నా కష్టం..నాదే
నా కష్టం,
అక్షరాలా నాది మాత్రమే,
వేరొకరెవ్వరిదీ కానే కాదు,
మరెవ్వరూ తీర్చనే తీర్చలేరు.
ఓదార్పు పలకరింపులు,
ఆదుకుంటామన్న వాగ్ధానాలు,
మేమున్నామన్న వచనాలు,
కాలగమనంలో కలిసిపోయేవే.
ఎవరికి ఎవరు సాయం?
ఎవరి బాధలు వారివే,
తోటివారి కష్టసుఖాలు కనిపెట్టుకునే,
తీరిక ఉందా నేటి తరంలో?
కాస్త తీరితే నిద్ర పోదామనుకునే నేటి రోజుల్లో,
ఎవరినీ తప్పుపట్టలేని కాలమిది.
ఉమ్మడి కుటుంబాలు,
చీకులేని చిన్న కుటుంబాలుగా,
కుంచించుకు పోయిన నేటి తరం!
బరువు బాధ్యతలు,
బంధాలు లేని ఒంటరి మనిషిగా,
కృశించుకుపోదా రేపటి తరం?
ఆ రోజు ఎంతో దూరంలో లేదు…..
u r absolutely right..
very nice, well said !!
@Girish garu, Neeharika garu..thanks
Bagundi. Samsyani baga chepparu. Kani manam patistoo andaru patinchavalasina o chakkani parishkaram kooda soochisthe inka bagundedi.
“Pothe Venta Naluguru vundala choosuko” ani peddalu cheppe vaaru. Danardam, antha sampadinchina adedi neeto ravu, chivaraku nadiche naluguro tappa. Kanuka sampadinchatam Jeevitam lo o bhagam. jeevitame sampadinchatam ka koodadu.
So “Naa/Mee Kastam Naade/Meede” kakapothe cheppukovatniki nalugu vundai. Kanuka Repati taram krusinchuku pokunda vikasinchalani assiddam, Devudini Prarddhiddam
అవును ఆకాశ వాణి గారు ,మన కష్టం ఎవరూ తీర్చలేరు..చెప్పుకోవటానేకి నలుగురు వుంటే అంతే చాలు…మన పిల్లలకు అది నేర్పుకోగాలగాలి.వాళ్ళు అది బుర్రకేక్కిన్చుకోవాలి అని ప్రార్థన చేద్దాం.
మీరు చెప్పింది నిజమేనండి. వర్తమానం ఒక సుదీర్ఘ ఒంటరి ప్రయాణం…నిర్మలమైన కరచాలనం కూడ కరువైన కాలం నేడు.
“నిర్మలమైన కరచాలనం కూడ కరువైన కాలం నేడు..” baga chepparu…
nijam chepparandiiii……….ikkada me comments chustunte ila matladi,alochinche varu unnara anipistundi……..news lo chusinappudi chalinchadam ekkado kontha mandi unna rani vinadani ke saripotundi………nijamga marali…marali ane e padam kuda marali…marali antunnam em marali?evaru marchali?adi manam manathone alochinchi acharana modalu pettali…evaru ela unna,enni kashtalu vacchinna manam adarshavanthamayina,nijayithigala,santhosha jeevitham jeevinchali…..emo naku anipinchindi rasanu….
చాలా బాగా చెప్పారు ఆకాంక్ష గారు….మారాలి మారాలి అంటూనే ఉంటాము..పక్కన వాళ్ళు మారాలి అనుకుంటాము..మొదలు మనం మారితే పక్కన వాళ్ళకు చెప్పే హక్కు ఉంటుంది. స్పందించినందుకు ధన్యవాదాలు…