మనసును కదిలించే సినిమా Anne Frank : రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన యదార్ధ కధ.


మనసును కదిలించే సినిమా Anne Frank :

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన యదార్ధ కధ.

సినిమాలంటే ఈ మధ్య ఒక రకమైన విరక్తి బావం పెంచుకున్న నేను ఒక సినిమా గురించి రాస్తున్నా! సినిమా చూడటమంటే, నేను ఆ రెండు మూడు గంటలు పూర్తిగా లీనమైపోతాను. ప్రతీ డైలాగ్, సీన్ పరిసీలనగా చూస్తాను. ఈ విపరీత బుద్ధితో చాల కాలం నుంచీ నాకు సినిమాలంటే విరక్తి. మా వారు ఏదన్నా సినిమా చూదాం  అంటే, “ఏదన్నా కాన్సెప్ట్ వుందా ఆ సినిమాలో?” అని అడుగుతా. నన్నొక వేర్రిదానిలా ఓ లుక్ వేసి, ఇంక అడగటం మానేసారు.

ఇలాంటి విపరీత బుద్ధి, సూక్షమైన బుర్ర కల నేను, పనీ పాట లేక ఓ రోజు నెట్లో కెలుకుతుంటే , anne frank మూవీ తారసపడింది. ఇంగ్లీష్ సినిమాల గురించి పెద్దగా తెలీని  నేను, ఆ సినిమా టైటిల్, description చూసి impress అయిపోయి, చూడటం మొదలు పెట్టా. మీరి చెపితే నమ్మరు, ఆ సినిమా effect  నా మీద చాల రోజులు ఉంది. రెండు రోజులు నిద్ర కూడా పట్టలేదు( వెర్రిగా నవ్వకండోయ్).

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల దురాగతానికి బలైపోయిన ఒక teenage girl story. It’s a true story. Anne Frank  ఒక  అందమైన  అమ్మాయి. జీవితంలో ఏదో సాదించాలని, ప్రపంచం అంతా తనని గుర్తించాలి అని కలలు కంటూ ఉంటుంది. నాన్న గారాల కూతురు. ఆనందమైన జీవితం. తన 13 వ పుట్టిన రోజున, నాన్న (Otto Frank)  ఒక  అందమైన  diary బహుమతిగా ఇస్తారు.

నాకు Otto చెప్పిన ఒక మాట బాగా నచ్చింది.”Good people and bad people both have one thing in common, that is both can make mistakes. but only good people could admit their mistakes and learn from them”.

నాజీలు, jewishలను బదించి camps కి పంపుతున్న సమయంలో, anne కుటుంబం, మరి కొద్ది మంది కలసి రహస్య ప్రదేశంలోకి వెళ్ళిపోతారు. Otto office వెనుక ప్రదేశం. That was a small place to live. కొన్ని వారాలు, కొన్ని నెలలు అనుకున్నదల్లా కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోతారు. ఆ సమయంలో  అక్కడ ఉన్న వాళ్ళ మానసిక పరిస్తితి, వాళ్ళ frustration  చెప్పనలవి కాదు. తన బావలన్నిటిని anne diary లో రాసుకుంటూ ఉంటుంది. 

వీళ్ళు నివసిస్తున్న ప్రదేశం నాజీలకు తెలిసిపోతుంది. North holland Transit camp కు పంపబడతారు. అదొక మురికి ప్రదేశం. అక్కడ నుంచీ మరొక చోటికి పంపబడతారు. కొన్ని వేల మందిని ట్రైన్ బోగిల్లో కుక్కి ప్రయాణం చేపిస్తారు నాజీలు. మగ వారిని, ఆడ వారిని విడదీస్తారు. Anne అక్కడ తన తండ్రికి దూరమవుతుంది.

కుక్కల కంటే హీనంగా చూస్తారు. నగ్నంగా సామూహికంగా కూర్చోపెట్టి జుట్టు కట్టిరించేస్తారు. Anne కళ్ళలో కనిపించిన బాధ…….,నిస్ప్రుహ……..

కృశించి పోయిన మనుషులు పిట్టల్లా రాలిపోతుంటారు. గాలివానలకు వాళ్ళు ఉంటున్న గుడారాలు కులిపోతుంటాయి. బతికిన వాళ్ళు బతుకుతుంటారు. దయనీయమైన బతుకులు. చనిపోయిన వాళ్ళ బట్టల కోసం అందరూ ఎగపడుతుంటారు. చివరకు తిండి కూడా వుండదు. ఒక చిన్న బ్రెడ్ ముక్క దొరికితే అందరూ కొట్టుకుంటూ వుంటారు. Anne అక్క చనిపోతే, ఆమె సాక్స్ లాగేసుకుంటారు anne  కళ్ళ ముందే. తిండి లేక చివరకు అందరూ మరణిస్తారు.

Anne తండ్రి యుద్ధం ముగిసిన తర్వాత జర్మని తిరిగి  వస్తారు. Anne రాసుకున్న diary పుస్తకంగా అచ్చువేస్తారు.

ఈ సినిమా చూసిన తర్వాత నా కనిపించింది, “మనమెంత అదృష్టవంతులమో” అని. మనం ప్రతీ రోజు ఏదో ఒక దానిపై ఫిర్యాదు చేస్తూనే ఉంటాము. మన దేశ పరిస్తితి గురించి, రాజకీయాల గురించి, తోటి మనుషుల గురించి,కాలమాన పరిస్తితుల గురించి  …..ఇంకా ఎన్నో ఎన్నెనో…

ఆ యుద్ధం సమయంలో వాళ్ళు పడిన కష్టలు, దయనీయ బతుకులు….ఇంకాస్త ఆలోచిస్తే ఎన్నో దేశాల కంటే మనం చాల బెటర్.

అమెరికా, UK..etc దేశాలలో ఉన్న సౌఖర్యాలు మనకు లేవు. కానీ, మనకున్న కుటుంబ బంధాలు ఏ దేశంలో వున్నాయి.అన్ని సార్లు కాకపోయినా, కొన్ని సార్లు అనిపిస్తుంది “In any way we are living much బెటర్”.

This entry was posted in సినిమాలు. Bookmark the permalink.

9 Responses to మనసును కదిలించే సినిమా Anne Frank : రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన యదార్ధ కధ.

  1. vamshi says:

    Manchi cinema parichayam chesaaru. Planning to see it this week.

  2. Nagh Raj says:

    Hello Andi,
    Hope you are fine and doing well.
    After reading your opinion on this particular movie, we (I usually watch good movies with my friends, they have good taste) downloaded the movie but yet didn’t watch the movie. What to do? The duty, works and all the more time is not allowing us to watch this movie. Days are rolling one after another. The last movie we watched is “The Boy In Striped Pyjamas” which also second world war movie. Its also heart touching movie. It is directed so nicely. These Second World War movies – particularly against Nazi attrocities – are quite good to watch. If the Germans won the Second World War, the whole mankind could have suffered a lot. Fortunately its not happened. Thanks to Soviet Union who saved the world from Nazis. Anyways, you wrote well on that movie. I have to plan it to watch the movie soon. By the way, you can watch the movie, “The Boy In Striped Pijamas” with your children whenever you find time. Its also one of the best movies ever released upto now.
    Thank you so much.
    Nagaraj.

    • Thanks Nagh Raj garu…I did watch “The Boy In Striped Pijamas” movie. A very painful heart touching one. ఒక టైం లో నేను సెకండ్ వరల్డ్ వార్ కి సంభదించిన మూవీస్ నెట్ లో వెతికి చూసాను…

  3. sujata says:

    I watched this movie in Fox History Channel. I read abt Anne Frank in Readers Digest when I was a teenager. Though I tried to understand her (their) plight, Watching this movie had a very deep impact. My own MK Gandhi is Otto Frank. And his beautiful wife… This is the best movie to watch. Thanks for sharing it her. I liked Otto’s (Actor’s) performance when he comes to know abt Ann in the end of the movie. What a brave Father ?

  4. thotakuri says:

    ప్రవీణ గారు…మీరు ఆ సినిమా గురించి వ్రాసింది ఇప్పుడే చదివాను….వీలైనంత తొందరగా ఆ సినిమా చూడాలని ఉవ్విళ్ళురుతున్నాను.దయచేసి అది నెట్ లో ఏ సైట్లో దొరుకుతుందో తెలియచేయగలరు.

  5. praveena garu eeroje ee movie chusanu.. it was really nice and touching.. meeru raasina review kuda chala bagundi.. thanks for sharing

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s