నాకు ఎవరు తోడు?
శోధించాను, శోధించాను,
కాలాన్నివడపోసీ శోధించాను,
ప్రేమ అంతుల్లో శోధించాను,
ఆత్మీయత అంచుల్లో శోధించాను,
బంధాల బాహువుల్లో శోధించాను,
అనుబంధాల అణువణువులోనూ శోధించాను,
పరిచయాల పలకరింపుల్లో శోధించాను,
జన్మనిచ్చిన వారిలో శోధించాను,
జన్మించిన వారిలో శోధించాను,
తోడబుట్టిన వారిలో శోధించాను,
కట్టుకున్న వారిలో శోధించాను,
అనుక్షణం అణువణువులోనూ శోధించాను,
శోథించి శోథించీ అలసిపోయాను.
ఆ అలుపులో నన్ను నేను తట్టి చూసుకున్నాను,
నా పునాదిలో నన్ను నేను వెతుక్కున్నాను,
నా మనసు లోతుల్లో తొంగిచూసుకున్నాను,
నా ఆలోచనల్లో నన్ను నేను శోధించుకున్నాను,
అప్పుడే అక్కడే నాకు దొరికింది నా తోడు.
అమూల్యమైన నా తోడు, అక్కునచేర్చుకున్న నా తోడు,
క్షణమన్నా నన్ను వీడని నా తోడు,
నా మంచిలో, చెడులో నన్ను వారిస్తూ, వాదిస్తూ,
నేను చీదరించినా, చీత్కరించినా,
తన ఉనికినే ప్రశ్నిస్తూ, గొంతు నులిపి చంపినా ,
మళ్ళీ మళ్ళీ బ్రతుకుతూ, నన్ను బ్రతికిస్తూ,
నాకు తోడుగా నిలిచిన నా తోడు…నా అంతరాత్మ.
నన్ను మనిషిగ నిలిపిన నా ఆత్మ,
నన్ను అనుక్షణం సన్మార్గంలో నడిపిస్తున్న నా అంతరాత్మ.
నా అంతరాత్మ…..అదే నా తోడు.
Love it.
Thanks Swathi..
I did observe an excellence in your writings.You have a bright future if you get into that line, I believe.
Good.
supper… chala nachindira