అతి సర్వత్ర వర్జయేత్ –మనకి ఇన్ని TV చానల్స్ అవసరమా?


మనకి ఇన్ని TV చానల్స్  అవసరమా?

ఎప్పుడైనా,ఏ weekend లో నైనా పిల్లకాయలు మనమీద దయతలచి మనకు TV చూడటానికి కాస్త time ప్రసాదిస్తే, ఓ గంట TV ముందు కూర్చుని Remote నొక్కి నొక్కీ, చానల్స్ మార్చీ మార్చీ, గంట తర్వాత ఏమి చూసామో, ఎందుకు చూసామో అర్థంకాని అయోమయ పరిస్తితి.

ఈTV, జెమినిTV లు పూర్తిగా ఏడుపుగొట్టు సీరియల్స్‌కే అంకితమైపోయాయి.ఆడవాళ్ళకు ఏడవటం అంటే ఇంత ఇస్టమా అని తలపిస్తాయి. ఏడ్చీ ….ఏడ్చీ అలసిపోనే అలసిపోరు సీరియల్ heroines. ఏ heroine చూస్తే ఏముంది, అందరికీ సినిమా కస్టాలే. ప్రపంచంలో గ్లిసరిన్ తయారుచేసే ఫ్యాక్టరీలన్నీ ఈ రెండు TV  చానల్స్ మీదే ఆధారపడి బతికేస్తున్నారా  అనిపిస్తుంది. నేను ఇండియా తిరిగి వెళ్లిపోయిన తర్వాత ఓ గ్లిసరిన్ తయారుచేసే ఫ్యాక్టరీ పెట్టుకుంటాను. బోల్డంత సంపాదించొచ్చు. ఏ marketing strategy అక్కర్లేదు. నా ఐడియా ఎవరూ దొంగిలీంచకండోయ్.

పిచ్చికి పరాకాష్ట మన Zee 24 గంటలు వాడు. వాడికి అంత మహత్తరమైన ideas ఎలా వస్తాయో మరీ! ఒక రోజంటాడు అదేదో black hole అంట. భూమ్మీద ఉన్నవన్నింటినీ ఆకర్శిస్తుందంట. ఆ program చూపిస్తూ చెపుతాడు, మనం bankలో డబ్బులు దాచుకుంటాము కద. ఆ info అంతా bank serverలో నిక్షిప్తమై ఉంటుంది కద. మరి మన black hole ఆ bank serverనీ తనలోకి లాగేసుకుంటే, మీరు దాచుకున్న డబ్బుల సంగతి మీకు ఎరుక, మీ దేవుడికే ఎరుక అంటాడు. మన దిమ్మ తిరిగిపోవాలి!. ఇక మనమందరము భూమిలో గొయ్య తీసి డబ్బులు అందులో దాచుకోవాలి. అసలు ఆ గొయ్యలో ఈ channel వాడినే పాతేస్తే సగం పీడా  వదులుతుంది. మరో రోజు అంటాడు 2012 లో లోకం అంతా అంతం అంట, ఇంకో రోజు పెళ్ళితో లావేక్కుతారా? అంటూ ఓ ప్రోగ్రామ్. ఇంకో నాడు మొగవాళ్ళు ఆడవాళ్ళను మొదట ఎక్కడ చూస్తారు అంట. అయ్యో రామా…..

ఈ మద్య ప్రతీ ఛానెల్‌లోను dance Competitions . ఆ ఏడుపులేంటో,ఆ  తిట్టుకోవడాలేంటో మరి ఆ జడ్జ్ లకే అర్థం కావాలి, చూసే వాళ్ళకు పిచ్చెక్కాలి. చివరకు చిన్న పిల్లలను కూడా వదలట్లేదు. మన ప్రజాస్వామ్య భారత దేశంలో వాక్ స్వతంత్రం ఎక్కువ కద. ఐదారేళ్ల పిల్లలతో ముదురు మాటలు, పిచ్చి స్టెప్పులు. జడ్జ్ లతో  సహా చూసేవాళ్ళందరూ వెకిలి నవ్వులు, చప్పట్లు……మనలాంటి వాళ్ళకు వికారాలు.

సరే ఇలాంటి విపరీతాలు మన వళ్ళ కాదు అని news channel పెట్టామో, అదో వైపరీత్యం. ఇదిగో విత్తనం నాటారు అని ఒకడంటే, అదిగో మహావృక్షం అయిపోయింది అని ఇంకొకడు అంటాడు. Discussions అంటూ మన మహా నేతలు కుక్కల్లా తిట్టుకుంటారు. ఇక మన TV9 వాడు ఉన్నాడూ ……ఏదో point మీద discussion పెట్టి, ఓ నలుగురు నోరున్న మేధావి నాయకులను పిలుస్తాడు. ఒక మేధావి ఇంకో మేధావిని ఇంకేదో అంటాడు. మన యాంకర్ గారు అసలు point వదిలేసి, మేధావి గారు తిట్టిన తిట్టునే విడమర్చీ, విశిథీకరించీ ఎక్కడెక్కడికో వెళ్లిపోయి, వారు తికమక పడిపోయి, చూసే మనల్నీ తికమకపెట్టీ program ముగిస్తాడు. నాయక మేధావులు గారు ఆవేశంతో పలెకెన పలుకులు రోజంతా  breaking news అంటూ scroll  చేస్తూ ఉంటాడు. పోయిన సంవత్సరము ఆంధ్ర తెలంగాణా గొడవలు జరుగుతున్నప్పుడు, ఏదో channel వాడు ఆంధ్ర, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మధ్య discussion అనే పోట్లాట పెట్టాడు. వాళ్ళు తిట్టుకున్న తిట్లు, వంటగదిలో పనిచేసుకుంటున్న నాకు వినిపించాయి. ఆ timeలో నా కెంత ఆవేశం వచ్చిందంటే, ఆ program మార్చకుండా చూస్తున్న మా వారికి బడితపూజ చెయ్యాలనీ, TVని balconyలోనుంచీ కిందకు విసిరెయ్యాలనీ వెర్రిగా అనిపించింది. ఏదీ చెయ్యలేక పాపం పిల్లలను విసుక్కుని ఆవేశం తగ్గించుకున్నాను.

ఈ new channels అన్నీ కలసికట్టుగా ఒకేలాంటి ప్రోగ్రామ్స్ ఒకే time లో telecast చేస్తారెందుకో? ఒక ఛానల్లో సినిమా గాసిప్స్ వస్తూ ఉంటాయి, ఈ సోది మనకెందుకులే అని ఇంకో ఛానల్  మార్చామా అక్కడా ఇదే సోది. మనం చచ్చేనట్టు ఎవడో ఒకడు చూపించే చెత్తనే చూసి తీరాలి. అదేదో  హీరోగారి పెళ్ళి కుదిరింది, పెళ్ళి కూతురి పెళ్ళి చీర మీద ఓ ప్రోగ్రామ్. ఆ చీర ఖరీదెంత, ఏ షాప్ లో కొన్నారు, embroidery లో ఎమి వాడారు. మనకెందుకండీ ఆ పెళ్ళి కూతురు ఏ చీర కట్టుకుంటుందో.

సరే ఏదన్నా సినిమా వస్తుంటే చూద్దామని కూర్చుంటే, మా భాలమేధావులు “అమ్మా ఈ ఆంటీ షేమ్ షేమ్, పొట్ట కనిపిస్తుంది, నడుము కనిపిస్తుంది. అమ్మ ఈ అబ్బాయి ఎందుకు అందరినీ కొడుతున్నాడు? Is he strong boy?” అంటూ వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, విసుక్కోలేక, ఎందుకు వచ్చిన గొడవరా అని ఏ హిందీ చ్యానెల్ అన్నా మార్చామా, అక్కడా ఇదే గోల.

ఈ మధ్య reality show లంట. రాఖీ కా శావారీయా అంట. అయ్యో మన రాత! అదేదో చ్యానెల్ లో ఖత్రొన్ కా ఖిలడీ అనే ఓ reality show. ఓ మగధీరడ్ని plastic bag లో పడుకోపెట్టి  , ఆ బాగ్‌లో మనం ఎన్నడూ చూడని పురుగులు బోల్డన్ని వేసి, బాగ్ జిప్ close చేసి, సొరంగం లాంటి దాంట్లోకి పంపుతారు. ఆ పురుగులు ఆ వీరుడి ఒల్లంతా పాకుతూ వుంటే live telecast. వెర్రికి పరాకాష్ట కాదండీ ఇది! ఈ ప్రోగ్రామ్ కనిపెట్టిన వాడిని, ఎవరెస్ట్ పర్వతం పైకి  తీసుకెళ్లి, అక్కడ్నుంచే క్రిందకు తోసేసి, ఇదిరా ఖత్రొన్ కా ఖిలడీ అనే చెప్పాలనివుంది.

మా చిన్నప్పుడు TV చూడటమంటే ఎంతో సరదాగా ఉండేది. ఆదివారం సాయంత్రం వచ్చే సినిమా కోసం వారం అంతా ఎదురుచూసేవాళ్ళము. సినిమా బాగుందా బాగోలేదా అనే ప్రశ్నే ఉండేది కాదు. వారం మధ్యలో వచ్చే చిత్రలహారి (తెలుగు సినిమా పాటలు) చూడటానికి మాకు పర్మిషన్ ఉండేది. ప్రతీ పాటను ఆస్వాదించేవాళ్ళము. ఆదివారం మహాభారతం వచ్చేటప్పటికి కుంకుడుకాయలతో తలారా స్నానం చేసి, కళ్ళు నలుపుకుంటూ TV ముందు కూర్చునే వాల్లము. మా నాన్న గారు మహాభారతంలో వచ్చే సీన్స్ అన్నే విడమర్చి చెప్పేవాళ్ళు. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మహాభారతం చూడటానికి మా ఇంటికి వచ్ఛేవాళ్ళు.
అతి సర్వత్ర వర్జయేత్ అని, ఇన్ని టీవీ చ్యానెల్స్ వచ్చి  మన అనందాన్ని హరించేశాయి.

This entry was posted in నా అనుభవాలు, నా ఆలోచనలు, వ్యాసాలు. Bookmark the permalink.

4 Responses to అతి సర్వత్ర వర్జయేత్ –మనకి ఇన్ని TV చానల్స్ అవసరమా?

  1. అతి సర్వత్ర వర్జయేత్

    • Thank you for correcting me. ఈమధ్యే రాయటం స్టార్ట్ చేశాను కదా, చాల తప్పులు దోర్లుతున్నాయే. రాస్తున్నప్పుడు అనిపించింద ఇదే కరెక్ట్ సెంటెన్స్ కాదేమో అనే. కానీ ఎక్కడ చూసి కరెక్ట్ చేసుకోవాలో తెలేలేదు.

  2. Anonymous says:

    >>ఇన్ని టీవీ చ్యానెల్స్ వచ్చి మన అనందాన్ని హరించేశాయి.<<

    NOT TRUE

  3. Eemi anukokandi chaala latega chustunnanu meerannadi nijame manaku inni tv channels avasamledu
    pardhasaradhi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s