ఎవరు నువ్వు?

ఎవరు నువ్వు?
నాకేమి అవుతావు?
స్నేహితుడివా? ప్రియుడివా?
ఆత్మీయుడివా? పరిచయుస్తుడివా?
దగ్గరే ఉంటావు
కానీ అందనంత దూరంగా ఉంటావు!
మాట్లాడతావు,
కానీ ఏమీ చెప్పవు,
వింటావు,
కానీ ఏమీ ఆలకించవు!
మరి ఎవరు నువ్వు?
నాకేమి అవుతావు?
కన్నీరు వరదలై పొంగుతున్నప్పుడు,
వ్యధ వ్యవధి లేకుండా బాదిస్తున్నప్పుడు,
ఒంటరితనంలో తోడు కోసం వెతుకుతున్నప్పుడు,
ఓదార్పు కోసం ప్రాకులాడుతున్నప్పుడు,
వ్యధ వ్యవధి లేకుండా బాదిస్తున్నప్పుడు,
ఒంటరితనంలో తోడు కోసం వెతుకుతున్నప్పుడు,
ఓదార్పు కోసం ప్రాకులాడుతున్నప్పుడు,
నాకు నేను మాత్రమే మిగిలినప్పుడు,
నువ్వు నా పక్కనే ఉన్నావు,
కానీ..నీలో స్పందనే ఉండదు!
నువ్వు నా పక్కనే ఉన్నావు,
కానీ..నీలో స్పందనే ఉండదు!
మరి ఎవరు నువ్వు?
నాకేమి అవుతావు?
kavitha bagundi…keep writing…
Thank you Vijay garu..
hey nice one praveen garu.Touching lines 🙂
ఏమీ కాని వాడిని!
baagundi..
umm? anduke mana buddini maro needakai; thodukai chudanika mana manase ‘goppa grandham’ chadevisthe sari,,