భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే?


భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే?

భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే?

హద్దులు లేని వాక్ స్వాతంత్ర్యం,
గాంధీ నుంచి, గాడ్సే దాకా,
రామాయణం నుంచి, భారతం దాకా,
ఎంత మాట పడితే,
అంత మాట అనేయ్యోచ్చు!

ఎవరైనా, ఎప్పుడైనా,
ఎక్కడైనా, ఎన్నైనా,
పార్టీలు స్తాపించేసి,
గుప్పెడు డబ్బులు జల్లేసి,
గంపెడు ధనం మూటకట్టేసుకోవచ్చు,
స్వర్గ సుఖాలు  అనుభవించేయ్యొచ్చు!

దేశం నడిబోడ్డులో అరాచకం సృష్టించినా,
బస్సుల్లో, రైళ్ళలో  బాంబులు పేల్చినా,
సంవత్సరాల తరబడి,
జైళ్ళలో సుఖపడిపోవొచ్చు,
బిర్యానీలు లాగించెయ్యొచ్చు!

స్కూల్లలో, కాలేజీల్లలో,
IITల్లో, RECల్లో చేదివేసుకుని,
మేధస్సు పెంచేసుకుని,
పరాయి దేశం ఎగిరిపోయి,
మేధస్సు అంతా ఒలకపోసేసి,
పేరు, ప్రతిష్ట పొందేయ్యొచ్చు,
ధనం, దర్పం సంపాదించెయ్యొచ్చు!

నా సినిమా, నా ఇష్టం,
నా సీరియల్, నా కష్టం,
వెండి తెర, బుల్లి తెర,
ఎదైతేనేమి, ఏమైతేనేమి,
ప్రసారం చేసేయ్యొచ్చు,
రేటింగులు పెంచేయ్యొచ్చు!

ఆటగాళ్ళు ,
ఆటను అటకేక్కించేసి,
ప్రకటనలు పండించేసి,
ఓడిపోతూ,
అవార్డులు, రివార్డులు పొందేయ్యొచ్చు!

ఫైనులేదు, బిల్లు లేదు,
రూలు ఉన్నా లేదు,
ఏ నిబంధనలకు,
లొంగకుండా ఆనందించేయ్యొచ్చు!

చట్టాలుంటాయి, కోర్టులుంటాయి,
కుప్పలు తెప్పలు కేసులుంటాయి,
తరాలు తరలిపోయిన తర్వాతే,
తీర్పులుంటాయి,
తప్పులు చేసేయ్యొచ్చు,
తప్పించుకుని తిరిగేయ్యొచ్చు,
బతికేయ్యొచ్చు,చచ్చిపోయచ్చు!

చదువున్నా  లేకున్నా,
విచక్షణ ఉన్నా లేకున్నా,
రౌడీ అయినా, కేడి అయినా,
ఎన్నికల్లో గెలిచేయ్యోచ్చు,
దేశాన్ని ఏలేయ్యొచ్చు,
దొరికినదంతా దోచేయ్యోచ్చు!

సమరయోధులు ప్రాణాలొడ్డి,
సాధించిన స్వాతంత్ర్యం ఇదీ,
స్వార్ధపరుల స్వార్ధంతో,
పౌరుల భాద్యతా రాహిత్యంతో,
తీరుమారిన స్వేఛ్చ ఇది!

యధా రాజ, తదా ప్రజా,
యధా ప్రజ, తధా రాజ!

This entry was posted in ప్రజాస్వామ్యం. Bookmark the permalink.

15 Responses to భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే?

 1. Snkr says:

  /స్కూల్లలో, కాలేజీల్లలో,
  IITల్లో, RECల్లో చేదివేసుకుని,
  మేధస్సు పెంచేసుకుని,
  పరాయి దేశం ఎగిరిపోయి,
  మేధస్సు అంతా ఒలకపోసేసి,
  పేరు, ప్రతిష్ట పొందేయ్యొచ్చు,
  ధనం, దర్పం సంపాదించెయ్యొచ్చు!/

  “పడేవాళ్ళు బాగుపడనీ, ఏడుపెందుకు?
  వాళ్ళూ ఉస్‌మేనియాక్‌లయి బస్సులు తగలెట్టాలనా?!!
  అమ్మపెట్టదూ, అడుక్కుతిననీయదు లా ఎందుకీ ఏడుపు? :))”

  నా ఈ కవిత ఎలా వుందండి? సాధ్యమైనంత విడగొట్టే రాసాను. ఇంకా ముక్కలు చేయాలంటారా?

  • క్షమించండి snkr గారు if I hurt you..
   నాకు లాగానే మీకు కూడా పై పేరా ఎక్కడో కాస్త కదిలించినట్లు ఉంది..
   అవును ఏమీ చెయ్యలేని నా ఏడుపు ఇంతే.
   నేను రచయితను కాదు, కవియిత్రిని అంతకంటే కాదు……నేటి సమాజంలో adjust అవ్వలేక, accept చెయ్యలేక రాసుకున్న ఏవో పిచ్చి రాతలు…అంత వ్యంగం అవసరమా??
   కవిత కాదు, వ్యాసము కాదు…స్పందన, ఆలోచన, ఆశ అంతే ఇది! మీకు అర్థం అవుతుందని ఆశిస్తున్నాను. Thanks for responding…

   • మంచు says:

    బాగుంది.

    ఆ పై పేరా నాకూ నచ్చలేదు. ఐ ఐ టి లలొ, ఆర్ ఈ సి లలొ మీరు అనుకున్నట్టు ఫ్రీగా ఎమీ చదువు చెప్పరు. ఫీజులు పిండి వసూల్ చెస్తారు. ఇక సబ్సిటీ అంటారా.. మిగతా ఇంజనీరింగ్ కాలేజీలకి ఎంత ఇస్తస్తారొ వీటికి అంతే. ఎక్కువ తక్కువ లేదు.

    ఐ ఐ టి లలొ, ఆర్ ఈ సి లలొ మీరు అనుకున్నట్టు ఫ్రీగా ఎమీ చదువు చెప్పరు. ఫీజులు ముక్కు పిండి వసూలు చెస్తారు. ఇక సబ్సిటీ అంటారా.. మిగతా ప్రబుత్వ ఇంజనీరింగ్ కాలేజీలకి ఎంత ఇస్తారొ వీటికి అంతే. ఎక్కువ తక్కువ లేదు.
    ఇక విదేశాల్లొ స్తిరపడే ఉద్యొగుల్లొ, ఒకప్పుడు ఐ ఐ టి, ఆర్ ఈ సీ విద్యార్దులు అధిక శాతం ఉందేవారేమొ కానీ ఇప్పుడయితే మిగతా కాలేజీల్లొ చదివినవారి శాతమే ఎక్కువ.
    ఇక మేధస్సు ఎందుకు తరలి పొతుంది అంటే ముఖ్యకారణాలు ఆకర్షణీయమాయిన జీతం, మేధస్సుకి తగిన అవకాశాలు, పనికిమాలిన రిజర్వేషన్స్. వీటికి వల్లే ఇక్కడ తయారు అయిన మేధస్సు విదేశానికి చేరేది. అయితే గత రెండు సంవత్సరాల నుండి జరుగుతున్న రివర్స్ బ్రైన్ డ్రైన్ చూస్తున్నారు కదా … ఒకప్పుడు తరలిపొయిన మేధస్సు అంతా ఇప్పుడు మన దేశం లొనే ఆ అవకాశాలు దొరుకుతున్నాయని తిరిగి వస్తుంది. అందువల్ల మీరు దీనిగురించి ఎక్కువ బాధ పడక్కర్లేదు. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలలొ కూడా రిజర్వెషన్ సిస్టం వస్తే అప్పుడు మళ్ళీ తిరిగి పొతుంది లెండి…అది వేరే విషయం.

    >>
    ఆటగాళ్ళు ,
    ఆటను అటకేక్కించేసి,
    ప్రకటనలు పండించేసి,
    ఓడిపోతూ,
    అవార్డులు, రివార్డులు పొందేయ్యొచ్చు!
    >>
    ఈ పేరాకి ఆటగాళ్ళు ఎంతమాత్రం బాధ్యులు కాదు. వాళ్ళు ఎవర్ని మోసం చెయ్యడం లేదు. వాళ్ళలొ సీన్ లేకపొతే ఊరికే ప్రకటనలు ఇవ్వడానికి ఆ సదరు కంపెనీలు ప్రభుత్వం క్రింద పనిచెయ్యడం లేదు కదా…

 2. sanjeev says:

  యధా రాజ, తదా ప్రజా,
  యధా ప్రజ, తధా రాజ! sooper 🙂

 3. ramesh says:

  Nice!.

  mee bhaava prakaTana baaguMdi!.

  స్వేఛ్చ స్వాతంత్ర్యం aMTae idae!.

 4. Vamsi says:

  So Finally its people mistake to elect those leaders…………….Isn’t it!

 5. Manohar says:

  manishi manishiga thana naithika badyatha telusoonantha kalam, meeru cheppinatle vuntundi.
  mee padalaloo goppa bhava jalam vundi praveena garu,, chala bagunnayi mee kavithalu. chala lothaina vishayalanu, padunaina padajalalatho, sunnitham gaa manasunu thakuthunnai.
  mee kavitha dharaki ive naa nammasulu

  • నా రాతలు మీకు నచ్చుతున్నందుకు, మీరు స్పందించినందుకు నా హృదయపూర్వక కృతఙ్ఞతలు మనోహర్ గారు.

 6. Snkr says:

  Never mind. I felt that is a negative idea. I thought it as Praveen 🙂

 7. మంచు గారు : డబ్బుల ప్రసక్తి కదండీ ఇక్కడ నా ఉద్దేశం. మేధస్సు తరలిపోవటమే. దానికి వాళ్ళు భాద్యులు అని కూడా అనలేము. మేధస్సు ఉపయోగపడే చోటకే మేధావులు వలస వెళతారు. లేకపోతే మేధస్సు sharpen ఎలా అవుతుంది. దానికి మన దేశ పరిస్తుతులు కారణమే. అదంతా బాగానే ఉంది. But are we doing justice to out home country, where we learned our basics. Its not buying flats or plots..I agree NRIs are donating funds. కానీ ఎంత శాతం మంది చెయ్యగలుగుతున్నారు?

  Yes, our playes are good. కానీ ఒక్కసారి పేరు రాగానే ఎంతమంది సరిగ్గా ఆడుతున్నారు. పేరు తెచ్చుకున్న profession కంటే add remuneration ఎక్కువ అవ్వట్లా? ఇది వ్యవస్థలోను వున్నా తప్పే, వ్యక్తిగానూ చేసే తప్పే. (e.g sania mirza) I guess govt should put a limit on other activities. మళ్లీ మనమే అంటాము హక్కులు కాలరాస్తున్నారు అంటూ…మనతో అన్నే ప్రోబ్లెమే..తప్పు అన్నా తప్పే , ఒప్పు అన్నా తప్పే..

 8. Pingback: స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా?వరమా? శాపమా? | నా అనుభవాలు….ఆలోచనలు…

 9. pnrao says:

  Hai,
  THE WORDS UR EXPRESSED ARE GREAT .VERY VERY GOOD (I HOPE EVERY ONE HAVE SAME FEELING)
  Present Digital world lo Swetcha Inka vundaaaaaaa?
  I SAY OUR FREEDOM CONTROLLED BY POLITICIAN, WE U SAY

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s