అక్షరాలతో స్నేహంఅక్షరాలతో స్నేహం,
పదాలతో ప్రేమ,
భావాలతో భందం,
ఆలోచనలతో అనురాగం,
ఆత్మీయంగా రాసుకునే నా అక్షరాలు,
నా ప్రియాతిప్రియమైన నేస్తాలు.
నాలో నేను వెతుక్కునే ప్రయత్నం,
నాతో నేను చేసుకునే స్నేహం,
నాతో నేను చెప్పుకునే కబుర్లు,
నాతో నా కాలక్షేపం,
నాకు నేను స్పూర్తి నిచ్చుకోవటం,
నన్ను నేను ఓదార్చుకోవటం,
నన్ను నేను తిట్టుకోవటం,
నన్ను నేను మెచ్చుకోవటం,
నన్ను నేనుగా స్వేకరించే నేస్తాలు….నా అక్షరాలు…..నా ప్రియాతిప్రియమైన నేస్తాలు.
“నన్ను నేనుగా స్వేకరించే నేస్తాలు….నా అక్షరాలు…..నా ప్రియాతిప్రియమైన నేస్తాలు”
అక్షర సత్యాలు! చాలా బాగా రాశారు.
మీ బ్లాగును ఇప్పుడే చూశాను. చాలా బాగా రాస్తున్నారు. ఎంచుకున్న అంశాలు కూడా బాగున్నాయి.
టైప్ చేస్తున్నప్పుడు అక్షర దోషాలు దొర్లకుండా చూడండి.
శుభమస్తు!
Thanks Pranav garu…I will try to correct my telugu..
baagundangi
Thanks Padma garu…