నునులేత కిరణాలు గోరువెచ్చటి హంగులు కూర్చుకుని
నా కోసమే ఉదయిస్తున్నాయి
ఆ హంగులు నా దరికిచేరకముందే
కలువ పువ్వు కంగారుగా విచ్చుకొంది
తన హొయలు సైతం నాకు చూపించాలనే
కనురెప్పల సవ్వడికి బెదిరిపోతున్న స్వప్నాన్నే
పొదిగి పట్టుకుని మదిలో భద్రంగా దాచాను.
రెప్పలు రెండూ విడవడగానే కనుపాప
ఆనందంగా ఆస్వాదించి౦ది సుర్యోదయన్నే
అనుభవం నేర్పెన పాఠాలతో
కర్తవ్యం యిచ్చిన స్పూర్తితో
జ్ఞాన౦ యిచ్చిన ఆస్తితో
మొదలు పెట్టాను మరో కొత్త రోజుని.
ప్రకృతిలోని అణువణువు నాకు స్పూర్తినిస్తునే వుంటుందీ
పడిలేచే కెరటాల సాగరం,
ఎడారిలో సైతం మనగలుగుతున్న ఒంటె,
ఎదుగుతున్న చెట్టు, నేలకొరుగుతున్న పువ్వు,
నేశ్చాలంగా, నిర్బయంగా వుండే పర్వతం,
కూలిన సౌధాన్నీ ఓర్పుగా, నేర్పుగా నిర్మీచుకుంటున్న సాలీడు,
క్రమశిక్షణలో బారులు తీరిన చీమలు
యీలా సర్వప్రాణకోటి నాకెన్నో పాఠాలు నేర్పుతున్నాయి.
పరుగెత్తే సూర్యుడుతో, సాగేపోయే కాలంతో
ఓర్పుగా , నేర్పుగా స్వారీ చేస్తున్నాను.
సూర్యకిరణాలు నా సహనాన్నే పరీక్షీంచటానికే,
మధ్యాహ్నం భగ్గున మ౦డినా, మబ్బుల చాటున దాగెన,
అదే చిరుమంధహాసంతో సాగిపోతూ వుంటాను.
నా చెదరని భావాలకు బెదిరిపోఈన భాస్కరుడు,
మళ్ళే చల్లబడతాడు హయినివ్వటానికే.
అందమైన ఆ అస్తమయం అలా నిలిచిపోతే అందవిహీనం అవుతుందేమో
అందుకే పాపం భాస్కరుడు భాదగా వీడుకోలు చెపుతున్నాడు.
ఆ వెనువెంటనే మరో సుందరద్రుశ్య౦ నా కోసం వేచివుంది.
చిమ్మచీకటిలో మిలమిలా మెరిసే నక్షత్రాలు, పాలుకారే చంద్రబింబం
మరొక అనుభవాన్నే జతచేర్చే పాఠాలు నేర్పుతుంది
అలసటతో వాలిన కనురెప్పలు మరొక సుందర దృశ్యాన్నీ నాకందిస్తాయి.
“ఈ సొగసు, సింగారాలు నావేనన్న గర్వం నాది కానే కాదు
ఆ హంగులు, హొయలు నాకోసమే నన్న గర్వం వాటివే!”
mee kavithvam chala bavundi….
Thank you..
Awesome… keep writing…
Thank you..These appreciation gives me encouragement to write…
Pingback: సూరీడుతో పరుగు పందెం..గెలుపు నాదే :) | నా అనుభవాలు….ఆలోచనలు…