నా తెలుగు కష్టాలు ఎన్నని చెప్పను….ఎవరికని చెప్పను…


నా తెలుగు కష్టాలు ఎన్నని చెప్పను….ఎవరికని చెప్పను…

నాకు ఈ మధ్య తెలుగు కష్టాలు నెత్తి మీదకు వచ్చి పడ్డాయి. ఎవరికి చెప్పుకోవాలో, తెలీక ఇలా బ్లాగ్‌లో రాసేస్తున్నా. ఈ తెలుగు కష్టాలేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారా? ఉంటాయండి….ఉంటాయి…. బోల్డు రకాల కష్టాలు, అందులో ఈ తెలుగు కష్టం ఒకటీ. పడిన వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ. ఒడ్డున ఉన్న వాళ్ళు ఎన్నన్నా చెపుతారు. అసలు సంగతి చెప్పకుండా, ఈ నసేమిటమ్మ అని విసుక్కుంటున్నారా? విసుక్కుంటారు మీదేం పోయిందీ. ఈ బాధ భరేస్తున్నదాన్ని  నేను.

సరే అసలు విషయానికి వద్దాం. ముందు ఈ తెలుగు కష్టం నాకు రావటానికి ఉన్న కారణాలు, దాని పుట్టుపూర్వోత్తరాలు మీకు చెప్పాలి. అబ్బో చాలా కధకమానీషు ఉంది, ఈ సోదంతా మనకెందుకులే అనుకుంటున్నారా? రెపెప్పుడైన ఇలాంటి కష్టం మీకే రావొచ్చు. ఈ పోస్ట్ చదివితే మీరు జాగ్రత్త పడవచ్చు. ఈ కధకమానీషు అసాంతం చదవకపోతే, మీ బుజ్జి బుర్రకు, ఇంత పెద్ద కష్టం అర్థం కాదండీ!

అసలు కధలోకి వద్దాం. 2011 సంవత్సరము, జనవరి 2వ తారీకు నాడు, మా ఆఫీస్ లో నూతన  సంవత్సరము శుభాకాంక్షలు చెపుతూ, అందమైన డైయరీ ఇచ్చారు. ఆ డైయరీ ఓపెన్ చెయ్యగానే నాకొక మహత్తరమైన ఐడియా వచ్చింది. “ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది” అలాగన్న మాట. కొసమెరుపు ఏటంటే, ఈ ఐడియా నా జీవితాన్ని మాత్రమే మార్చటం కాదు, పదిమందినీ చిత్రహింసలు పెట్టగలిగే ఐడియా అన్నమాట.

అసలు విషయంలోకి వస్తే, అదేదో సినిమాలో చూపించినట్లు, మరేదో నవల్లో చదివినట్లు, డైయరీలో ఈ సంవత్సరము  నేను చెయ్యాల్సిన పనులన్నీ రాయాలనిపించింది. ఏమి రాద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు, ఐడియా తట్టింది. అదేమిటంటే తెలుగులో బ్లాగ్ స్టార్ట్ చేసేసి, అందులో నా పాండిత్యం, పైత్యం, తిక్క అన్నీ రాసిపడెయ్యాలని. ఎప్పుడూ ఏ పనీ అనుకోగానే చేసే అలవాటు లేని నేను, ఈ పనినీ మాత్రం వెంటనే చేసేసా. జనాల్ని హింస పెట్టడం అంటే నాకెంత ఇస్టమో, ఇది చదువుతున్నారంటే, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.

అనుకున్నదే తడువుగా బ్లాగ్ మొదలుపెట్టేసాను. పురాతన కాలంలో రాసిన కవితలు పోయినవి పోగా, దొరికిన ఒకటి రెండు కవితలు పోస్ట్ చేసేసా. నాకు తెలిసిన వాళ్ళందిరికీ facebook ద్వారా, mail ద్వారా ఢంకు వేసి, డోలు వాయించి మరీ చెప్పేసా. కుతూహలంతోనో, మొహమాటంతోనో, ఇష్టంతోనో నా కవితలు చదివిన నా స్నేహితులందరూ, సూపర్ డూపర్ అనీ, నీకు ఈ కళా పోషణ కూడా ఉందా అనీ మెచ్చుకునేసరికి, నేను ఉబ్బితబ్బిబైపోయి, మహా గొప్పగా  ఫీల్  అయిపోయి, వీరావేశంతో మళ్లీ రాయటం మొదలుపెట్టేసా. కొత్త పిచ్చోడు పొద్దెరగడని, నాకు ప్రస్తుతం అదే పని. నాకు తెలుసు ఈ వీరావేశం ఎక్కువ రోజులు ఉండదు. ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలి. మూడొచ్చినప్పుడే రాసి పడేయ్యాలి కద.

నేను రాసిన “నేను అమ్మనయ్యాక అర్థమయ్యావు అమ్మ నువ్వు” అనే కవిత మా అమ్మ చదివి, “నా కంట్లో నీళ్ళు తిరిగాయిరా నీ కవిత చదువుతూ ఉంటే” అంది.  నేను ఆస్కార్ వచ్చేనంతగా ఫీల్ అయిపోయా.

 “సరే ఇదంతా బాగానే ఉంది, అసలు నీ కొచ్చిన కష్టమేమిటో చెప్పమ్మ తల్లీ”, అనుకుంటున్నారా. వస్తున్నా …వస్తున్నా……..అక్కడికే వస్తున్నా. కష్టమంతా మన తెలుగుతోనె వచ్చిందండీ.
 
ఏదన్నా రాద్దామంటే, ఇంగ్లీష్ పదాలు నోటికొచ్చేస్తున్నాయి. వాటిని తెలుగులో ఏమంటారో వెంటనే బుర్రకు తట్టట్లేదు. నా మీద నాకే సిగ్గేస్తుంది, అయినా చెపుతున్నాను. నెట్‌లో ఇంగ్లీష్ టూ తెలుగు డిక్షనరీ వాడుతున్నాను. అవేవో పెద్ద పెద్ద పదాలు అనుకునేరు. రోజువారి వాడే మామూలు పదాలు. ఉదాహరణకు, “అమ్మ నాన్న నేర్పిన నీతులు పాటించేనా….బ్రతికేనా??!!  ” అనే కవిత రాస్తున్నప్పుడు, neither I can adjust, nor accept అని రాయాలి. accept నీ తెలుగులో ఏమంటారో చాలా సేపు అలోచించాను. ద రాయాలో, ధ రాయాలో, ద్ద రాయాలో తెలియట్లేదు. ఇలాంటి గజిబిజి గంధరగోళాలు ఎన్నో……..స or  ష, ఇ or ఎ, ఉ or వు…….\infty (infinity). తిట్టకండోయ్ …… ప్లీస్….ప్లీస్…ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెనో.  
 
 మెన్నీమద్య నా కొడుకు నంబర్ 1 , కొడుకు నంబర్ 2 జుట్టు పీకుతుంటే, నంబర్1 “అమ్మ he is పీకింగ్ my hair” అన్నాడు. అలా ఉంది నా తెలుగు బాష ప్రస్తుతం.
 
 
నా ఈ పరిస్తితి దారుణం కదండీ. మరో దారుణం చెప్పనా? మీకు గుండె ధైర్యం ఉందా? దయచేసి సున్నిత మనస్కులు, గుండె పోటు ఉన్న వాళ్ళు ఇక ముందు చదవరాదని ప్రార్ధన. చదివినచో జరగబోయే సంఘటనలకు నేను పూచీ కాదు.
 
రాయటం అంటే ఎలాగోలా రాసేస్తున్నా. అదంతా మనసులో నుంచీ వచ్చేది కద. రాసేయ్యటం పెద్ద కష్టంకాదు. అసలు బాధంతా టైప్ చెయ్యటంలోనే ఉంది. వత్తులు , పొల్లులు వాటికి ఇంగ్లీష్ స్పెల్లింగ్స్…..అబ్బో ఒక రకం కాదు. ‘ద’ రాయాల్సిన చోట ‘డ’ వస్తుంది and vice versa. ‘వచ్చాయి’ అనే  రాయాల్సిన చోట ‘వచ్చాయే’ అనే వస్తుంది.  
 

 ఇదంతా తలుచుకుంటుంటే, మనసులో ఎక్కడో కెలికినట్లు ఉంది. మన మూలాలు మనం మర్చిపోతే, మనం మనుషులమే కాదు. ఉగ్గుపాలతో నేర్చుకున్న బాష, దేశాంతరాలలో మరచిపోతున్నాము. ఇక మన తర్వాతి తరం తెలుగు మాట్లాడటమే గొప్ప, చదవటం దాకా ఎక్కడ? శ్రమ పడి అక్షరలైతే నేర్పించగలము, చదవటం నేర్పిచగలమా?

ఎదుటివాడి కష్టసుఖాలు ఓపికగా వినటం / చదవడం కూడా సంఘసేవేనండి. మీరిప్పటిదాకా చేసిన సంఘసేవకు జోహార్లు…నా జోహార్లు…

Many thanks for reading this……..

This entry was posted in నా అనుభవాలు, వ్యాసాలు. Bookmark the permalink.

13 Responses to నా తెలుగు కష్టాలు ఎన్నని చెప్పను….ఎవరికని చెప్పను…

 1. padma says:

  హహహహహ..
  ఇలా నవ్వేశానని కోపగించుకోకండి.చదవగానే నవ్వు వచ్చేసింది.. మరి అందులోనూ మీ తెలుగు కష్టాలు చూసేసరికి,ఇలా తెలుగులోనే కామెంట్ ఇద్దాం అనిపించింది.మరి కంప్యూటర్ తెలుగుది కాదు కదాండి!! అందుకే మీకు ఈ తిప్పలు!! మెల్లగా అభ్యాసం చేయండి అందులో కష్టం ఏమీ ఉండదు. కానీ చాలా బాగా రాశారు ప్రవీణ గారు..ఈ పోస్ట్ లో మీ నిజాయితీ నచ్చిందండోయ్ 🙂

  అన్నట్లు నా పేరు పద్మ…యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాదులో పిహెచ్.డి చేస్తున్నాను..తెలుగులో కాదులెండి.. మీ బ్లాగ్ ఫేస్ బుక్ లో చూసాను రాఘవ గారి ప్రొఫైల్ లో..అందులో అలా అప్ డేట్ చూడగానే ఇలా మీ బ్లాగులోకి వచ్చేసాను. అదేమిటో మరి మొదట ఈ పోస్టే కనిపించింది.నాకు తెలుగు మీద అభిమానం ఎక్కువ.అలా అని ఉద్దండ పండితురాలిని కాదులెండి. మీలా ఒక బ్లాగ్ రాసే ఓపిక తీరిక ఇపుడు లేవు..కాకపోతే పాపం..అపుడపుడు నా స్నేహితులని తెలుగులో చావగొడుతూ ఉంటాను!!

  ఏమాటకి ఆమాటే అండి..మీ బ్లాగులో ప్రతి పోస్ట్ బావుంది 🙂 ఇది ముఖస్తుతి మాత్రం కాదండి !! మనస్ఫూర్తిగా చెప్తున్నాను.

  ముందస్తు పరిచయం..కనీసం ముఖపరిచయం కూడా లేకుండా.. నేను చేసిన ఈ కామెంట్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినా లేక బాధపెట్టినా క్షంతవ్యురాలిని !!

 2. మీ నవ్వుని చూస్తుంటే నాకు కోపం కాదండీ, సంతోషం వేసింది. నా పోస్ట్ మిమ్మల్ని నవ్విచ్చిందంటే అదే నాకు పరమానందం. మీరు తీరిక చేసుకుని నా బ్లాగ్ చదువుతూ, నీ అమూల్యమైన అభిప్రాయాలు చెప్పాలని నా విన్నపం.

  Thanks to facebook…

 3. sudha says:

  ప్రవీణగారు,
  మీ బాల్యం కోసం వెతుకుతూ మీ బ్లాగుకి వచ్చి మిమ్మల్ని కొంచెం కష్టపెట్టానేమో.క్షమించండి.
  మీరు రాసిన పోస్టులు ఒక్కొక్కటి చదువుతూ ఉంటే మనసుకు ఆహ్లాదం కలిగింది. సంతోషంగా ఉంది.
  మీ తెలుగు కష్టాలు …నిజమే…బ్లాగులు తెలుగులో రాయాలంటే…ఎంత కష్టమో తెలుసు నాకు.
  ముఖ్యంగా మనం అనుకున్నదొకటి….అక్కడ ప్రింటయేది ఒకటి అవుతూ ఉంటుంది. కనీసం తెలుగులో పదస్వరూపం తెలిస్తే మళ్ళీ సవరించుకోవచ్చు. దానిమీద కూ డా అనుమానం ఉంటే ఇంక నిఘంటువే గతి.
  కానీ ఈ కాలం లో అందరికీ ఎస్.ఎమ్.ఎస్ లు తెలుగులో కొట్టడానికి అలవాటు పడ్డారు కదా. అలాంటివాళ్ళకి http://www.lekhini.org బాగా ఉపయోగపడుతుంది. పక్కన బాక్స్ లో ఏఏ ఇంగ్లీషు అక్షరాలు కొడితే ఏతెలుగు వస్తుందో ఇచ్చారు. చూసుకొని సవరించుకోవచ్చు.
  మీరు అదే వాడుతూ ఉన్నట్టయితే సరే.
  లేకపోతే ఒకసారి వాడి చూడండి. తెలుగు పదాలు అక్షర దోషం లేకుండా ఉంటేనే బ్లాగు చదవాలని అనిపిస్తుంది. కంటెంట్ ఎంత బాగున్నా భాష బావుండక పోతే చదవాలనిపించదు.

  • అయ్యో ఎంత మాట…మీకు నా కవిత నచ్చింది..మీరు వాడుకునే లా నా కవిత వుందంటే..అదే నాకు చాల పెద్ద గుర్తింపు.
   నాకు నిఘంటువు అవసరం చాల వుందండి. రాయాలన్న తపనే కానీ భాష మీద పటుత్యం లేదు. రోజులో తెలుగు మాట్లాడే సమయం కన్నా ఇంగ్లీష్ మాట్లాడే సమయం చాల ఎక్కువ పోయింది.
   నేను లేఖిని వాడలేదు..గూగుల్ transliteration వాడుతున్నాను . ఈ సారి లేఖిని వాడతాను. Thanks for advising me…

 4. Hari Krishna Sistla. says:

  Lot of Thanks for introducing http://www.lekhini.org
  I had to feel the one as time consuming for the new users and therefore could not dare to do the said.

 5. Hari Krishna Sistla. says:

  ఖగపతి అమ్రుతము తేగా – భుగ
  భుగ మని పొంగి బొట్టు భూమిని వ్రాలెన్
  ఫొగచెట్టయి జనియించెను
  ఫొగతాగని వాడు దున్నపోతయి ఫుట్టున్. Stood a successful user of Lekhini,I am made to feel. But was time consuming.A poem from KANYA SULKAM was been selected by me to check my patience.

 6. NIHARIKA says:

  nenu ix class chadhuvuthunnanu me kavitha naku challa bhaga nachindi nenu asalu ma telugu teacheru vyasalu rasukuni ramannaru ala vethukuthu me kavitha kanipenchindi bhaguntundani chadiva chala nachendi.Nenu rosary school lo chadhuvutha inthalo marichithini na peru niharika akka la ga chala manchi vishayalu chepparu…………
  THANK ‘U’

 7. మీ ఆలోచనలు చాల బాగున్నాయి..కష్టాలని కూడా కొత్తగా నవ్వుకునేలా చెప్పారు..రాయటం మొదలు పెట్టిన కొత్తలో నేను కూడా మీలానే ఇబ్బంది పడ్డాను…మీరు వాడండి .నేను అదే వాడుతున్నా..మీకు కుడా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నా..

 8. M. Srinivasa Rao says:

  chaalaaa baagundi aalochanaatmakaMgaa undi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s