అనుదినం అన్నీ విజయాలే విజయాలు


అనుదినం అన్నీ విజయాలే విజయాలు


ఒక్క రోజులో ఎన్నెన్నో విజయాలు,
ఉదయాన్నే లేగవటం విజయం,
బద్దకించకుండా వ్యాయామం చెయ్యటం విజయం,
నిర్లక్షం చెయ్యకుండా దేవుడికి ధీపారాధన చెయ్యటం విజయం,
ఆలస్యం కాకుండా ఆఫీస్ చేరటం విజయం,
చేస్తున్న పనిలో లీనమవటం విజయం,
“పని బాగా చేశావు” అనిపించుకోవటం విజయం,
వాయిదా వేస్తున్న పనులు ఈ రోజే పూర్తి చెయ్యటం విజయం,
తోటి వారికి చిన్న సాయం చెయ్యటం విజయం,
ఒక్క రూపాయన్నా దానం చెయ్యటం విజయం,
మంచి పుస్తకంలో ఒక్క పేజీ అన్న చదవగలగటం  విజయం,
శ్రావ్యమైన సంగీతం ఐదు నిమిషాలన్నావినగలగటం  విజయం,
“ఇది నా కోసం” అని తృప్తి నిచ్చే  చిన్న పనైనా చెయ్యగలగటం   విజయం,
బుజ్జిగాడి చేత b,d  తికమకపడకుండా హోమ్‌వర్క్ చేపించడం  విజయం,
భర్తగారితో ఉల్లిపాయన్నా తరిగించడం  విజయం,
సమయం లేదు, తీరిక లేదు అని అనకుండా  ఈ రోజు గడపటం ఓ గొప్ప విజయం ,
రాత్రి నిద్రపోయేముందు ఈ రోజు నిర్వహించాల్సిన భాద్యతలన్నీ నేను ప్రేమగా పూర్తి చేసాను,
అని తృప్తి చెందటం  ఈ రోజు సాథించిన అతి గొప్ప విజయం.
అనుథినం ఇన్ని  విజయాలతో నేను సాగేపోతుంటే,
నా జీవితమే అందమైన విజయం.

This entry was posted in కవితలు, నా ఆలోచనలు. Bookmark the permalink.

21 Responses to అనుదినం అన్నీ విజయాలే విజయాలు

  1. Girish says:

    well said..

    and the funny success among all..
    భర్తగారితో ఉల్లిపాయన్నా తరిగించడం విజయం 🙂

    • అయ్యె అదే పెద్ద విజయం అండీ!!!!
      ఏడిపించే ఉల్లిపాయని, అదీ భర్తగారితో తరిగించడం అంటే మాటలా….

    • Anonymous says:

      kshaminchandi praveenagaru its so nice too read and ifeel happy mamlni meru tenaloluku telugulo munnchi telchutunnanduku but evala telugulo me tappu patagliganu bcause telugulo vattulu pollulu week but meve chadvadam modalu pett inaka i improved ANUDINHAMLO DHILO VATTU POTTALOCHUKKA, in 4 line NIRLAKSHYAM LO KSHA KINDA YA VATTU.But terekelene e prapanchamlo meru rasve chadvagalgutunnamu ante ade MEEEE GOPPA VIJAYAM MEKOSAM TRUPTIGA CHESEPANINI MAA ANDARE ISHTAMGA MARCHADAM CHADIVINCHADAM MEEEEEEEE VIJAYAM

      • దొరికిపోయానండీ…. పట్టేసారండీ మీరు…ఈ రకంగా మీరు తప్పులు వెతకటం మొదలు పెడితే కాస్త ఒత్తులు, పొల్లులూ వున్న ప్రతే word లోనూ వుంటాయండీ తప్పులు. వెతక్కండోయ్….తెనేలోలికే తెలుగుని ఖూనీ చేసేసానని నా మీద మీరు యుద్ధం ప్రకటించేస్తారు….. రోజులో తెలుగు మాట్లాడే సమయం కన్నా ఇంగ్లీష్ మాట్లాడే సమయం చాల ఎక్కువ కదా….పైగా చాల years ( I got scared to type year in telugu here) తర్వాత తెలుగులో రాస్తున్ననేమో…..ఇంగ్లీష్ spellings సరిగ్గా రాక, వచ్చిన తెలుగునే మర్చేపోయి……పడుతున్న బాధ అండీ…అర్థం చేసుకుంటారు కదూ..
        Many thanks for your comment. I am glad that u liked it.

  2. చాలా బాగుంది ప్రవీణ గారు:) ముఖ్యంగా
    >>భర్తగారితో ఉల్లిపాయన్నా తరిగించడం విజయం.. 😉

  3. Swathi says:

    Bagundi

  4. Anonymous says:

    chala baagunnayye madam………………

  5. harisankar marisetti says:

    chala baagunnayye madam……………………….meelantti varu telugu varu avvaddam inkaa bagunddhi

  6. harisankar marisetti says:

    super

  7. neeharika says:

    అన్ని టపాల్లోకి ఇదే నాకు బాగా నచ్చింది. బాగా రాశారు.

  8. bonagiri says:

    ఐడియా బాగుంది.

    Very simple…. positive attitude?

    కాని లేగవడం, చేపించడం కొద్దిగా…… బాగోలేదు.

  9. “లేగవడం, చేపించడం బాగోలేదు”…అర్థం కాలేదండీ??

  10. bonagiri says:

    లేవడం, చేయించడం అంటే బాగుంటుందని నా ఉద్దేశం.

  11. Pingback: సూరీడుతో పరుగు పందెం..గెలుపు నాదే :) | నా అనుభవాలు….ఆలోచనలు…

  12. Ravi babu says:

    ప్రతి ఒక్కరు మీలా ఆలోచించగలిగితే జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s