కాలమా…..నీకెవరిచ్చారు ఇంత అధికారం?
దోసిళ్లలో ఇసుక రేణువుళ్లా జారిపోతున్నావే,
ఎంతగా పిడికిలి బిగించినా,
ఎంతగా బంథిద్దామని ప్రయత్నించినా,
అంత త్వరత్వరగా పారిపోతున్నావే!
కలల కౌగిలి కరిగిపోక ముందే,
మదిలో తలపులు తరలిపోకముందే,
ఆలోచనలు అంతమవ్వకముందే,
వెడలిపోతున్నావు…..నీ కెందుకంత తొందర?
జీవితం ఆస్వాదిద్దామన్నా,
ప్రేయసి ప్రేమలో తరిద్దామన్నా,
స్వప్నాల లోకంలో విహరిద్దామన్నా,
దేనికీ సహకరించవే?
నిమ్మతంగా పనుకు చక్కపెడదామన్నా,
ప్రశాంతంగా కాసేపు కుర్చుందామన్నా,
బద్దకంగా మరికాసేపు ఒద్దిగిల్లుదామన్నా,
తీరికగా కబుర్లు చెప్పుకుందామన్నా,
దేనికీ కాసేపు ఆగవే?
గాయం చేసేది నువ్వే, మానిపేదీ నువ్వే,
గుర్తు తెచ్చేదే నువ్వే, మరిపించేదీ నువ్వే,
బాధ పెట్టేదీ నువ్వే, సంతోషాన్నీ మోసుకొచ్చేదీ నువ్వే,
ఇంత శక్తి నీ కేవరిచ్చారు?
ఎదురుచుపులో నత్త నడక నీదే,
హడావుడిలో గుర్రపు స్వారీ నీదే,
మాతోనే ఉన్నట్లు భ్రమ కలిగిస్తావు,
సహకరించినట్లే వుంటావు,
అందీ అందనట్లు పరుగులు తీస్తావు,
నీ పరుగులో, మా అడుగులు జతపరచకపోతే,
మిగిలేది శూన్యమే!
కాలమా…..నీ కేవరిచ్చారు మాపై ఇంత అధికారం?
Good poetry, when its reading memorising the past sweet memories
I am glad that my poem recollected your memories…
సుపెర్బ్!
Thanks for responding satya garu…
Baagundi!
Thanks Padma garu
ఎంత బాగుందో.
భావాలన్నీ చక్కని పదాలతో జతకట్టాయి.
కవిత కి ఆ పేరు పెట్టినందుకు చక్కగా కుదిరింది.
Thnaks sudha garu…
praveena garu mee kavitha chala bavundi. naa bhavalannitiki meeru akshara rupam ecchinatlu anipinchindi.superb.
Thank you Seetha garu…
Pingback: ఇల్లు, పిల్లలు, ఉద్యోగం నడుమ కలవరపెట్టే ఆలోచనలు | నా అనుభవాలు….ఆలోచనలు…