బాల్యం…పల్లెటూరులో


బాల్యం…పల్లెటూరులో
బాల్యం….ఎంత  అందమైన  అనుభవం
ఎంత  మధురమైన  జ్ఞాపకం
ఇంతలోనే  అంత  ఎదిగిపోవాలా!?
కాలం  కాసేపు  ఆగెపొకూడదు!

ఎప్పుడెప్పుడు  సెలవలు  వస్తాయా  అనే  ఎదురుచూపులు
ఎప్పుడెప్పుడు  ఊరెలదామా అన్న ఆత్రం
రైలుబండి  కోసం ఎదురుచూపులు
కిటికీ సీటు కోసం పోట్లాటలు
అమ్మ అరుపులు, అలకలు…

అమ్మమ్మ గోరుముద్దలు, మామయ్య ముచ్చట్లు
ఊగిన ఉయ్యాల, చదివిన పుస్తకాలూ
వెన్నెల్లో వేసిన మంచాలు
చెప్పుకున్న కబుర్లు, నేస్తాలతో ఆడిన ఆటలు
సపోటా చెట్టు కింద  పొయ్యి , వండిన వంటలు
వేసుకున్న అమ్మ పాత జడగంటలు, ఆడుకున్న పాత సైకిల్
సన్నజాజి పందిరి, ఎర్రగా పండిన గోరింటాకు
వెతికిన కొద్దీ అలమ్మర్రులో దోరికే వస్తువులు

కాగితపు పూల చెట్టు
పెట్టుకున్న ముక్కుపుడక
ధాన్యం బస్తాలఫై  చేసిన నృత్యం,

తొంగి తొంగి చూసిన బావి,
నీళ్ళు నేనూ తోడతా అని చేసిన అల్లరి
కావడితో మామయ్య తీసుకొచ్చిన  చెరువు  నీళ్లు
పొద్దుగూకిందే అన్నం తినండ్రా  అంటూ అమ్మమ్మ అరుపులు,

కోళ్ళతో అడిన కబాడీ
గడ్డి  తినిపించిన గేదెలు
కోడిపెట్టిన గుడ్డు కోసం వెతుకులాట
చెల్లేతో వెళ్లిన గ్రంధాలయం
పుస్తకం కోసం పోట్లాట
అమ్మమ్మ వండిన బూరేలు
తినమని బతిమాలిన కబుర్లు
కుండలో చల్లని నీళ్లు
అమ్మానాన్నల పెళ్ళీ ఫోటో
సంక్రాంతి దేవుడి ఊరేగింపు, సమర్పించినా కొబ్బరికాయ
సెలవులు ఇపోయాయే  అనే దిగులు

ఇవన్నీ అప్పుడే జ్ఞాపకాలు ఇపోయాయా!
ఎంత వేగం  ఈ కాలగమనం
కాలాన్నే నా గుప్పెట్లో బంధి౦చగలిగితే
బాల్యం దగ్గరే ఆగిపోతాను.

This is purely my experience. I am sure many of us share at least few things in it who has grand parents in a village.  I always feel our kids are missing all these natural experiences rather they sit with computer games or idiot box (TV)

This entry was posted in కవితలు, నా అనుభవాలు, Uncategorized. Bookmark the permalink.

7 Responses to బాల్యం…పల్లెటూరులో

 1. Pallavi says:

  chala bavundi akka..marchipotunna memoriesni tatti lepavu…elamarru loni holidays will be memorable throughout our lives.

 2. premalekha says:

  ప్రవీణ గారు.. మీ కవిత చదవగానే మనసు మా వూరిపై మళ్లిందండీ…

 3. Balu KBK says:

  గుడ్డు కోసం వెతుకులాట అంటే ఒక విషయం గుర్తు వచింది.. చిన్నప్పుడు కొన్ని మొక్కజొన్న గింజలు వేసా పెరట్లో, నాటాక వాటర్ పోసిన గంటకి వెళ్లిచూసా ఎంత పెరిగిందో అని .. రోజు స్కూల్ నుండి రాగానే బ్యాగ్ ఓమూలా పడేసి మొక్క వచ్చిందో లేదో చూడటానికి పరిగెత్తేవాడిని.. 6-7 పొత్తులు వచాయి మొత్తానికి .. ఒక రకమైన విజయ గర్వంతో పక్క ఇంటివాళ్ళకి .. ఎదురింటి వాళ్ళకి పంచా

 4. ashok kumar says:

  its nice and make me 2 to recollect my childhood things

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s