జ్ఞాపకాలు……

పిల్లగాలి తెమ్మెరలా,
సున్నితంగా ముద్దాడి,
చిరుమందహాసాన్ని,
చిరుమందహాసాన్ని,
పెదవులపై పలికిస్తాయి.
ఉరిమే ఉరుములా,
ఊపిరాడనివ్వక,
గుండెను మెలితిప్పి,
బాదిస్తాయి.
ఊపిరాడనివ్వక,
గుండెను మెలితిప్పి,
బాదిస్తాయి.
ఉక్కిరి బిక్కిరి చేసి,
చక్కిలి గింతలు పెట్టి,
ఆనందబాష్పాలు రాలేదాకా,
వదిలిపెట్టవు.
చక్కిలి గింతలు పెట్టి,
ఆనందబాష్పాలు రాలేదాకా,
వదిలిపెట్టవు.
ఎంతగా మరచిపోదామన్నా,
అంతగా గుర్తుకొచ్చి,
గుచ్చి గుచ్చి,
చంపుతాయి.
అంతగా గుర్తుకొచ్చి,
గుచ్చి గుచ్చి,
చంపుతాయి.
పసితనపు ఛాయలు,
చెదిరిపోయినా,
యవ్వనపు వయ్యారాలు,
వెడలిపోయినా,
మనసులో నిక్షిప్తమైపోయాయి,
జ్ఞాపకాలుగా.
చెదిరిపోయినా,
యవ్వనపు వయ్యారాలు,
వెడలిపోయినా,
మనసులో నిక్షిప్తమైపోయాయి,
జ్ఞాపకాలుగా.
ఋతువులు మారినా,
సంవత్సరాలు గడిచినా,
జ్ఞాపకాల దొంతరలుగా,
పేరుకుపోతాయి మనసులో.
సంవత్సరాలు గడిచినా,
జ్ఞాపకాల దొంతరలుగా,
పేరుకుపోతాయి మనసులో.
కాలం పరుగు పందెంలో,
పరుగెత్తి పరుగెత్తీ,
అలసిన మనసుకు,
జ్ఞాపకాలే చల్లటి చిరు జల్లులు,
జ్ఞాపకాలే వెచ్చటి ఆవిరి నిట్టూర్పులు.
పరుగెత్తి పరుగెత్తీ,
అలసిన మనసుకు,
జ్ఞాపకాలే చల్లటి చిరు జల్లులు,
జ్ఞాపకాలే వెచ్చటి ఆవిరి నిట్టూర్పులు.
