మా బాల్యం మా కిచ్చెయ్.


మా బాల్యం మా కిచ్చెయ్

భగవంతుడా,

      మా దగ్గరున్నవన్నీ తీసేసుకో,
      ధనం, ధాన్యం,
      ఇల్లు, పొలం,
      రాజ్యం, అధికారం,
      అన్నీ…అన్నీ
      తీసేసుకో,
      మా బాల్యం మాత్రం మా  కిచ్చెయ్.

భగవంతుడా,

    నువ్వేమి చెయ్యమన్నా చేస్తాము,

      దెబ్బలు తినమన్నా తింటాము,
      గోడ కుర్చీ వెయ్యమన్నా వేస్తాము,
      ముక్కు నేలకానించమన్నా ఆనిస్తాము,
      అ, ఆ లు వెనక నుంచీ రాయమన్నా రాస్తాము,
      నాలుగు స్తంభాలాట, నేలబండ,
      ఏ ఆటలోనైనా దొంగగా ఉంటాము,
      ఆస్టచెమ్మలో, చింత గింజలాటలో,
      తొక్కుడు బిల్లలో, గోళీకాయలలో,
      ఎందులో ఓడిపోమన్నా ఓడిపోతాము,
      ఆటలో అరటిపండన్నా ఊరుకుంటాము,
      చెట్లెక్కము, గోడలెక్కము,
      బుద్దిగా ఉంటాము,
      మా బాల్యం మాత్రం మా  కిచ్చెయ్.

భగవంతుడా,

      అన్నతో  పోట్లాడము,
      తమ్ముడి మీద అలగము,
      అక్క మీద పితూరీలు చెప్పము,
      చెల్లిపై అజమాయిషీ చెయ్యము,
      ఏ గొడవ చెయ్యము,
      మా బాల్యం మాత్రం మా  కిచ్చెయ్.

భగవంతుడా,

      అమ్మని  విసిగించము,
      నాన్నకు ఎదురుచెప్పము,
      దొంగ పనులు చెయ్యము,
      చెప్పిన మాట వింటాము,
      చక్కగా చదువుకుంటాము,
      మా బాల్యం మాత్రం మా  కిచ్చెయ్.

భగవంతుడా,

    స్నేహేతులతో పోట్లడము,

      కట్టి, కచ్చి చెప్పాము,
      కొట్టుకోము, తన్నుకోము,
      అందరితో కలిసిమెలిసి ఉంటాము,
      మా బాల్యం మాత్రం మా  కిచ్చెయ్.

భగవంతుడా,

        నువ్వు నిజంగా ఉంటే,
        నీకే ఆ శక్తి ఉంటే,
        మరు జన్మలో మా కిచ్చే సంపథలన్నీ నువ్వే తీసేసుకో,
        ఈ జన్మలో మా బాల్యన్నీ మాత్రం మా  కిచ్చెయ్.

Enjoy some of our childhood memories:

మహాభారతం టైటల్ సాంగ్:

మిలే సూర్ మేర తుమరా

Ek Chidiya….Anek Chidiyan

The Jungle Book

Hamara Bajaj

gold spot

Complan Commerical

 

Washing powder Nirma

Malgudi Days

This entry was posted in కవితలు, నా అనుభవాలు. Bookmark the permalink.

17 Responses to మా బాల్యం మా కిచ్చెయ్.

  1. బాలు says:

    ఎక్కడో తట్టారండీ!!
    మరీ ముఖ్యంగా ‘సూరజ్ ఏక్… చందా ఏక్’, ‘జింగ్ థింగ్… గోల్డ్ స్పాట్’!
    మళ్లీ ఓ ఇరవయ్యేళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ఈ గోల్డ్ స్పాట్ యాడ్ అయితే అప్పట్లో మరీ నోరూరించి చంపేది. ఇప్పడంటే పిల్లలకి కూల్ డ్రింకులు కామన్ గానీ… నా చిన్నప్పుడు కూల్ డ్రింక్ తాగడమంటే లగ్జరీల్లోకెల్లా లగ్జరీ.
    చెప్తే నవ్వుతారు… బాలకృష్ణ నటించిన దేశోద్ధారకుడు అనే సినిమాలో గోల్డ్ స్పాట్ పాట ఒకటుంటుంది. ఇన్ ఫ్యాక్ట్ నేను చూసిన మొదటి సినిమాగా నాకు బాగా గుర్తుండిపోయిన సినిమా అదేనంటే కారణం ఆ గోల్డ్ స్పాట్ పాటే 🙂
    ఆ పాట చూసి కొన్నాళ్లు బాలయ్యబాబు ఫ్యాన్ కూడా అయిపోయాన్నేను(పాపం నేను!).

    • ఆ రోజులే వేరండి. ఇప్పటితో పోల్చుకుంటే, వున్నా కోద్ది వాటితో ఎంతో సంతోషంగా వుండేవాల్లము.
      I wish time has rewind button kada.
      Thanks for responding.

  2. sudha says:

    మీ కవిత బాగుంది. కవిత లోని తొలి భాగాన్ని నా బ్లాగు పోస్టు లో వాడుకున్నాను- మీ బ్లాగు లింకుతో.కృతజ్ఞతలు.

  3. ప్రవీణ అక్కా
    నన్ను క్షమించు నీ ఆనందం పాడుచేసినందుకు
    ఆ గజల్ ఉన్న సంగతి నీకు తెలియదని నాకు తెలీదు. తెలిస్తే అలా రాసేవాడిని కాదు.
    తెలిసే అలా రాసేవనుకున్నా.
    మనం మనం విజయవాడ వాళ్ళం !! అందుకే మాఫ్ కరో !!!

    • అపర్ధాలు వస్తూ ఉంటాయి……పోతూ ఉంటాయి…ఫైనల్ గా మీరు అర్థం చేసుకున్నారు..అంతే చాలు.

  4. bonagiri says:

    దేవుడికి అన్నీ ఇచ్చేసి,
    అందరు చెప్పినట్టు వింటూ,
    అల్లరి చేయని బాల్యం అవసరమా?

    అయినా మన బాల్యం మనకు ఎలాగూ రాదు.
    మన పిల్లలకి, వాళ్ళ బాల్యం వాళ్ళకిస్తే చాలు.

  5. G says:

    గ్గాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆడ్! ఒక్కసారిగా ఒళ్ళు పులకరించింది ఆ జంగిల్ బుక్ పాట వినేసరికి. Thanks a lot for sharing a nice collection

    • G ji: Honestly..I should say thanks to u. మీ కామెంట్ చూసాక మళ్లీ ఆ పాత పోస్ట్ చదువుకుని, మళ్లీ ఆ ఆడ్స్ చూస్తుంటే ఎంత ఆనందంగా వుందో…. మిలే సూర్ మేర తుమరా is my favorite.

  6. abba enta madhuramaina rojulooo avi… veetannitiho paatu aliflaila kuda chusinattu gurtu naku… nidra aapukuni maree chusevallam . golden days ante ave

  7. Nara says:

    ఆ పాత రోజులు గుర్తుకొస్తుంటే – ఒల్లంతా పులకరించి, గుండె నీరులా కరిగి జారిపోతున్నట్లనిపిస్తుంది

    ఇవి అన్నీ గుర్తుకొస్తుంటే చచ్చిపోయి మళ్ళీ పుట్టాలనిపిస్తుంది, పాతజ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొనే అంత పెద్దవాడినైపోయానా అనిపిస్తోంది

    ప్రవీనా గారు మీరు చాల గొప్పవారు, మేధావులు మీకు నా మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు.

  8. Anonymous says:

    బాల్యం అంటేనే అల్లరి చేయడం .. మీరేమో భగవంతుడిని బాల్యం ఇమ్మంటున్నారు.. ఆ బాల్యపు లక్షణాలను చేయను అంటున్నారు .. పరస్పర విరుద్ధంగా అనిపిస్తోంది.

  9. బాల్యం అంటేనే అల్లరి చేయడం .. మీరేమో భగవంతుడిని బాల్యం ఇమ్మంటున్నారు.. ఆ బాల్యపు లక్షణాలను చేయను అంటున్నారు .. పరస్పర విరుద్ధంగా అనిపిస్తోంది.

  10. Suresh Kumar Digumarthi says:

    గతాన్ని గుర్తు చేయడమే కాదు, భవిష్యత్తునీ నిర్దేశిస్తున్నట్టున్నారు

  11. Nara says:

    Anonymous, కరణం లుగేంద్ర పిళ్ళై :

    అల్లరి చేయటానికి బాల్యమే అవసరం లేదు – బాల్యం అంటే అల్లరి కారు, అది మాటలతొ చేప్పలేనిది, ఒక్కవిషయం గుర్చుంచుకోంది మనం మన బాల్యంలో కంటే ఇప్పుడే అల్లరి ఎక్కువ చేస్తుంటాం

  12. Nara says:

    Revised:
    అల్లరి చేయటానికి బాల్యమే అవసరం లేదు – బాల్యం అంటే అల్లరి కాదు, అది మాటలతొ చేప్పలేనిది, ఒక్కవిషయం గుర్చుంచుకోండి మనం మన బాల్యంలో కంటే ఇప్పుడే అల్లరి ఎక్కువ చేస్తుంటాం

  13. pardhasaradhi says:

    thanks praveena garu malllli alaaaa venakki poyanu.mee daggara raarandoi raarandoi chinna pillala karyakram audio undaa? unte maaku kooda vinipinchandi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s