అమ్మతనంలో కమ్మతనం


అమ్మతనంలో కమ్మతనం

 

నా చిన్ని తండ్రీ,
నిన్ను తొలిసారి చూసిన మధుర క్షణం,
తల్లిగా అవతారమెత్తిన తొలి క్షణం,
ఇంతకంటే గొప్ప విజయం,
ప్రపంచంలో మరేదీ లేదని,
ఈ విజయం సాదించింది,
ప్రపంచంలో నేను కాక,
మరెవ్వరూ కాదని,
ఎంతో గొప్పగా అనిపించింది.

నిన్ను చూడటానికి,
చుట్టాలూ, స్నేహితులూ వస్తుంటే,
కోహినూరు వజ్రం,
నా దగ్గరే వున్నట్లు,
అందరి కన్ను పడితే,
దిష్టి తగులుతుందేమోనని  కలవరపడ్డాను.

నువ్వు బుడి బుడి అడుగులు వేస్తున్నప్పుడు,
తొలిసారి అమ్మా అని పిలిచినప్పుడు,
మరు జన్మలోనూ స్త్రీ గానే,
నీకు అమ్మగానే పుట్టాలనిపించింది.

నువ్వు తుమ్మితే, దగ్గితే కంగారు పడిపోయి,
నువ్వు పాకితే, నడుస్తే సంబరపడిపోయి,
ఎవ్వరూ చెయ్యలేని పనులు,
నువ్వు మాత్రమే చేస్తున్నట్లు,
అందరికీ ఊదరగొట్టేసాను.

ప్రతీ నెలాకరకు వచ్చే ఐదంకెల  జీతం,
రోజూ తిరిగే విలాసవంతమైన కారు,
ఏదీ తృప్తి నివ్వదే,
నువ్వు రోజూ పిలిచే “అమ్మ” అనే పిలుపుముందు.

నువ్వు నా ఒడిలో గారాలు పోవడం కాదు,
బంగారు,
నీ చిన్ని చేతులు,
నా మెడ చుట్టూ పెనవేసుకుని,
నన్ను నువ్వు ముద్దాడుతున్న వేళ,
నేనే సేదతీరతాను,
నీ మెడ వంపుల్లో.

ఇల్లంతా చిందర వందర చేసి,
ఓ గంటన్నర విసిగించి, విసిగించీ,
భువ్వ తిని,
అలసిపోయిన నీకు,
జోల పాడుతున్న వేళ,
నీ నిద్ర కళ్ళు మూస్తూ, తెరుస్తూ,
నిద్ర ఆపుకోవాలని,
నువ్వు చేసే  విఫల ప్రయత్నం,
 గమనిస్తూ, నవ్వుకుంటూ,
ప్రశాంతంగా నిద్రలో జారుకున్న నిన్ను,
అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.

ఉదయం పని తొందరలో,
నువ్వు పాలు తాగనని మారాం చేస్తుంటే,
బడికి వెళ్లనని విసిగిస్తుంటే,
నీ వీపు మీద చరిచిన  నా కోపం,
ఆ రోజంతా నన్ను నిలవనీయదు,
మనసు మనసులోనే ఉండదు,
సాయంత్రం నిన్ను హృదయానికి హత్తుకునేదాక.
కానీ,
నీకు మాత్రం ఏమీ గుర్తుండదు.
నీ స్వచ్చత చూసి,
ఆ క్షణం నా కనిపిస్తుంది,
ఇంకెప్పుడు నీ మీద  చెయ్యెత్తకూడదని.
మరుక్షణం నువ్వు చేసే అల్లరి,
నా మనసుని మార్చేస్తుంది ఇంతలోనే.
ఇదేమి  విచిత్రమో!

వీడి అల్లరి భరించలేకపోతున్నాను,
వీడి తిక్కతో విసిగిపోయాను,
బడికి పోతే బాగుండు అనిపిస్తుందా,
నువ్వు వెళ్లిన మరుక్షణం నుంచే,
ఎప్పుడెప్పుడు వస్తావా అనీ ఎదురు చూస్తూఉంటాను,
ఇదేమి చిత్రమో!

ఎదిగిన బిడ్డ ఎగిరిపోతాడని,
ఎరిగిన వాళ్ళు చెప్పుకుంటుంటే,
ఒక్క క్షణం ఉలిక్కిపడి,
బిడ్డలు ఎదిగే క్రమంలో సంతోషం,
ఎగిరే క్రమంలో  దుఖః,
నా భాద్యత అనీ,
నాకు నేనే సమాధానపరుచుకున్నా.

ముడడుగులన్నా లేని నీ మీద,
మహాగ్రంధమే రాయొచ్చు,
ఎంత రాసినా అంతు లేదే!!

నీ ప్రపంచంలో నువ్వే రాజువి,
నా ప్రపంచంలోనూ నువ్వే మహారాజువి.

ఎప్పటినుంచో మా చెల్లి, “పిల్లల మీద ఏదన్నా రాయక్కా” అంటుంటే, ఏదన్నా కవిత రాద్దామని మొదలుపెట్టాను , ఇదేమిటో వ్యాసంలా తయారయింది, కొంత   భాగం తొలిగిద్దామన్నా,  sentences  మారుద్దామన్నా, ఎందుకో మనసొప్పలేదు. కాలగమనంలో ఈ తీపి గుర్తులు మరుగున మడిపోతాయేమోనని భయం వేసి అలాగే ఉంచేశాను.
ప్రతీ తల్లీ అనుభవించే ఆనందంమే ఇదీ. నా మాటల్లో గుర్తుగా రాసుకున్నాను.  

Every child born into this word proves that god has still hope in mankind.

This entry was posted in అమ్మ, కవితలు. Bookmark the permalink.

17 Responses to అమ్మతనంలో కమ్మతనం

 1. parimalam says:

  ‘అమ్మదనంలో కమ్మదనం’ అదో అద్భుతం అంతే! అందంగా అక్షరరూపమిచ్చారు.

 2. subhadra says:

  no words too gud…

 3. Ennela says:

  only mother of teenagers will know why some animals eat their young ….ఇది మిస్స్ అయ్యారు మీరు…హహహహ్ … నేను అక్కడున్నా ప్రస్తుతం .అందుకే యీ కామెంటు…(సరదాగా సుమండీ!)

  • ఎన్నెల గారు…మీరు చెప్పిందే అక్షరాల నిజం. నేనింకా ఆ స్టేజికి రాలేదు..నా పిల్లలు ఇంకా toddelrs…..నేను ఆ స్టేజి కి వస్తే ఇంకోలాగా రాస్తానేమో కవిత….haaa…

 4. బాగుంది మీ అమ్మతనం…
  కొండపల్లి బొమ్మంత పొందిగ్గా,
  మాఘమాసపు పొగమంచు చెమ్మంత చల్లగా,

 5. chaitanya says:

  Hello andi this is Radhika Jasti Co-Sis, I happened to saw your ‘Ammathanamlo Kammathanam, felt like leaving a comment:

  ‘Addam’ la undi andi mee kavitha, aa amma choosukunte adhi thane anattu. I saw mine too in your ‘Addam lanti kavitha’.

 6. సత్య says:

  భావాలు బాగున్నాయి.

  hope you see this…
  http://neelahamsa.blogspot.com/2011/01/blog-post_20.html

 7. Madhu Prakash says:

  Abbaa … entha bagundi eee ammathanam.. idi maa ammani gurtuku techindi .. urgent ga amma ki phone cheyali 🙂

 8. Srinivasa Reddy N says:

  ప్రతి తల్లి మనసు కదిలేలా, కళ్ళు చెమర్చేలా రాశారు..చాలా బాగుంది..

 9. ధన్యవాదాలు శ్రీనివాస రెడ్డి గారు

 10. Anonymous says:

  చాలా బాగా చెప్పారు అండి….అమ్మ అంటే ఏంటో చెప్పడానికి మాటలు కూడా లేవు…

 11. Sridhar says:

  జననీ, ఈ జన్మ ఒక కఠిన పరీక్ష,

  మరణం పరీక్ష కు అంతం కాదది,

  ఈ ఘోర చక్రం అంతు తెలియనిది,

  అజ్ఞాన కారణం ఆకలి యన్న ఒక శిక్ష,
  దేవీ! సకల బాధలను నీవు పరిహరింపవే

  అమ్మా…! జ్ఞానమును పంచి రక్షించవే.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s