మా ఇంట్లో తెలుగు బడి …. ఫలితం


మా ఇంట్లో తెలుగు బడి …. ఫలితం
ఈ మధ్య మా వారు పిల్లలకి తెలుగు అక్షరాలు నేర్పించాలని కంకణం కట్టుకున్నారు. పిల్లలు ఇప్పుడిప్పుడే  ABCDలు నేర్చుకుంటున్నారు, confuse అవుతారేమో కొంచెం ఆగుదాం అని నేను  వాదించినా   వినలేదు. పైగా నేను కూడా KG2  కి వెళ్తే మల్లీ హింది ఒకటి మొదలు అవుతూంది,  ఇప్పుడే నేర్చుకోవటం better ఏమో అనీ ఉరుకున్నా.
ఇక చూసుకోండీ ప్రతీ weekend మా ఇంట్లో ఒక తెలుగు వీధి బడి మొదలు. నేను ఎందుకు వీధి బడి అన్నానో మీకు కొంచెం సేపట్లో అర్థమైపోతుంది.
ఈయన ఒక తెలుగు అక్షరాల chart గోడకు తగిలించారు. మోన్నేమద్య మేము సెలవలకు ఇండియా వెళ్లీనప్పుడు, మా నాన్న గారు bigshopper bag ఒకటి పడేస్తుంటే నేను దానికి ఉన్న రెండు కర్రలు ఈ దేశం దాకా మెసుకొచ్చా.  పిల్లల్ని  బయపెట్టటానికి ఉంటాయనీ. నన్ను మరీ అంత రాక్షసీ అనుకునేరు!! నాకు నాలుగున్నర వయసూ ఉన్న ఇద్దరు మొగ పిల్లలు (కవలలు ). ఇంక మేరే ఉహించుకోండీ నా పరీస్తితి.
సరే అసలు విషయానికి వద్దాం. weekend లో  బ్రష్, పాలు ఐనతర్వాత ఈయన ఆ కర్ర(బెత్తం)  తీసుకుని గోడకి తగెలించిన చార్ట్ దగ్గర నుంచుంటారు. పిల్లలేమో సోఫా ముందు నేల మీద కూర్చోవాలి. Kids are not allowed to sit on the sofa! I don’t know why?
first మావారు అ అమ్మ, ఆ ఆవు అంటూ పిల్లతో  అనిపిస్తారు. ఆ తర్వాత పంతులుగారు కుర్చీలో ఆసీనులవుతారు. అబ్బాయేలిద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చీ చేతులు కట్టుకునీ మరే అక్షరాలు ఒప్పాచెప్పాలి.
ఆ తర్వాత రాత కార్యక్రమం. ఇప్పుడు కూర్చీ బల్లల మెద కూర్చోవచ్చు.  అసలే మన తెలుగులో curves ఎక్కువ కదా అందుకనే ఈ మాత్రం సౌలభ్యం అనుకుంట. మొత్తానికీ  అ, ఆ, ఇ, ఈ నేర్చుకున్నారు.
అసలు కధ ఇప్పుడే మొదలయి౦ది. ఈ నాలుగు తెలుగు అక్షరాలు నేర్చుకున్న తర్వాత మా బాలమేధావులు number 6 రాయమంటే అస్టవంకర్లు తిప్పీ  అ shape లోను, G రాయమంటే ఆ shape లోను రాస్తున్నారు. E అంటే elephant బదులు ఏ,ఈ elephant అంటున్నారు.
ఏమీ తత్ కర్తవ్యం? మీ సలహా చెప్పండీ.

This entry was posted in నా అనుభవాలు, వ్యాసాలు. Bookmark the permalink.

4 Responses to మా ఇంట్లో తెలుగు బడి …. ఫలితం

  1. Raveen says:

    I feel though we (elders) are racing; Kids (Bhagavanthuni swaroopam antaru kada) have their own faith in simple joys in life.. This funniest behavior will be ‘sweet memories’ to you.. In my opinion, infact no one used to understand my writing till I was on IV standard where in one of my teacher changed my writing; I learnt Hindi in VIII & English in IX (interestingly).. Enjoy kids !!!!

  2. VISHNU says:

    interesting. Generation is changing. somehow we shall also change our attitudes.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s