కష్టం
ఉవ్వెత్తున ఎగిసిన కన్నీటి అలలో
నేను కొట్టుకుపోలేదు, ఎదురీదుతూ ఒడ్డుకు చేరుకున్నాను
మరింత పునీత మైన నేను,
అలలతో తీరానికి చేరిన
గవ్వలు, ఆల్చీప్పలు ఏరుకొని
మరింత ఆస్తి సమకూరిందన్న తృప్తితో
ఆటుపోటుల కడలిని
కనుసైగతో పరిహాసమాడాను
నీవు నన్ను వంచీద్దామని ఎంత ప్రయత్నీంచినా
నీ వద్ద సైతం ఆస్తిని సమకూర్చుకున్నానేకానీ
నీను నీకు తలవంచలేదు సుమా అనీ…
Pingback: సూరీడుతో పరుగు పందెం..గెలుపు నాదే :) | నా అనుభవాలు….ఆలోచనలు…