ్ళలేదు.  కానీ ఈ నాటికీ అతను ఇరాకీ passport తోనే తిరుగుతాడు, కాదు బతుకుతున్నాడు. అతని పిల్లలకు కూడా అదే పరిస్తితి. ఏ దేశం వెళ్ళాలన్న అతనికి పెద్ద సమస్య. ఈ ఇరాకీ passportని ఎలాగన్నా వదిలించుకుందాం, కనీసం అతని పిల్లలకన్నా ఒక దేశం అంటూ వుంటుంది అని కెనడా immigration కి   మూడేళ్ళ క్రితం అప్లై చేస్తే, ఇప్పటిదాకా ఆ processing లో ఏ పురోగతి లేదు.

ఒక దేశంలో పుట్టాడు, మరో దేశంలో కొంత చదివాడు, మరో దేశంలో మరికొంత చదివాడు, ఇంకో దేశంలో ఉద్యోగము చేస్తున్నాడు. కానీ అన్ని దేశాలలోను అతను పరాయి వాడే. ఏ దేశంలోనూ అతనికి security లేదు. పొట్ట చేతపట్టుకుని ప్రపంచం అంతా తిరుగుతున్నాడు.

Recession timeలో  ఉద్యోగాలు ఎడాపెడా పీకేస్తున్నటైములో  అతను నాతో ఒక మాట అన్నాడు. “నీకు ఇక్కడ ఏదన్నా ఇబ్బంది వస్తే, నువ్వు  నీ దేశం తిరిగి వెళ్లిపోగలవు.  You have a place to live. If that happens to me, where can I go? I have no land to stand.” ఎంత దిగులు, భయం, అస్తిరత వున్నాయో ఈ మాటలో.

పాలస్తీనా, ఇరాన్..ఇలాంటి దేశాల వారి పరిస్తితి ఇది. ఇలాంటి దౌర్భాగ్యులు కోట్లలో ఉన్నారు ఈ ప్రపంచంలో. ‘ఇది నా దేశం’ అని చెప్పుకోలేని దురదృష్టవంతులు.

అమెరికా, UK, కెనడా, దుబాయ్…ఎన్నో దేశాలలో మన భారతీయులు ఉన్నారు. నివాసం ఉంటున్న దేశంలో ఏదన్నా ఇబ్బంది వచ్చినా, ఉద్యోగము పోయినా at any point of time we can return to our country. మొన్నటికి మొన్న ఈజిప్ట్ లో అల్లర్లు జరుగుతున్నప్పుడు భారత ప్రభుత్యం ఈజిప్ట్ లో వున్నా భారతీయులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి తిసుకువచ్చేసారు.

ఒక్కసారి ఊహించుకోండి, మనకు మాతృదేశం అనేది లేకపోతే ఎలా వుంటుందో.

మన దేశంలో మనకు చాల ఇబ్బందులు ఉన్నాయి. We have hell lot of problems to complain. Repair చెయ్యలేనంత విధంగా మన రాజకీయ వ్యవస్థ పడిపోయింది. మన రోడ్లు మురికిగా ఉంటాయి. దోమలు, ఈగలు వీరవిహారం చేస్తూ ఉంటాయి. summer లో power cut.  చెప్పుకుంటూ పొతే ఎన్నో…

అయినా మనం చాల అదృష్టవంతులం. మనకంటూ ఒక మాతృభూమి ఉంది. మనం తల్లి లేని అనాధలం కాదు. May be we are not rich people, but we have parents with us.

“ఇది కూడా అదృష్టమేనా!” అని అనుకునే మనం, ఆమాత్రం అదృష్టం కూడా నోచుకోని వాళ్ళు ఎన్నో లక్షల మంది ఈ ప్రపంచంలో ఉన్నారు అనేది గ్రహించుకోవాలి.

Aren’t we lucky????

This entry was posted in వ్యాసాలు, సమాజంలో సామాన్యులు. Bookmark the permalink.

9 Responses to మనం గ్రహించుకో(లే)ని అదృష్టం మన మాతృదేశం

  1. చిలమకూరు విజయమోహన్ says:

    అవును నిజంగా అదృష్టవంతులమే.

  2. Thanks for responding విజయమోహన్ garu..Inspite of having many problems still we are lucky to be indians.

  3. anrd. says:

    చక్కగా చెప్పారండి.

  4. loknath says:

    ”….ఈ భూగోళం మీద మనిషి అస్తిత్వం మొదలైన తొలినాళ్ళ నుండి కన్నా కలలన్నీ సాఫల్యం చెందే నేల ఈ ధరిత్రిపై ఏదైనా ఉన్నదంటే, అది భారత దేశం ఒక్కటే…”అని అన్నారు రోమరోలా. మనం మాత్రమె అదృష్టవంతులం అనిపిస్తుందండీ…ఒక్కోసారి..

  5. Anonymous says:

    it is naked truth …

  6. Anonymous says:

    I am observing all what you say.In good way you are thinking.

  7. koutarapu ravindra says:

    In good way you are thinking.

  8. kiran polepally says:

    nice1

  9. Abba Praveena, it is a touchy subject.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s