ఫోర్జరీ ….. The దొంగ సంతకం...…….
నేను Bapatla Engineering collge లో Msc చదువుతున్నప్పటి మాట. మా class లో 8మంది అమ్మాయిలము ఉండేవాళ్ళము. మాకు మేమే 8roses అని మురిసిపోయే వాళ్ళము. మేమందరమూ hostelలో ఉండేవాళ్ళము. hostel నుంచీ బాపట్ల మహానగరం వెళ్ళాలంటే warden గారి పర్మిషన్ తీసుకోవలె. మా hostel గేటు దగ్గర security guard అనే యమకీంకరుడు ఉండేవాడు. వార్డన్ గారు సంతకం చెసెన లెటర్ చూసీ, పరీక్షీంచీ మమ్మల్ని బయటకు పంపేవాడు.
ఒకానొక శుభసమయాన….. కాదు కాదు రాత్రి సమయాన, పుస్తకాలు ముందేసుకుని, చదువు సంగతి మార్చిపోయి, సొల్లు కబుర్లు చెప్పుకుంటున్న వేళ….మాలో ఒక రోజా పువ్వుకు మర్నాడు ఉదయాన్నే మహానగరంలో ఉన్న గుడికి వెళ్ళాలనే కోరిక ఉద్బవించిందీ. ఆ మహత్కర్యానికి మిగతా రోజా పువ్వులు తలాడించగా, ఓ ప్రణాలిక సిద్దమైంది. వార్డన్ గారికి విన్నతి పత్రం రాసి, దానిపై ఓ పోర్జరీ సంతకం చేసేద్దాం అని తీర్మానం చేసేసాం. అసలే అమ్మయిలం కదా, ఎంత లేదనుకున్నా కాదనుకున్న బుద్దిమంతులం, గోడలు దూకడం, కొట్టుకోవడం లాంటి రౌడీ పనులు చేయము. ఏదో ఇలా అబద్దాలు చెప్పడం, దొంగ పనులు చెయ్యటం మాత్రమే చెయ్యగలము.
మొత్తానీకి విన్నతి పత్రం సిద్దం చేసేసాం. తీరా సంతకం చేసెద్దాం అని చూసేసరికి వార్డన్ గారి సంతకం నమూనా ఎవ్వరి దగ్గరా లేదు. వేరే ఎవ్వరినైనా అడుగుదాము అంటే మొహమాటం, సెగ్గుచేటు. పైగా అడిగితే వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారో అనే పీకులాట.
కాలుగాలిన పిల్లుల్లాగా హాస్టల్ అంతా అటు ఇటూ తిరుగుతూవుంటే, ఓ మెరుపు మెరిసిందీ……ఉరుము ఉరిమిందీ….. ప్రతీ నెలాఖరకు మెస్ ఛార్జీల చిట్టా గోడకు అతికిస్తారు. అందులోనే ఉంది వార్డన్ గారి సంతకం. యురేకా తకమిక….దొరికిపోయింది. ఇప్పుడు కాపుకాసిన పిల్లుల్లాగా హాస్టిల్ అంతా సద్దుమనిగే దాకా వేచిచూసి, మా యమకీంకరుడు(security guard ) కంటపడకుండా, వార్డన్ గారి సంతకం ఉన్న బిల్లు పేపర్ నీ జాగ్రత్తగా చింపగలిగాం.
ఇంకేం ఉంది చక చకా ఫోర్జరీ చేసేసీ, మర్నాడు ఉదయమే గుడికి వెళ్ళీ, దేవుడికి మొక్కేసుకున్నాము, మా తప్పులు అన్నీ క్షమించమనీ, పరీక్షలకు నెల ముందు చదివిన చదువుకు super duper మార్కులు ప్రసాదించమనీ.
amma….praveena….ee story naaku theleedhay. I enjoyed reading it but knowing you, I am not surprised at all….ha ha ha
manam anta okate type kada..
alochana bagundi I
like it