అందం — ఆనందం


అందం —  ఆనందం
పసిపాప నవ్వు అందం — స్పర్శ ఆనందం
శ్రమ అందం —  ఫలితం ఆనందం
విజ్ఞానం  అందం  —  జ్ఞానము  ఆనందం
భార్య బిడ్డలు అందం —  బాద్యతలు ఆనందం
ప్రేమించడం అందం —  ప్రేమను నిలుపుకోవడం ఆనందం
కలలు కనడం అందం —  కలలు సాకారం చేసుకోవడం ఆనందం
ఆలోచనలు అందం —  ఆలోచనలు ఆచరించడం ఆనందం
చదువు అందం —  చదువుతో వచ్చే వివేకం ఆనందం
ఆశలు అందం —  ఆశలు దురాశలు కాకపోతే ఆనందం
పని చెయ్యటం అందం —   పనితో వచ్చే తృప్తి ఆనందం
మనిషికి మంచితనం అందం —    మంచిని పంచిపెట్టడం ఆనందం
మనిషికి విలువలు  అందం —   విలువలు పాటించడం ఆనందం
మనిషికి మేధస్సు అందం —  మేధస్సు సంఘానికి ఉపయోగపడితే ఆనందం
మనిషికి మనిషి అందం —  మమతానురాగాలు ఆనందం
ప్రపంచం అంతా అందం —  ప్రాణికోటి అంతా ఆనందం
అందమైన ఈ ప్రపంచంలో మనమంతా ఆనందంగా బతుకుదాం!
This entry was posted in కవితలు, నా ఆలోచనలు. Bookmark the permalink.

2 Responses to అందం — ఆనందం

  1. VenakataLakshmi says:

    Mee blog Andam, chadivithe Anandam.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s