ఆలోచనలు…..

ఆలోచనలు…..
వస్తాయి, పోతాయి,
వస్తాయి, పోతాయి,
గాలి దుమారంలా,
దుమారంలో చిక్కుకున్న మనసుకు తెలుసు,
దుమారంలో చిక్కుకున్న మనసుకు తెలుసు,
కొట్టుకుని పోయినవి ఎన్నో.
ఆలోచనలు…..
గుండెను మెలితిప్పేస్తాయి,
సుడిగుండంలా,
సుడిలో చిక్కుకున్న ప్రాణానికి తెలుసు,
బతకటం ఎంత కష్టమో.
ఆలోచనలు…..
గుండెను మెలితిప్పేస్తాయి,
సుడిగుండంలా,
సుడిలో చిక్కుకున్న ప్రాణానికి తెలుసు,
బతకటం ఎంత కష్టమో.
ఆలోచనలు…..
నిలువ నీయవు ఒక చోట,
నీటి ప్రవాహంలా,
ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆశలకు తెలుసు,
నిరాశ ఎంత నిస్ప్రుహొ.
నీటి ప్రవాహంలా,
ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆశలకు తెలుసు,
నిరాశ ఎంత నిస్ప్రుహొ.
ఆలోచనలు…..
అంతు లేకుండా సాగిపోతాయి,
అంతులేని శూన్యంలా,
అంతులేని శూన్యంలా,
శూన్యంలో వెతుకుతున్న మనిషికి తెలుసు,
ఏమీ దొరకదని.
ఏమీ దొరకదని.
ఆలోచనలు…..
ఘోష పెడుతున్నాయి,
ఢమరుకంలా,
ఢమరుకంలా అదిరిపడుతున్న గుండెకు తెలుసు,
ఎగిసిపడుతున్న వ్యధ ఏమిటో.
ఢమరుకంలా,
ఢమరుకంలా అదిరిపడుతున్న గుండెకు తెలుసు,
ఎగిసిపడుతున్న వ్యధ ఏమిటో.
ఆలోచనలు…..
ఎగిరెగిరి పడుతున్నాయి,
అగ్ని పర్వతంలో లావాలా,
లావాలో ఉడుకుతున్న ఊపిరికి తెలుసు,
వుచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలు ఎంత భారమో.
అంతులేని ఆలోచనా సాగరంలో,
కొట్టుకుపోతున్న మనసుకు,
ఆశే ఆదారం,
ఆశని, ఆలోచన పెనవేసుకుని,
ప్రయత్నంతో ముడివేస్తే,
బతికే ఆదారం దొరుకుతుంది.
కొట్టుకుపోతున్న మనసుకు,
ఆశే ఆదారం,
ఆశని, ఆలోచన పెనవేసుకుని,
ప్రయత్నంతో ముడివేస్తే,
బతికే ఆదారం దొరుకుతుంది.
అయ్యబాబోయ్, ఆత్రేయ గారి ఆత్మని ఏవన్నా ఆవాహనం చేసుకున్నారా ఏంటండీ??చాలా బాగా రాశారు.
కొత్తపాళీ గారు,
నేను డాం…అని పడిపోయానండి ….. ఇంక ఇప్పుడిప్పుడే లేగవలేను. మీ అంత గొప్పవారు..నన్ను మెచ్చుకోవటం..పైగ అంత బాగా మెచ్చుకోవటం…
Many thanks for responding.
Pingback: ఇల్లు, పిల్లలు, ఉద్యోగం నడుమ కలవరపెట్టే ఆలోచనలు | నా అనుభవాలు….ఆలోచనలు…
ప్రవీణ గారు ,
చాలా బాగుందండి మీ కవిత .
లింక్ ఇచ్చి తెలిపినందుకు థాంక్స్ అండి .
వివిధ సమస్యలలో మనసు ఆలోచనల పరిపరి విధానాలను చాలా బాగా వివరించారండి. గాలిదుమారం, నీటిప్రవాహం, సుడిగుండాలు, అగ్నిపర్వతం…అబ్బ ఏమి విశ్లేషణలండి ఈ మనసుకు. నిజమే శూన్యంలో చిక్కుకున్న మనసుకు డమరుక నాదమే ఊపిరినిస్తుంది. ఈ మనసును సేద దీర్చేది ఆశే. నాకు చాలా చాలా నచ్చిందండి.
మాల గారు: కృతజ్ఞతలు
జయ గారు: మీకు నా కవిత నచ్చినందుకు నేను చాలా హ్యాపీ..థాంక్స్ అండి