నేటి మహిళ మనోగతం


నేటి మహిళల ఆలోచనలు ఈవిధంగా సాగుతూ ఉంటాయి అని నేననుకుంటాను.ఎవరినీ నొప్పించాలని నా ఉద్దేశం కాదు. పొరపాటున ఎవరన్నా నొచ్చుకుంటే క్షమించగలరు……..

నేటి మహిళ మనోగతం:

నేనొక ఆధునిక మహిళను. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ,  ఎదుగుతున్న కాలంలో పెరిగాను. మా అమ్మ నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచారు. నన్ను అన్నీ విషయాలల్లో ఎంతో ప్రోత్సహించారు. “నువ్వు అమ్మయివి, ఇలా చెయ్యకూడదు” అన్న మాట నేను ఏ నాడు వినలేదు. నా తమ్ముడితో, అన్నతోనూ  సమానంగా నేను పెరిగాను. అలాంటి అసమానత ఒకటి ఉందని విన్నానే కానే,  ఏనాడూ నేను అనుభవించలేదు.

సనాతన సంప్రదాయాల ముసుగులో నుంచీ బయట పడటానికి మొన్నటి తరం ఎంత  కష్ట  పడిందో పుస్తకాలలో చదివాను. తనను తాను నిరూపించుకోవటానికి నిన్నటి తరం ఎంత కష్ట పడిందో నాకు తెలుసు. నేటి నా తరంలో కూడా మేలిముసుగు ఉందని ఘంటాపధంగా చెప్పగలను. మొన్నటి నల్లటి ముసుగుకీ, నేటి మేలిముసుగుకీ ఎంతో తేడా ఉందని ఒప్పుకుంటాను.

సతీ సహగమనాలు, బాల్య వివాహాలు, కన్యాశుల్కాల గురించి చదువుతున్నప్పుడు  ఎంతో  వెర్రిగా, విసుగ్గా, అసహ్యంగా అనిపిస్తుంది. స్త్రీ పురుష  సమానత్యం,  స్త్రీ హక్కులు, స్త్రీ వాదం గురించి ఆవేశంగా ఉపన్యాసాలు ఇవ్వగలను. అది నా current topic. నా వరకు నేను స్త్రీలకు రిసర్వేషన్  పూర్తిగా సమర్దించలేను. స్త్రీ, పురుషలిద్దరికీ  అర్హతలు పెంచుకోవటానికి సమాన అవకాశాలు ఇచ్చినప్పుడు, రిసర్వేషన్స్ అనే మాట ఎందుకు? కొన్ని రంగాల్లో అవసరమేమో కానీ, అన్ని రంగాల్లో అవసరము అని నేను అనుకోను.

శారీరకంగా నేను మగవాడికంటే కొంత బలహీనురాలినే. నేను దాన్ని బలహీనత అనుకోను. మృదుత్యం, సున్నితత్యం అనుకుంటాను. అది భగవంతుడు నాకిచ్చిన వరం. మానసికంగా నేను ఎంతో బలవంతురాలను. ఎంత బాధనైన అదిమిపెట్టి ఉంచగలను. బాధను భరించడానికే, భగవంతుడు నాకు కన్నీటిని తోడుగా  ప్రసాదించాడు. నా కన్నీటిని చూసి నన్ను అబల అనుకుంటారు. ఆ కన్నీటి వెనుక ఎంత కష్టానైన భరించ గలిగే శక్తి ఉంది నాకు. కష్టాల్ని ఓర్చుకోవటానికి నాకు ఏ దురలవాట్ల సహాయం అవసరం లేదు. అమ్మలో మృదుత్యం నేనే, నాన్నలో కటినత్యం  నేనే.

అంతులేని లోతు నా మనసు. నేను సాధిస్తాను, సతాయిస్తాను, సాగదీస్తాను, విసిగిస్తాను. నేను విసిగించే విసుగులో అంతులేని ఆప్యాయత ఉంది. ఆప్యాయతని అర్థం చేసుకోగలిగితే అంతు లేని ఆనందం  ఉంది.

ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్న, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, నా కుంటుంభమే నా ప్రధమ ప్రాధాన్యత. ఆఫీస్ అయిపోగానే రెక్కలు కట్టుకుని వాలిపోతా ఇంట్లో. స్నేహితులు, షికారులు అన్నీ కుటుంబం తర్వాతే. ఇంట్లో అడుగుపెట్టగానే తల్లిగా, భార్యగా పరకాయ ప్రవేశం చేసేస్తా. నేను నా భర్త, అన్న, తమ్ముడు నుంచి ఆశించేది  ఒక్కటే ఒక్కటి. నాకు సాయం చెయ్యటం కాదు, నా భాద్యతలలో భాగం పంచుకో. సాయం చెయ్యటానికి, భాద్యత తీసుకోటానికి బోల్డంత తేడా ఉందని అర్థం చేసుకో. అలుపు లేకుండా శ్రమిస్తున్నా అని నేను అనను.అలుపు వస్తున్నా భరిస్తూనే పనిచేస్తున్నా. అందుకే నేను మహా శక్తివంతురాలను. ఏ మగ ధీరుడు పోటీపడగలడు నాతో????. ఏ మగ  మహారాజు ఈ సరితూనికను నిలపగలడు???

This entry was posted in నా ఆలోచనలు, వ్యాసాలు. Bookmark the permalink.

16 Responses to నేటి మహిళ మనోగతం

  1. bhanu says:

    excellent..బాగా చెప్పారు

  2. Krishna Tummala says:

    chala baagundi andi. You got good writing skills. Keep it up.

  3. Sharada says:

    Very well written!

  4. Jyothsna Kalyanam says:

    Good one pravvena …keep up the good work…..contine this for ever…congratulations once again…

  5. Deepthi says:

    Praveena….intha kashtam thecchi pettaventi naaku???? Nenu ippudu dheenini Jeff ki elaa translate chesi cheppanu???

    This is too good….

  6. Buddhavarapu Aruna says:

    The write up showcases the art of expression of the writer. And unveils the loads of thoughts of typical woman in transition period. Though not the struggle in terms of the actual gender descrimination woes the women of the past generations gone through. the psycchological and perspective aspects are well expressed.

    When it comes to the question of equality, we all are aware of the theory of Division of labour. In fact, it was initiated by the creator himself since Adam and eve days. the creation and life will be balanced and lively to all living beings, irrespective of gender, once each creature understands this core principle of division of labour. In simple words, share and progress together depending on the strenghts and drawbacks of each individual. These may vary with the changing socio economic conditions and conveniences. Any how, a good piece of expression.

    Buddhavarapu Aruna.

    • Thanks for your comment aruna garu. I liked your saying “share and progress together depending on the strengths and drawbacks of each individual”. Changes in economic conditions allowed or forced a lady to accept many more responsibilities. I guess, a modern lady happily accepted the new responsibilities, but I doubt how happily a man has accepted his new responsibilities? A man comes home after a hectic day just like his wife, but he expects the home should be very clean n neat and food should be served on table on time. Are men taking equal responsibility at home? నాకు సాయం చెయ్యటం కాదు, నా భాద్యతలలో భాగం పంచుకో…its like dream come true..may be in our generation. Our next generation may change further more..

  7. Pingback: మా గురించి మీకు పూర్తిగా తెలుసా? | నా అనుభవాలు….ఆలోచనలు…

  8. Pingback: మా గురించి మీకు పూర్తిగా తెలుసా? | నా అనుభవాలు….ఆలోచనలు…

  9. j prasad says:

    prasad

    It is the god’s gift to born as women.
    thanks to your good job.

  10. Anonymous says:

    nice saying praveena garu….very well said….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s