నేను అమ్మనయ్యాక అర్థమయ్యావు అమ్మ నువ్వు


నేను అమ్మనయ్యాక అర్థమయ్యావు అమ్మ నువ్వు


ఆరు నెలల నా కూతురు పాలు తాగనని మారాం చేస్తుంటే,
ఆరేళ్ల నా కొడుకు అన్నం తిననని విసిగిస్తుంటే,
పదహారేళ్ల వయస్సులో, పాతికేళ్ల వయస్సులో,
ఈ కూర బాగోలేదు, ఆ కూర బాగోలేదు,
రోజు ఇదే వండుతావేంటి అంటూ నిన్ను విసిగిస్తుంటే,
నువ్వు పడ్డ బాధ నాకు ఇప్పుడు అర్థమవుతూంది అమ్మ!

ఆఫీస్ నుంచీ సాయంత్రం  నేను ఇంటికి తిరిగివచ్చాక,
ఓపిక ఉన్నా లేకపోయినా,
కనీసం పిల్లలకోసమన్న వంట చేస్తుంటే,
ఎప్పుడు నీ అలుపు మాకు తెలేకుండా,
వండి వార్చినా నీ అలుపు,
నాకు ఇప్పుడు అర్థమవుతూంది అమ్మ!

నా కొడుకు, కూతురు ఇల్లంతా బొమ్మలు విరజిమ్మి,
ఆటలతో అలిసి సొలసి నిద్రాపోతుంటే,
ఇల్లంతా నేను సర్దుకుంటున్న వేళ,
మా చదువు ఎక్కడ బగ్నమవుతుందో అని,
ఇంటిడి చాకేరీ నువ్వే చేసుకుంటూ పడ్డ అవస్త,
నాకు ఇప్పుడు అర్థమవుతూంది అమ్మ!

పెన్సిల్ సరిగ్గా పట్టుకోవటం చేతకాని నా కొడుకు చేత home work చేపిస్తుంటే,
వాడు తప్పులు రాస్తుంటే,
నా పదహారేళ్ల వయస్సులో చదువు విలువను నువ్వు నాకు నూరిపొస్తుంటే,
నేను నిన్ను విసుక్కున్న వేళ,నువ్వు పడ్డ బాధ,
నాకు ఇప్పుడు అర్థమవుతూంది అమ్మ!

నా కొడుకు, కూతురు మొట్టమొదటి సారి స్కూల్ కి వెళ్తూ ఉంటే,
నా పెళ్ళి నాడు నీ కంట్లో తిరిగిన కన్నీళ్ళు ,
ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయి అమ్మ!

ఆరేళ్ల నా కూతురు,
నేము ఎంపిక చేసిన డ్రెస్ వేసుకోకుండా,
తనకిస్టమైన డ్రస్ వేసుకున్న వేళ,
పాతికేళ్ల వయస్సులో నేను నీకు ఎదురు చెప్పిన వేళ,
నువ్వు పడ్డ బాధ నాకు ఇప్పుడు అర్థమవుతూంది అమ్మ!

నా కొడుకు స్కూల్ లో ఎవరితోనో పోట్లాడి వస్తే ,
నేను ఆ సంగతి వాడి నాన్నకు చెపితే,
వాడి నాన్న వాడిని మందలిస్తున్న వేళ,
వాడు నా వైపు చూసిన చూపులో,
కాలేజ్లో నేను చేసిన తప్పోప్పులకు నాన్న నన్నుమందలిస్తుటే,
అవన్నీ నువ్వే నాన్నకు చేరవేశావని,
నిన్ను సాదించిన వేళ,
నువ్వు పడ్డ బాధ నాకు ఇప్పుడు అర్థమవుతూంది అమ్మ!

ఎంత ఆలస్యంగా అర్థం చేసుకున్నాను అమ్మ నిన్ను నేను ,
నన్ను క్షమించవూ!!!

డియర్ ఫ్రెండ్స్, మీరేమంటారు?ఇందులో నిజం లేదూ?
This entry was posted in కవితలు, నా అనుభవాలు, Uncategorized. Bookmark the permalink.

14 Responses to నేను అమ్మనయ్యాక అర్థమయ్యావు అమ్మ నువ్వు

 1. kamali says:

  ur right ………
  nice post.nenu inka a stage ki rala before that i saw ur post so atleast now i try to help my mom in her work now.

 2. బాగా రాసారు .

 3. Deepthi says:

  very very touching….this is a tribute to not just your mom but to all moms (especially manalaanti raakshasulani bharichina andari moms ki 😉 Good one, raa.

 4. VenakataLakshmi says:

  Antha baagane vundi kaani, intaki, kuturiki 6 years aa, kodukki 6 years aa. I guess one of them, but it seems like you haven’t decided who is 6 years. Other one 6 months, how do they allowed to goto school???

 5. Pingback: నా తెలుగు కష్టాలు ఎన్నని చెప్పను….ఎవరికని చెప్పను… | నా అనుభవాలు….ఆలోచనలు…

 6. same feeling..:) thanks for the link.
  see this link also..my another similar post:
  http://trishnaventa.blogspot.com/2009/05/appuduippudu.html

 7. thotakuri says:

  ఇది నిజం కాదు అని ఒక్కరినైన చెప్పమనండి …..ఇది అక్షర సత్యమండి ప్రవీణ గారు… అసలు ఇంత మంచిగా ఎలా రాయగల్గుతున్నారండి! మీకు ఆ భగవంతుడు నిండా నూరేళ్ళ ఆయుశ్స్ ని ఇవ్వలని కోరుకుంటున్నాను . అద్భుతమైన ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి మీలో..

 8. v.aruna says:

  chala chala bavundi parveena garu.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s