అమ్మ నాన్న నేర్పిన నీతులు పాటించేనా….బ్రతికేనా??!!


అమ్మ నాన్న నేర్పిన నీతులు పాటించేనా….బ్రతికేనా??!!

అమ్మ నాన్న నేర్పిన నీతులు,
నేటి కాలంలో నడుచుకుంటే బ్రతకగలమా?

అబద్ధమాడరాదని ఊహతెలిసిన నాటి నుంచీ అమ్మ నేర్పిందే,
అన్నీ నిజాలు చెపుతుంటే చిక్కుల్లో చిక్కుకుంటున్నానే?!!

ఎవరికీ అన్యాయం చెయ్యరాదని నాన్న నేర్పించారే,
న్యాయం న్యాయం అంటుంటే నేను అన్యాయం అయిపోతున్నానే?!!

ఎవరికీ అపకారం తలపెట్టకూడదని అమ్మ చెప్పిందే,
అందరికీ ఉపకారం చేస్తుంటే నన్నొక వెర్రివాడిలా చూస్తుందే ఈ లోకం?!!

నలుగురికీ చేతనైన సాయం చెయ్యి అని నాన్న చెప్పారే,
సాయం చేస్తుంటే నలుగురి సహకారం నాకు లేదే?!!

నీ సంపాదనలో కొంత దానం చెయ్యి  అని అమ్మ చెప్పిందే,
దానం అపాత్రదానంగా అయిపోతుందే ?!!

శుమతీ శతకాలు, వేమన పద్యాలు వల్లె వేయిస్తూ పెంచారే నన్ను,
మరి నేటి సమాజంలో ఎలా బతకాలో నేర్పించలేదే??
ఈ లోకంలో మనగలిగే  లౌక్యం నేర్పలేదే??
మనిషి రక్తంలో జీర్నించుకుపోవల్సిన విలవలు,
సందర్భానుసారం, కాలానుసారం మారిపోతాయని నేర్పలేదే??
ఈ జీవన మార్గాన్ని  అంగీకరించలేను, సర్దుకుపోలేను
సతమతమైపోతున్నాను…….

This entry was posted in కవితలు, నా ఆలోచనలు. Bookmark the permalink.

10 Responses to అమ్మ నాన్న నేర్పిన నీతులు పాటించేనా….బ్రతికేనా??!!

  1. anand says:

    nenu kuda ilaane aalochistuntanu

  2. Mauli says:

    విలువలు మారవు …పరిధి మారాలి అ౦తే అ౦డి

    • నేన్నటి తరంలో తప్పు, ఈనాడు ఒప్పుగా మరలేదూ!

      • Mauli says:

        విజ్నాన౦ , వివేచన నిన్నటి కన్నా నేడు పెరిగి౦ది . తప్పు , ఒప్పు ల Ratio యెప్పుడూ ఒకటే …

  3. శ్రీ.. says:

    “ఎవరికీ అన్యాయం చెయ్యరాదని నాన్న నేర్పించారే,
    న్యాయం న్యాయం అంటుంటే నేను అన్యాయం అయిపోతున్నానే?!!”
    మీరు చెప్పింది నిజమే కావచ్చు… కానీ … అన్యాయం చెయ్యొద్దు అని చెప్పిన నాన్నే బల్ల కింద చెయ్యి పెట్టే రకమైతే… మరి చిన్న హృదయం పరిస్థితి ఏంటి?
    పిల్లలలో గ్రాహణ శక్తి అద్భుతం… వారు చేసెవి చూసి త్వరగా నేర్చుకుంటారు….కానీ చెప్పేవి అంత త్వరగా కాదు….!!! మనం పిల్లలకు చేప్పాలంటే అవి మనం పాటించే విధం గా వుండాలి….. లేకుంటే మీరు వ్యక్త పరచిన భావాలతో పిల్లలు సతమతమౌతారు….!!!
    మంచి ప్రయత్నం…. కొనసాగించండి….

    • “పిల్లలలో గ్రాహణ శక్తి అద్భుతం… వారు చేసెవి చూసి త్వరగా నేర్చుకుంటారు….కానీ చెప్పేవి అంత త్వరగా కాదు”. చాలా కరెక్ట్ గా చెప్పారు శ్రీ గారు.
      నా హృదయపుర్వక ధన్యవాదాలు స్పందిచ్చినందుకు…

  4. Pingback: నా తెలుగు కష్టాలు ఎన్నని చెప్పను….ఎవరికని చెప్పను… | నా అనుభవాలు….ఆలోచనలు…

  5. neeharika says:

    “వెర్రి వాడిలా” అని అన్నారేంటి?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s