రాజరికమా?ప్రజాస్వామ్యమా?
OR
గతించిన రాజరికపు,
చేదు గురుతుల,
విషపు ధారలు,
రాజుల నిరకుశం,
పాలకుల పాపపు నీడలు,
సగటు మనిషి జీవితం,
కత్తిమొనపై నిలిచిన ప్రాణం.
గడుస్తున్న నేటి కాలపు
రాజకీయాలు,
నాయకుల అన్యాయపు,
సర్ప నీడలు,
లంచగొండుల,
రాక్షసత్వపు కోరలు,
ప్రజాస్వామ్యం: ప్రజల చేతిలో ఆయుధం(?),
నోట్లకట్టలకు ఓటులమ్ముకుని,
సారాసీసాలో ప్రజాస్వామ్యం,
కలుషితం చేసి,
కిక్కుకోసం ఓటేసి,
కులం పిచ్చితో,
కుళ్ళుని నమ్ముకుని,
మతం పిచ్చితో,
గుళ్ళు, మసీదులు కూల్చుకునే,
పిచ్చి జనాల, జీవితాల మారణాయుధం.
నిరక్ష్యరాస్యుల అవివేకం, అమాయకత్యం,
అక్ష్యరాస్యుల నిర్లక్ష్యం, అనాశక్తితో,
అణువాయుధంగా మారిపోయిన మన ప్రజాస్వామ్యం.
రాజుల నిరకుశాత్వ రాజరికమా?
అవివేక ప్రజల ప్రజాస్వామ్యమా?
రెంటికీ తేడా ఏముంది?
meeru chala baaga vrasaru.
okappudaina ippudaina naayakudu avvali ante dabbu kavali.
You r right Prasad garu…nayakuku nayakatyam vahinhcedi kevalam dabbu kosame…
nicely written..
r u a member of LokSatta..? mee bhavaalu chooste alaa anipistundi..
I wish I could be member of LokSatta…meeku naa bavalu nachhinanduku krutagnularanu…