నేనే…..నాకూ భాగమే…..నేను కారణమే…..
కడలి కెరటాలలో ఓ నీటి బిందువును,
నీలాకాశంలో ఓ మబ్బు తునకను,
జడివానలో ఓ వర్షపు చినుకును,
జలపాతంలో ఓ తుంపరను,
భూమిపై కదలాడే ఓ జీవిని,
మనవకోటిలో ఓ మనిషిని,
ప్రకృతిలో సూక్ష్మాన్నే, సూక్ష్మాతి సూక్ష్మాన్నే.
భూమాత భరిస్తున్న భారంలో నేను ఓ భాగాన్నే,
వేచే గాలిలో నే పీల్చే గాలి ఓ భాగమే,
జీవనదిలో నే తాగే నీరు ఓ భాగమే,
పండిన పంటలో నే తింటున్న ఆహారము ఓ భాగమే,
అణువునే, అణువణువులోను అణువునే.
కోటిగొంతుకల ఆర్తనాధంలో,
నాది ఓ గొంతుకే,
వేల హృదయాల ఆక్రందనలో,
నాది ఓ హృదయమే,
పొంగి పొర్లుతున్న కన్నీటి వరదలో,
నా కన్నీరు ఓ చిరు వరదే,
రగులుతున్న విప్లవ జ్వాలలో,
నా ఆవేశమూ ఓ మార్పే .
రాజకీయ కరాళ నృత్యంలో,
నా తప్పడడుగు ఓ కారణమే,
లయతప్పిన మానవత్యంలో,
నా శ్రుతి తప్పిన మనసు ఓ కారణమే,
దిగజారిన వ్యవస్థలో,
నే దిగిన మెట్టు ఓ కారణమే,
న్యాయాఅన్యాయపు క్రయవిక్రయాలలో,
నే చేసిన వ్యాపారము ఓ కారణమే.
ఒకరు చేస్తే తప్పు , అందరు చేస్తే ఒప్పు,
నాతో సహా అందరూ చేసిన తప్పొప్పుల పాపం కాదా ఇది?
వ్యవస్థ కూలిపోతే, నాతో అందరూ కూలిపోరు?
ప్రకృతి వినాశనమైతే, నాతో అందరూ నాశనమైపోరు?
ఒకరు ఒకరు ఒకరు మారితే,అందరూ మారరు?
last lines are impressive….
మరి అంటే కదా అందరూ చేస్తున్న తప్పుకే కదా…Thanks for responding siva garu..